iDreamPost
android-app
ios-app

అందం అంటే పిచ్చి.. వయసు తగ్గించుకోవటానికి ప్రతీ ఏటా 16 కోట్ల ఖర్చు!

  • Published Sep 02, 2023 | 1:51 PM Updated Updated Sep 02, 2023 | 1:51 PM
  • Published Sep 02, 2023 | 1:51 PMUpdated Sep 02, 2023 | 1:51 PM
అందం అంటే పిచ్చి.. వయసు తగ్గించుకోవటానికి ప్రతీ ఏటా 16 కోట్ల ఖర్చు!

అందంగా కనిపించాలని ఎవరు కోరుకోరు. ఎంత వయసు వచ్చినా.. యవ్వనంగా కనిపించాలని అనుకునే వారు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందంగా కనిపించడానికి వర్కవుట్లు.. ఫేయిర్‌నెస్‌ ‍క్రీములు, డైట్‌లు, సర్జరీలు ఇలా నానా తిప్పలు పడేవారు కూడా లేకపోలేదు. అయితే, అందంగా కనిపించడం అన్నది కొన్ని సార్లు ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. నిజం చెప్పాలంటే డబ్బున్న వాళ్లకు అందంగా లేదా యవ్వనంగా కనిపించటం తేలికైన పని. కోట్లు ఖర్చు పెట్టైనా సరే అందంగా కనిపిస్తారు.

బ్రియాన్‌ జాన్సన్‌ అనే ధనికుడు కూడా అందంగా.. యవ్వనంగా కనిపించాలని అనుకున్నాడు. ఇందుకోసం ప్రతీ ఏటా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఆ ఖర్చు తగ్గట్టుగానే 45 ఏళ్ల ఆయన ఇప్పుడు 35 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఆరోగ్యపరంగా చూసుకుంటే అతడి వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. 16 కోట్లు ఖర్చు పెట్టి 10 ఏళ్ల వయసు తగ్గించుకున్న ఇతడి గురించి ప్రపంచ వ్యాప్తంగా వార్తలు రావటం మొదలైంది. దీంతో ఆయన కొత్త వ్యాపారిని శ్రీకారం చుట్టాడు.

 ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆయిల్‌ను అమ్ముతున్నాడు. ఆ ఆయిల్‌ వాడటం వల్ల యవ్వనంగా కనిపిస్తారని అంటున్నాడు. ఒక్కో బాటిల్‌ను దాదాపు 3 వేల రూపాయలకు అమ్ముతున్నాడు. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆయిల్‌ అంటే ఏదో అనుకునేరు. అది ఆలివ్‌ ఆయిల్‌. ఈ ఆయిల్‌ను వాడటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపాడు. ఆ బాటిళ్లు బాగానే అమ్ముడుపోతున్నాయి. మరి, యవ్వనం వస్తుందంటూ.. ఎక్స్‌ ట్రా వర్జిన్‌ ఆయిల్‌ బాటిల్‌ను 3 వేలకు అమ్ముతున్న బ్రియాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomjojobetjojobetcasibomcasibomcasibomgrandpashabetşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobetcratosroyalbetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom