iDreamPost
android-app
ios-app

Brazil Plane Crash: వీడియో: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం! 62 మంది మృతి!

  • Published Aug 10, 2024 | 8:07 AM Updated Updated Aug 10, 2024 | 8:07 AM

దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మరో 40 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది అనగా.. ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. ఈ భయాన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మరో 40 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది అనగా.. ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. ఈ భయాన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Brazil Plane Crash: వీడియో: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం! 62 మంది మృతి!

గత కొంత కాలంగా విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రయాణికులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మరో 40 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది అనగా.. ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 58 మంది ప్రయాణికులతో సహా నలుగురు సిబ్బంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక విమానం కుప్పకూలే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రెజిల్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. వియోపాస్ ఎయిర్ లైన్స్ కు చెందిన టుర్బోపాస్ విమానం 58 మంది ప్రయాణికులతో సహా నలుగురు సిబ్బందితో కాస్కావ్ నుంచి సావో పాలో వెళ్తోంది. మరో 40 నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది అనగా.. 80 కి.మీ దూరంలో విన్ హెడో అనే ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది. గాల్లోనే గింగిరాలు తిరుగుతూ నివాస ప్రాంతాల మధ్య క్రాష్ అయ్యింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న 62 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రమాదం జరిగిన వెంటనే దట్టమైన పొగలు అల్లుకున్నాయి.

flight accident in brazil

ఇక ఈ విషాదకరమైన ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు లుయూజ్‌ లులా డసిల్వా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని విచారణకు ఆదేశించాడు. ఇక ఈ ఘటనపై వియోపాస్ ఎయిర్ లైన్స్ స్పందించింది. విమానం పరానా రాష్ట్రంలోని కాస్కావ్ నుంచి సావో పావ్‌లోకు వెళ్తుండగా విన్‌హెడ్‌లో జనావాసాల మధ్య కూలిపోయినట్టు తెలిపింది. సావ్ పాలోకు 80 కి.మీ. దూరంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించింది. కానీ ప్రమాదానికి కారణాలు మాత్రం తెలపలేదు.