iDreamPost

వీడియో: గాల్లో ఊగిపోయిన విమానం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..

Air Europa Flight Issue: సుదూర ప్రాంతాలకు వేగంగా చేరుకోవాలంటే విమాన ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అందుకే ఖరీదు అయినా ఈ మధ్య చాలా మంది విమాన ప్రయాణాలు చేయడానికే ఇష్టపడుతున్నారు.

Air Europa Flight Issue: సుదూర ప్రాంతాలకు వేగంగా చేరుకోవాలంటే విమాన ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అందుకే ఖరీదు అయినా ఈ మధ్య చాలా మంది విమాన ప్రయాణాలు చేయడానికే ఇష్టపడుతున్నారు.

వీడియో: గాల్లో ఊగిపోయిన విమానం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..

ఈ మధ్య కాలంలో తరుచూ విమానం, హెలికాప్టర్, ఎయిర్ జెట్ ప్రమాదాలకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాలు, ప్రకృతిలో అనూహ్య మార్పులు, పక్షులు ఢీ కొట్టడం, ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పడం ఇలా ఎన్నోరకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే పైలెట్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి చాలా వరకు ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు. కొనిసార్లు మాత్రం ప్రమాదాలను తప్పించుకోలేకపోవడంతో ఎంతోమంది కన్నుమూస్తున్నారు. తాజాగా విమానం గాల్లో ఉండగా ఒక్కసారే కుదుపులకు గురి కావడంతో ప్రయాణికులు గజ గజ వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల కాలంలో విమానంలో కుదుపులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.. టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత విమానం అకస్మాత్తుగా కుదుపులకు గురైంది. కుదుపులకు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఎగిరి పడ్డారు. దీంతో ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గజ గజ వణికిపోయారు. ఓవర్ హెడ్ బిన్ లో ఓ ప్రయాణికుడు ఇరుక్కుపోయాడు. విమానాన్ని బ్రెజిల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. విమానయాన సంస్థ ఎయిర్ యూరోపాకు చెందిన బోయింగ్ 787-9 విమానం 325 మందితో స్పెయిన్ నుంచి ఉరుగ్వెకు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హఠాత్తుగా విమానం కుదుపులకు గురైంది.

కుదుపులకు సీలింగ్ ప్యానెల్, సిట్లు దెబ్బతిన్నాయి.  ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. సీట్లలో నుంచి ఎగిరి పడ్డారు.. చిన్నారు భయంతో ఎడుపు లంకించుకున్నారు.  పరిస్థితి గమనించిన పైలెట్ వెంటనే అధికారులకు సమాచారం అందించి వారి సూచనల మేరకు బ్రెజిల్ లోని నాటల్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అప్పటికే అక్కడికి డజన్ల కొద్ది అంబులెన్స్ రెడీగా ఉన్నాయి. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ యూరోపా.. సాంకేతిక కారణాల వల్లనే ఇలా జరిగిందని చెబుతున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని.. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి