iDreamPost
android-app
ios-app

ఆ విషయంలో అమెరికా కంటే భారతదేశం చాలా బెస్ట్: విదేశీ యువతి

  • Published Jul 02, 2024 | 9:59 PM Updated Updated Jul 02, 2024 | 9:59 PM

American Lady Praises India: భారతదేశాన్ని అమెరికన్ యువతి పొగడ్తలతో ముంచెత్తింది. ఆ ఒక్క విషయంలో భారత్ అమెరికా కంటే బెస్ట్ అంటూ కితాబిచ్చింది. అసలు ఈ పరిస్థితిని తాను ఊహించలేదని.. కానీ ఆశ్చర్యపోయానంటూ కామెంట్స్ చేసింది.

American Lady Praises India: భారతదేశాన్ని అమెరికన్ యువతి పొగడ్తలతో ముంచెత్తింది. ఆ ఒక్క విషయంలో భారత్ అమెరికా కంటే బెస్ట్ అంటూ కితాబిచ్చింది. అసలు ఈ పరిస్థితిని తాను ఊహించలేదని.. కానీ ఆశ్చర్యపోయానంటూ కామెంట్స్ చేసింది.

ఆ విషయంలో అమెరికా కంటే భారతదేశం చాలా బెస్ట్: విదేశీ యువతి

భారతదేశం ఒకప్పటిలా కాదు. కొన్ని విషయాల్లో మిగతా దేశాలతో పోటీ పడుతుంది. భారతదేశం విశ్వ గురు భారత్ గా ఎదుగుతోంది. ఈ క్రమంలో పలు దేశాల వాళ్ళు భారతదేశాన్ని మెచ్చుకుంటున్నారు. భారతదేశం గురించి పక్క దేశాల వాళ్ళు పొగిడితే వచ్చే కిక్కే వేరు. తాజాగా అమెరికాకు చెందిన యువతి భారతదేశం గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. అమెరికా కంటే ఇండియాలో ఆ వ్యవస్థ చాలా బెస్ట్ అంటూ కామెంట్స్ చేసింది. మరి ఏ విషయంలో అమెరికాతో పోలిస్తే భారత్ బెస్ట్ అని ఆమె అన్నదో ఆ వివరాలు మీ కోసం.  

అమెరికాలో అన్నీ ఎక్కువే. సంపాదన ఎక్కువే. ఖర్చులూ ఎక్కువే. అక్కడ హాస్పిటల్ కి వెళ్తే దానికయ్యే ఖర్చులు కూడా ఎక్కువే. అమెరికాకి చెందిన మెకెన్జీ అనే యువతి, తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్. వివిధ దేశాలు పర్యటిస్తూ అక్కడ ఎదురైన అనుభవాలను వీడియోల రూపంలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఈ జంట మన దేశానికి వచ్చింది. అయితే ఆమె బాయ్ ఫ్రెండ్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆమె భయపడిపోయింది. ఎందుకంటే వైద్యానికి భారీగా ఖర్చు అవుతుందేమో అని టెన్షన్ పడింది. ఎందుకంటే అమెరికాలో వైద్యం చేయించాలంటే భారీ ఖర్చు అవుతుంది. అక్కడిలానే ఇక్కడ కూడా వైద్యానికి తడిసిమోపుడవుతుందేమో అని కంగారు పడింది. కానీ ఆమె అనుకున్నట్టు అలా ఏం జరక్కపోవడంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది.

ఆమె స్నేహితురాలు మెకెన్జీకి సాయం చేసింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కి రక్తపరీక్షలు చేయించింది. నర్సు ఇంటికి వచ్చి బ్లడ్ టెస్టులు చేశారు. ఆ విషయం తెలిసి మెకెన్జీ ఆశ్చర్యానికి గురైంది. ఏంటి.. నర్సులు ఇంటికి వస్తారా అంటూ నోరెళ్లబెట్టింది. అది కూడా రోగులకు అనువైన సమయంలో వస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పైగా టెస్టులకు 14 డాలర్లు (మన కరెన్సీ ప్రకారం రూ. 1168) అవ్వడంతో ఆమె అవాక్కయ్యింది. ఇండియాలో వైద్యం మరీ ఇంత తక్కువా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఫ్రెండ్ సహాయంతో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని బాయ్ ఫ్రెండ్ కి ట్రీట్మెంట్ ఇప్పించింది. అయితే భారీగా ఖర్చు అవుతుందనుకున్న ఆమెకు చాలా తక్కువ ఖర్చు అవ్వడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

ఈ ఆనందాన్ని ఆమె వీడియో రూపంలో నెటిజన్స్ కి షేర్ చేసుకుంది. మీ దేశంలో వైద్యం ఇంత ఈజీగా ఉంటుందని ఊహించలేదని.. ఇక్కడ 140 కోట్ల మంది ఆరోగ్యంగా ఉన్నారంటే ఈ వైద్య వ్యవస్థే కారణమని కామెంట్స్ చేసింది. ఆమె అమెరికన్ అయిన ప్రస్తుతం ఇంగ్లాండ్ లో నివసిస్తుంది. కాగా ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుండగా.. మరి కొంతమంది మాత్రం నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నవాళ్లకు వైద్యం చీప్ గానే ఉంటుంది కానీ పేదలకే ఖరీదైనదిగా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by UNSTUK with Mac & Keen (@macnkeen)