Venkateswarlu
Venkateswarlu
ఇరాన్‌లో బంధీలుగా ఉన్న ఐదుగుర్ని దేశానికి తీసుకురావటంలో అమెరికా విజయం సాధించింది. ఆ ఐదుగురు తాజాగా సొంత దేశం అమెరికాకు చేరుకున్నారు. శత్రు దేశం అమెరికాకు చెందిన ఐదుగురు బంధీలను విడిచి పెట్టి ఇరాన్ పెద్ద ప్రతి ఫలాన్నే దక్కించుకుంది. అమెరికా తమ దేశానికి చెందిన కేవలం ఐదుగురి కోసం 49 వేల కోట్ల రూపాయల్ని వదులుకుంది. ఇరాన్ జైలునుంచి విడుదలైన అమెరికా చేరుకున్న వారిలో నలుగురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు.
ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉన్న అతి క్రూరమైన జైల్లో వాళ్లు ఇన్ని రోజులు శిక్ష అనుభవించారు. వీరిని విడిపించుకోవాటానికి అమెరికా, ఇరాన్‌తో ఓ ఒప్పందం చేసుకుంది. 5 మందిని విడిచిపెడితే.. దక్షిణ కొరియాలో నిలిచిపోయిన ఇరాన్ నిధులను ఇప్పిస్తామని అమెరికా తెలిపింది. కొన్ని నెలల క్రితమే ఈ ఒప్పందం జరిగింది. ఖతార్.. అమెరికా, ఇరాన్‌ల మధ్య మధ్య వర్తిత్వం వహించింది. ఒప్పందం ప్రకారం దక్షిణ కొరియాలో నిలిచిపోయిన 49 వేల కోట్ల రూపాయల ఇరాన్ నిధులు దోహా బ్యాంకులకు చేరుకున్నాయి.
ఇరాన్ ఐదుగుర్ని విడిచిపెట్టింది. జో బైడెన్ వీరు అమెరికా తిరిగి వస్తున్న సందర్భంగా ‘‘ఇరాన్ జైల్లో బంధీలుగా మారి.. ఏళ్ల పాటు నరక యాతన అనుభవించిన ఆ ఐదుగురు అమెరికాకు తిరిగి వస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఇక, అమెరికాకు చేరుకున్న తర్వాత.. ఐదుగురు వ్యక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు జో బైడెన్‌కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మరి, ఐదుగురు వ్యక్తుల కోసం అమెరికా ఏకంగా రూ. 49 వేల కోట్లు వదులు కోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.