iDreamPost
android-app
ios-app

వీడియో: విమానం గాల్లో ఉండగానే ఊడిన డోర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

విమాన ప్రయాణికులు భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ విమానం గాల్లో ఉండగానే డోర్ ఊడిపోయడంతో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఊహించని ఘటనతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు.

విమాన ప్రయాణికులు భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ విమానం గాల్లో ఉండగానే డోర్ ఊడిపోయడంతో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఊహించని ఘటనతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు.

వీడియో: విమానం గాల్లో ఉండగానే ఊడిన డోర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఈ మధ్య చోటుచేసుకుంటున్న విమాన ప్రమాదాలు ఫ్లైట్ జర్నీ చేసే వారికి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల కారణంగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ నటుడు ప్రయాణిస్తున్న జెట్ ఫ్లైట్ సముద్రంలో కూలి పోవడంతో కూతుళ్లతో సహా మరణించారు. ఇటీవల ఓ దేశంలో రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులు తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. ఈక్రమంలో మరో ఒల్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. ఓ విమానం గాల్లో ఉండగానే డోర్ ఊడిపోయింది. దీంత ప్రయాణికులు ప్రాణ భయంతో వణికి పోయారు. దీనికి సంబంధించిన వీడియో ఫ్లైట్ లో ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింటా వైరల్ గా మారింది.

అల‌స్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానానికి అత్యవసర పరిస్థితి దాపరించింది. ప్రయాణికులతో ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదభారిన పడింది. గాల్లో ఉండగానే విమానం డోర్ ఊడిపోయింది. దీంతో ఆ ఫ్లైట్ అత్యవ‌స‌రంగా ల్యాండ్ అయ్యింది. విమానంలో ఉన్న ప్ర‌యాణికులు ఘటనకు సంబంధించిన వీడియోలు తీశారు. కాగా అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్ సిటీ నుంచి ఏఎస్‌1282 విమానం టేకాఫ్ తీసుకున్న‌ది. టేకాఫ్ తీసుకుని కొంత దూరం ప్రయాణించిన త‌ర్వాత విమానం డోరు ఊడిపోయింది. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్ లు పోర్ట్‌ల్యాండ్ అంత‌ర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ స‌మ‌యంలో విమానంలో 171 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

The door that blew while in the wind

ఆకస్మాత్తుగా డోర్ ఊడిపోవడంతో విమానం ల్యాండ్ అయ్యేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం అందులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. గగనతలంలోనే డోర్ ఊడిపోవడంతో విపరీతమైన గాలి ధాటికి ప్రయాణికుల ఫోన్లు ఎగిరిపడ్డాయి. ఓ బాలుడి షర్ట్ కూడా ఊడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఘటనపై అలస్కా ఎయిర్ లైన్స్ స్పందించింది. ఘటనకు సబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మరి గాల్లో ఉండగానే విమానం డోర్ ఊడిపోయిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.