iDreamPost
android-app
ios-app

వైద్యుల అద్భుతం.. 11 ఏళ్ల తర్వాత తల నుంచి బుల్లెట్..

  • Published Dec 12, 2023 | 4:46 PM Updated Updated Dec 12, 2023 | 4:46 PM

నేటి ఆధునిక ప్రపంచంలో వైద్యులు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. చావు అంచులో ఉన్నవాళ్లను సైతం ఆపరేషన్ చేసి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు.

నేటి ఆధునిక ప్రపంచంలో వైద్యులు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. చావు అంచులో ఉన్నవాళ్లను సైతం ఆపరేషన్ చేసి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు.

వైద్యుల అద్భుతం.. 11 ఏళ్ల తర్వాత తల నుంచి బుల్లెట్..

ప్రపంచంలో వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. చనిపోయిన మనిషి ప్రాణాలు పోయడం తప్ప వైద్యులు ఎన్నో విజయాలు సాధించారు. అందుకు అనుగుణమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. వైద్య రంగంలో ఇప్పుడు ఎన్నో అత్యాధునికమైన వస్తువులను కనిపెట్టాడు. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్స్ చేసి చావు అంచుల్లో ఉన్న మనుషులను సైతం బతికిస్తున్నారు. దేవుడు మనిషిని సృష్టిస్తే.. ఆ సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు వైద్యులు. అందుకే డాక్టర్లను వైద్యో నారాయణ హరి అని అంటారు.. వైద్యులు దేవుడితో సమానంగా చూస్తారు. 18 ఏళ్ల క్రితం ఓ మనిషికి తగిలిన బుల్లెట్ ని సర్జరీ ద్వారా బయటకు తీశారు. ఈ అద్భుతం యెమెన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

యెమెన్ కి చెందిన సహేల్ అనే వ్యక్తికి ఆరుగురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు. ఆయనకు ఇద్దరు సంతానం. సహేల్ కి సరిగా చెవులు వినిపించవు. 18 ఏళ్ల క్రితం సహేల్ కి ఒక ప్రమాదంలో మూడు సెంటీమీటర్లు పొడవు ఉన్న బుల్లెట్ తలలో ఇరుక్కుపోయింది. దీంతో అతడు చాలా ఇబ్బందులు పడ్డాడు. తరుచూ చెవి నుంచి రక్తం కారడం, చెవులు సరిగా వినిపించకోపవడం లాంటి సమస్యలతో బాధపడుతున్నాడు. సహేల్ కుటుంబ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు ఇతర కూరగాయలు పండిస్తున్నారు. సహైల్ చురుకైనవాడే.. వ్యవసాయ పనులు దగ్గరుండి చూసుకుంటాడు. పదేళ్ల వయసులోనే వ్యవసాయ పనులు నేర్చుకొని తన తండ్రికి సహాయంగా ఉంటూ వస్తున్నాడు. హ్యాపీగా సాగిపోతున్న అతని జీవితంలో విధి వెక్కిరించింది.

రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో సహేల్ అక్కడికి వెళ్లాడు.. అంతలోనే ఒక వర్గం వారు కాల్పులు జరపగా బుల్లెట్ అతని తలలో దూరింది. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ.. తల నుంచి బుల్లెట్ ని మాత్రం తీయలేకపోయారు. అప్పటి నుంచి సహేల్ కి ఆరోగ్యపరంగా కష్టాలు మొదలయ్యాయి. ఎంత మంది వైద్యులకు చూపించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అతడికి రక రకాల ఇన్ఫెక్షన్లు రావడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. బెంగుళూర్ లో ఆస్టర్ హాస్పిటల్ లో తల‌లో ఇరుక్కున్న బుల్లెట్ ని తీస్తారని ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే బెంగుళూరు కి వెళ్లి ఆస్టర్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు. వైద్యులు అతన్ని పరీక్షించి ప్రాణాలకు ప్రమాదం జరగకుండా బుల్లెట్ తీయాని చాలెంజ్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే అతడికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి.. లెటెస్ట్ వైద్య పరికరాలతో తలలో బుల్లెట్ ఏ ప్రదేశంలో ఇరుక్కుంది అన్న విషయం కనిపెట్టారు. తర్వాత ఆపరేషన్ చేసి మూడు సెంటీమీటర్లు ఉన్న బుల్లెట్ ని తీసివేశారు. 18 ఏళ్లుగా తలలో ఉన్న బుల్లెట్ ని ఎలాంటి ప్రాణ హానీ లేకుండా బయటకు తీసిన వైద్యులకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇది నిజంగా ఓ అద్బుతం అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సహేల్ ఆరోగ్యంగా ఉన్నాడు.. అంతేకాదు చెవులు కూడా వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత సహేల్ తన కుటుంబ సభ్యులతో యెమెన్ కి తిరిగి వెళ్లాడు. వైద్యులు చేసిన అద్భుతంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.