iDreamPost
android-app
ios-app

బంగ్లాదేశ్ ఇందిరా గాంధీ షేక్‌ హసీనా కథ! 5వసారి ప్రధానిగా ఎలా గెలిచింది?

Bangladesh PM Sheikh Hasina: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. 5వ సారి సింహాసనాన్ని అధిష్టించనున్నారు. ప్రజల్లో తిరుగులేని నాయకురాలిగా పేరు తెచ్చుకున్న ఆమె స్టోరీ మీకోసం..

Bangladesh PM Sheikh Hasina: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. 5వ సారి సింహాసనాన్ని అధిష్టించనున్నారు. ప్రజల్లో తిరుగులేని నాయకురాలిగా పేరు తెచ్చుకున్న ఆమె స్టోరీ మీకోసం..

బంగ్లాదేశ్ ఇందిరా గాంధీ షేక్‌ హసీనా కథ! 5వసారి ప్రధానిగా ఎలా గెలిచింది?

ఆడవాళ్లను ఇంటిని నుంచి బయటకు పంపాలంటే ఆలోచించే రోజులవి. ఉద్యోగం, రాజకీయం లాంటి వంటే.. అస్సలు ఊహకందని విషయాలు. అలాంటి ఆ రోజుల్లో ఓ మహిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ప్రజా హక్కుల కోసం పోరాటు చేసింది. జైలుకు వెళ్లింది. అలా ఒక్కసారో.. రెండు సార్లో కాదు.. లెక్కలేనన్ని సార్లు జైలుకెళ్లి వచ్చింది. అయినా తన పోరాటాన్ని ఆపలేదు. పోరాటాల్లో రాటుదేలి.. రాజకీయ రంగంలో తిరుగులేని శక్తిగా మారారు. దేశంలో అత్యంత శక్తివంతమైన పదవిగా భావించే ప్రధానిగా మారారు. ఓ లేడీ ప్రధాని అవ్వటం ఒక ఎత్తయితే.. ఆ లేడీ మకుటం లేని మహా రాణిలా వరుసగా ప్రధాని మంత్రి పదవిని అలంకరిస్తూ ఉండటం విశేషం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆ మకుటం లేని మహారాణి మరెవరో కాదు.. బంగ్లాదేశ్‌ప్రధాన మంత్రి షేక్‌ హసీనా వాజెద్‌.

విద్యార్థి దశనుంచే రాజకీయాల్లో..

షేక్‌ హసీనా బంగ్లాదేశ్‌ విభజనలో కీలకంగా వ్యవహరించిన షేక్‌ ముజిబర్‌ రెహ్మాన్‌ కూతురు. ఈమె 1968లో ప్రముఖ బంగ్లాదేశీ సైంటిస్టు ఎమ్‌ఏ వాజెద్‌ మియాను వివాహం చేసుకున్నారు. ఢాకా యూనివర్శిటీలో చదువుతున్నప్పటినుంచే ఆమె రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వస్తున్నారు. 1960లో తండ్రిని పాకిస్తానీ ప్రభుత్వం అరెస్ట్‌ చేయించింది. ఆ టైంలో తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఆమె కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం హసీనాతో పాటు ఇతర కుటుంబసభ్యుల్ని కూడా అరెస్ట్‌ చేసింది. 1971లో బంగ్లాదేశ్‌ ఏర్పాటు కోసం ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఇందుకోసం యుద్ధం కూడా జరిగింది. భారత​ సహకారంతో బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ దేశం ఏర్పడింది.

కుటుంబం దారుణ హత్య.. ఆరేళ్ల అజ్ఞాత వాసం..

బంగ్లాదేశ్‌ ఏర్పడిన తర్వాత హసీనా తండ్రి షేక్‌ ముజిబర్‌ రెహ్మాన్‌ ప్రధాన మంత్రి అయ్యారు. అయితే, ఆయన ప్రధాని అయిన కొన్ని నెలలకే దారుణం చోటుచేసుకుంది. 1975, ఆగస్టు 15న కొంతమంది మిలిటరీ ఆఫీసర్లు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. షేక్‌ ముజిబర్‌ రెహ్మాన్‌తో పాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లల్ని అతికిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యలు జరిగిన సమయంలో ఆమె బయటి దేశంలో ఉన్నారు. ఈ హత్యలతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 6 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఆ సమయంలోనే తండ్రి స్థాపించిన అవామి లీగ్‌ పార్టీకి నాయకురాలిగా ఎన్నిక అయ్యారు.

రాజకీయాల్లోకి పూర్తి స్థాయి ఎంట్రీ..

