iDreamPost
android-app
ios-app

ట్రంప్‌పై కాల్పులు.. ముందే ఊహించిన బాబా వంగా.. అదే నిజమైందా?

  • Published Jul 15, 2024 | 4:16 PM Updated Updated Jul 15, 2024 | 4:16 PM

Baba Vanga Prediction On Donald Trump: ఇక్కడ మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలానో.. మిగతా దేశాల్లో కూడా కాలజ్ఞానం చెప్పే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో వంగా బాబా ఒకరు. ఈమె చెప్పినవి చాలా వరకూ జరగడంతో ఆమె జోస్యానికి ఆదరణ పెరిగింది. ట్రంప్ విషయంలో కూడా ఈమె చెప్పిన జోస్యం నిజమైందని అంటున్నారు.

Baba Vanga Prediction On Donald Trump: ఇక్కడ మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎలానో.. మిగతా దేశాల్లో కూడా కాలజ్ఞానం చెప్పే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో వంగా బాబా ఒకరు. ఈమె చెప్పినవి చాలా వరకూ జరగడంతో ఆమె జోస్యానికి ఆదరణ పెరిగింది. ట్రంప్ విషయంలో కూడా ఈమె చెప్పిన జోస్యం నిజమైందని అంటున్నారు.

  • Published Jul 15, 2024 | 4:16 PMUpdated Jul 15, 2024 | 4:16 PM
ట్రంప్‌పై కాల్పులు.. ముందే ఊహించిన బాబా వంగా.. అదే నిజమైందా?

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి తెలిసే ఉంటుంది. ఆయన కాలజ్ఞానాన్ని చాలా మంది నమ్ముతారు. ఆయన చెప్పినవి చాలా వరకూ జరిగాయని అంటారు. అయితే మనకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నట్టే బల్గేరియాలో కూడా కాలజ్ణానం చెప్పే ఆవిడ ఉండేది. ఆవిడ ఇప్పుడు లేదు కానీ అప్పట్లో ఆమె చెప్పిన కాలజ్ఞానం నిజమవుతూ వస్తున్నాయి. దీంతో ఆమెను బాల్కన్స్ యొక్క నోస్ట్రడామస్ అని పిలుస్తుంటారు. నోస్ట్రడామస్.. ఈయనొక కాలజ్ఞాని. ఈయన చెప్పినవి కూడా చాలా వరకూ జరిగాయి. ఈయనలానే బాబా వంగా కూడా కాలజ్ఞానం చెప్పి బాగా ఫేమస్ అయ్యారు. ఆమె అసలు పేరు వేంజోలియా పాండేవ గస్త్రోవా.

ఈమె అమెరికాలో 9/11 దాడుల గురించి, ఉక్రెయిన్ యుద్ధం గురించి ఆమె ముందుగానే ఊహించి చెప్పారు. ఇలా ఆమె చెప్పినవి చాలా వరకూ జరగడంతో ఆమె జోస్యానికి విలువ పెరిగింది. ట్రంప్ విషయంలో కూడా ఈమె గతంలో జోస్యం చెప్పారు. అదే ఇప్పుడు నిజమైందని చెబుతున్నారు. ఈమె అంధ ఆధ్యాత్మిక వైద్యురాలు. 1996లో మరణించారు. అయితే ట్రంప్ పై 20 ఏళ్ల థామస్ మ్యాథ్యూ క్రూక్స్ అనే కుర్రాడు కాల్పులు జరిపాడు. అయితే ట్రంప్ దగ్గర ఉండే సీక్రెట్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అవ్వడంతో థామస్ అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే థామస్ జరిపిన కాల్పుల్లో ట్రంప్ చెవికి తీవ్ర గాయమైంది. అయితే ట్రంప్ విషయంలో ఇలా జరుగుతుందని వంగా బాబా ముందే చెప్పారని కథనాలు నడుస్తున్నాయి. వంగా బాబా మరణించక ముందు ఆమె భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని అంచనాలు వేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్, డొనాల్డ్ ట్రంప్ లకి ముప్పు పొంచి ఉందని ఆమె జోస్యం చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ కి అంతుచిక్కని వ్యాధితో చెవుడు వస్తుందని.. ఆ తర్వాత బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడతారని ఆమె జోస్యం చెప్పారు. అయితే ఈమె చెప్పింది ట్రంప్ విషయంలో జరగలేదు గానీ ఆమె చెప్పిన జోస్యానికి, ట్రంప్ చెవికి  గాయం  అవ్వడానికి పోలికలు ఉన్నాయని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈమె చెప్పిన జోస్యాలు చాలా వరకూ నిజం అవ్వడంతో ట్రంప్ జీవితంలో కూడా నిజం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. అమెరికా 9/11 దాడులు, రష్యా కుర్స్క్ సబ్ మెరైన్ డిజాస్టర్ వంటివి ఆమె జోస్యానికి బలం చేకూర్చాయి. అయితే 2016 నాటికి ఐరోపా ఉండదని.. 2010, 2014 మధ్య అణుయుద్ధం జరుగుతుందని.. ఇలా ఆమె వేసిన కొన్ని అంచనాలు నిజం కాలేదు. ఇవి కాకుండా ఇంకా ఎన్నో అంచనాలు వేశారు. వాటిలో 5079లో ప్రపంచం అంతమైపోతుందని చెప్పడం ఒకటి ఉంది.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom