iDreamPost
android-app
ios-app

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. సంచలన నిర్ణయం తీసుకున్న మాజీ ప్రధాని

  • Published Aug 06, 2024 | 11:51 AM Updated Updated Aug 06, 2024 | 12:35 PM

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే దేశం విడిచి వెళ్లిన ప్రధాని.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే దేశం విడిచి వెళ్లిన ప్రధాని.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..

  • Published Aug 06, 2024 | 11:51 AMUpdated Aug 06, 2024 | 12:35 PM
Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు.. సంచలన నిర్ణయం తీసుకున్న మాజీ ప్రధాని

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. రిజర్వేషన్ల మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. అంతేకాక ధనవంతులు, సెలబ్రిటీల ఇళ్ల మీద దాడి చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా.. దేశం నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆందోళనలకు ముఖ్య కారణం.. కొన్ని రోజుల క్రితం బంగ్లా ప్రభుత్వం బంగ్లాదేశ్‌ విముక్తి కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్  కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంతో ఈ ఆందోళనలు చెలరేగాయి.

అయితే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విద్యార్థులు ఉద్యమబాట పట్టారు. ప్రారంభంలో శాంతియుతంగా మొదలైన ఆందోళనలు ఆ తర్వాత హింసాత్మకంగా మారి వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది. కోటాను కుదించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలకు హసీనా సర్కారు అంగీకరించింది. అయినా మళ్లీ ఘర్షణలు చెలరేగడంతో హసీనా పదవి నుంచి దిగిపోక తప్పలేదు. రాజీనామా చేసి మరీ దేశం నుంచి వెళ్లిపోయారు. ఇక బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హసీనా కుమారుడు, ఆమెకు సలహాదారుగా పనిచేసిన సాజీబ్ వాజెద్ జాయ్ తన తల్లి రాజీనామాపై స్పందించారు.

ఈ సందర్భంగా వాజెద్‌ మీడియాతో మాట్లాడుతూ.. హసీనా మళ్లీ రాజకీయాల్లోకి రాకపోవచ్చని తెలిపారు. తన భద్రత, కుటుంబ క్షేమం కోసమే ఆమె దేశం విడిచి వెళ్లారని చెప్పుకొచ్చారు. ఆమె కష్టపడి పనిచేయడంతోనే వెనుకబడిన దేశంగా ఉన్న బం‍గ్లాదేశ్‌ అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందని గుర్తు చేశారు. కొన్నాళ్ల వరకు పేద దేశంగా ఉన్న బంగ్లా.. హసీనా తీసుకున్న నిర్ణయాల వల్లే అభివృద్ధి చెందుతున్న దేశాల స్థాయికి చేరుకుందున్నారు. అంతేకాక ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్‌గా మారే ప్రమాదం ఉందని వాజెద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

‘షేక్ హసీనా ప్రస్తుత వయసు 77 ఏళ్లు.. ఏది ఏమైనప్పటికీ ఇదే ఆమె చివరి పదవీకాలం కానుంది. బంగ్లాను పేద దేశం నుంచి మధ్యతరగతి ఆదాయ దేశంగా మార్చడానికి ఆమె చాలా కష్టపడ్డారు.. ఇప్పుడు మీకు షేక్ హసీనా అక్కర్లేదు.. ఇకపై ప్రతిరోజూ మైనారిటీలు హత్యలు జరుగుతాయి.. తిరిగి ఆమె రాజకీయాల్లోకి రారు’ అంటూ వాజెద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక హసీనా ఆదివారమే రాజీనామా చేస్తానని నిర్ణయించుకున్నారని, కుటుంబం అభ్యర్ధనతో దేశం విడిచి వెళ్లారని అతడు తెలిపారు. రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు జాయ్.. లేదని బదులిచ్చారు. ఈ దేశం కోసం తమ కుటుంబం మూడుసార్లు త్యాగాలు చేసిందని, రాజకీయాల్లోకి తాను రావడం లేదని తెలిపారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పౌరులు అర్హుడైన నాయకుడ్ని ఎన్నుకుంటారని చెప్పుకొచ్చారు.