ఏ పనీ చేయకుండా అమెజాన్ కంపెనీ 3 కోట్లు జీతం ఇచ్చింది.. ఉద్యోగి పోస్ట్ వైరల్

I Got 3 Crore Salary For Nothing Done Said Amazon Employee: ఈరోజుల్లో డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. డబ్బులు ఊరికే రావు. బాగా కష్టపడితేనే గానీ కోట్లు గడించడం అనేది కష్టం. కానీ ఒక ఉద్యోగి ఏ పనీ చేయకుండా ఏకంగా అమెజాన్ కంపెనీలో 3 కోట్లు పైనే సంపాదించాడని చెబుతున్నాడు.

I Got 3 Crore Salary For Nothing Done Said Amazon Employee: ఈరోజుల్లో డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. డబ్బులు ఊరికే రావు. బాగా కష్టపడితేనే గానీ కోట్లు గడించడం అనేది కష్టం. కానీ ఒక ఉద్యోగి ఏ పనీ చేయకుండా ఏకంగా అమెజాన్ కంపెనీలో 3 కోట్లు పైనే సంపాదించాడని చెబుతున్నాడు.

హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఈ రెండు పదాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నవే. కంపెనీల్లో పని చేసే ఉద్యోగులను ఉద్దేశించి టీమ్ లీడర్లు, బాస్ లు ఇలా అంటూ ఉంటారు. హార్డ్ వర్క్ చేయాలి.. దాంతో పాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి అని అంటారు. కొంతమంది అయితే ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎదగలేరు.. స్మార్ట్ వర్క్ ఉండాలి అని అంటారు. అయితే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ విషయాల్లో రెండు వర్గాలు ఎప్పుడూ పరస్పర విరుద్ధంగానే ఉంటాయి. మెజారిటీ ఉద్యోగులు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అయితే.. మిగతా ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేస్తుంటారు. ఇలా స్మార్ట్ వర్క్ చేసే ఏ పనీ చేయకుండా 3 కోట్ల రూపాయలు సంపాదించానని ఓ ఉద్యోగి వెల్లడించాడు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

అసలు గొడ్డు చాకిరీ చేసినా గానీ సరిగా జీతాలు ఇవ్వని కంపెనీలున్న ఈరోజుల్లో.. అసలు ఏ పనీ చేయకుండా ఒక ఉద్యోగికి ఒక కంపెనీ 3 కోట్ల రూపాయలు జీతం ఇచ్చిందా? నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఒక ఉద్యోగి చెప్తున్న మాట ఇది. తాను ఏ పనీ చేయకుండా ఏడాదిన్నర కాలంలో సంపాదించిన మొత్తం 3 కోట్ల పైనే అని చెప్పుకొచ్చాడు. అమెజాన్ లో పనిచేసే ఒక సీనియర్ ఉద్యోగి బ్లైండ్ అనే ప్లాట్ ఫామ్ లో రీసెంట్ గా ఒక పోస్ట్ ని షేర్ చేశాడు. గూగుల్ కంపెనీ లేఆఫ్ తర్వాత 17 నెలల క్రితం అమెజాన్ లో చేరానని పేర్కొన్నాడు. సీనియర్ టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్ గా ఏడాదిన్నర కాలంలో సుమారు 3.70 లక్షల డాలర్లు సంపాదించానని చెప్పుకొచ్చాడు.

మన కరెన్సీ ప్రకారం.. సుమారు 3.10 కోట్లు పై మాటే. ఈ మొత్తం ఏ పనీ చేయకపోయినా వచ్చిందని పేర్కొన్నాడు. నిజానికి గూగుల్ సంస్థలో ఉద్యోగం పోయిన తర్వాతే ఏ పనీ చేయకూడదనుకునే అమెజాన్ లో చేరానని చెప్పుకొచ్చాడు. అమెజాన్ లో కేవలం ఏడు సపోర్ట్ టికెట్లను మాత్రమే సాల్వ్ చేశానని.. ఒక సింగిల్ ఆటోమేటెడ్ డ్యాష్ బోర్డును డిజైన్ చేశానని చెప్పాడు. దీని కోసం మూడు నెలలు పని చేశానని కంపెనీకి చెప్పినట్లు వెల్లడించాడు. అయితే నిజానికి తాను ఆటోమేటెడ్ డ్యాష్ బోర్డు కోసం కేవలం మూడు రోజులే వెచ్చించానని చెప్పాడు. చాట్ జీపీటీ చాట్ బాట్ సహాయంతో మూడు రోజుల్లో పని పూర్తి చేశానని.. కానీ మూడు నెలలు పట్టిందని కంపెనీకి చెప్పానని రాసుకొచ్చాడు.

8 గంటల పని వేళల్లో తాను ఎక్కువ సమయం గడిపింది ఏదైనా ఉందంటే అది మీటింగ్ లకేనని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ ని వేరొక వ్యక్తి ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. సిన్సియర్ గా పని చేసే వారిని గుర్తించరు.. ఇలా స్మార్ట్ వర్క్ పేరుతో మోసం చేసేవారినే నమ్ముతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కష్టపడి పని చేసి సంపాదించాలనుకునే వాళ్ళని ఇలాంటి వాళ్ళే నాశనం చేస్తున్నారని మరొక యూజర్ కామెంట్ చేశాడు. ఉద్యోగం విలువ తెలియదని.. మోసం చేశావని ఇలా రకరకాలుగా ఆ ఉద్యోగిపై విమర్శలు చేస్తున్నారు.

Show comments