1981లో ఆమె అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. స్వదేశం బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. రాజకీయాల్లో చాలా చురుగ్గా మారారు. ప్రజా సమస్యలపై పోరాట చేయటం మొదలుపెట్టారు. దీంతో ఆమెను చాలా సార్లు అరెస్ట్‌ చేశారు. ఏం జరిగినా.. ఎన్ని కష్టాలు వచ్చినా ఆమె తన పోరాటాన్ని ఆపలేదు. ప్రతిపక్ష నేతగా తన సత్తా చాటుతూ వచ్చారు. అధికార వర్గానికి చుక్కలు చూపించారు. మిలటరీ రూల్‌లో భాగంగా జరుగుతున్న అరచకాలను ఆమె ఖండించారు. మానవ హక్కుల కోసం పోరాటం చేశారు. మిలటరీకి ఓ అల్టిమేటం జారీ చేశారు. దీనికి ప్రజలు మొత్తం మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే 1990లో మిలటరీ అధికారి బంగ్లాదేశ్‌ లెఫ్టెనెంట్‌ జనరల్‌ హుస్సేన్‌ మహ్మద్‌ ఈర్షద్‌ తన పదవికి రాజీనామా చేశారు. 1991లో జరిగిన బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో హసీనా పార్టీ పోటీ చేసింది. అయితే, ఆ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీకి చెందిన ఖలేదా జియా ప్రధాన మంత్రి అయ్యారు. బీఎన్‌పీ ఎన్నికల్లో మోసం చేసి గెలిచిందని హసీనా ఆరోపించారు. అంతేకాదు.. మిగిలిన పార్టీలు కూడా ఈమెకు మద్దతు తెలిపాయి. పార్లమెంట్‌ను బహిస్కరించాయి.

తిరుగులేని ప్రధానిగా..

1996లో జరిగిన ఎన్నికల్లో హసినా పార్టీ ఫుల్‌ మెజార్టీ సాధించింది. ఆమె ప్రధాన మంత్రి అయ్యారు. ఇక, అప్పటినుంచి మకుటం లేని మహారాణిలా రాజకీయాలను శాసిస్తున్నారు. ఎక్కువ కాలంగా ఆమె ప్రధానిగా కొనసాగుతున్నారు. ప్రతి పక్షాలు ఎన్ని చేసినా.. ఎంత బురదజల్లినా.. ప్రజలు మాత్రం హసీనాకే పట్టం గడుతున్నారు. అంతేకాదు.. 1996 నుంచి 2001వరకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రధాని మంత్రిగా కొనసాగారు. స్వాతంత్రం తర్వాత ఇలా ఐదు సంవత్సరాలు పూర్తిగా ప్రధాని మంత్రి ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

గ్రెనేడ్‌ దాడి.. కుటుంబాన్ని చంపిన వారికి శిక్ష

బంగ్లాదేశ్‌లో పరిస్థితులు దారుణంగా మారిన రోజులవి. హసీనా తన అధికారాన్ని కోల్పోయారు. ఖలేదా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ సమయంలో హసీనాను చంపడానికి దుండగులు ప్లాన్‌ చేశారు. ఈ నేపథ్యంలో 2004లో ఓ రాజకీయ ర్యాలీ పాల్గొన్న హసీనాపై గ్రెనేడ్‌ దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. దాదాపు మూడేళ్ల తర్వాత 2007లో బంగ్లాదేశ్‌లో ఎమర్జెన్సీ ప్రకటించారు. తర్వాత పలు ఆరోపణలపై ఆమెను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. 2008 సెప్టెంబర్‌ తర్వాత దేశంలో ఎమర్జెన్సీ ఎత్తేశారు. దీంతో డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. 2009లో హసీనా మరో సారి ప్రధాన మంత్రి అయ్యారు. 2010లో హసీనా తండ్రిని హత్య చేసిన ఐదుగురు మిలిటరీ అధికారులను ఢాకాలో ఉరి తీశారు.

2024 ఎన్నికల్లోనూ ప్రభంజనం.. 

తాజాగా బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లోనూ హసీనా పార్టీ ప్రభంజంన సృష్టించింది. యాభై శాతం సీట్లను సాధించింది. హసీనా 5వ సారి ప్రధాని మంత్రి కాబోతున్నారు. అవామీ పార్టీ 300 సీట్లకు గాను దాదాపు 200లకుపైగా సీట్లను సాధించింది. మరో పార్టీతో కలిసి అవామీ ఈ ఫీట్‌ను సాధించింది. చాలా విషయాల్లో ఇందిరా గాంధీకి.. హసీనాకు పోలిక ఉంది. ఇద్దరూ తండ్రి వారసత్వంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రిని మించిన కూతుళ్లుగా రాజకీయాల్లో ముద్ర వేసుకున్నారు. మరి, బంగ్లాదేశ్లో తిరుగులేని విధంగా రాజకీయాలను శాసిస్తున్న అవామీ పార్టీ అధినేత్రి షేక్‌ హసీనాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.