iDreamPost
android-app
ios-app

తెగిపోయిన డ్యామ్‌.. 42 మంది మృతి.. ఎక్కడంటే?

మండుటెండల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షాలతో వరుణుడు విరుచుకుపడడంతో భారీ వరదలు సంబవించాయి. దీంతో ఓ డ్యామ్ తెగిపోయి 42 మంది మృతిచెందారు.

మండుటెండల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షాలతో వరుణుడు విరుచుకుపడడంతో భారీ వరదలు సంబవించాయి. దీంతో ఓ డ్యామ్ తెగిపోయి 42 మంది మృతిచెందారు.

తెగిపోయిన డ్యామ్‌.. 42 మంది మృతి.. ఎక్కడంటే?

ఇటీవలి కాలంలో కురుస్తున్న అకాల వర్షాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆకస్మాత్తుగా విరుచుకుపడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైపోతోంది. రవాణా వ్యవస్థ కుప్పకూలిపోతోంది. ఈ మధ్య ఎడారి దేశం దుబాయ్ లో జళప్రళయం సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా కురిసిన వర్షానికి రోడ్లన్ని జళమయమయ్యాయి. ఎప్పుడూ కూడా పొడివాతావరణమే ఉండే దుబాయ్ లో భారీ వర్షాలు కురవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరో దేశంలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. వర్షాల ధాటికి సంబవించిన వరదలతో ఓ డ్యాప్ తెగిపోయింది. దీంతో 42 మంది ప్రాణాలు కోల్పపోయారు. ఈ ఘటన కెన్యాలో చోటుచేసుకుంది.

ఆఫ్రికా దేశమైన కెన్యాలో గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. భారీగా వస్తున్న వరదలతో కెన్యాలోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడి ప్రధాన డ్యామ్ లన్ని ప్రమాదంలో పడ్డాయి. ఎప్పుడు ఏ ఆపద సంబవిస్తుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు అక్కడి ప్రజలు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో డ్యామ్ లు తెగిపోయే ప్రమాదం తలెత్తింది. ఈక్రమంలో కెన్యాలో తీరని విషాదం చోటుచేసుకుంది.

పశ్చిమ కెన్యాలోని రిఫ్ట్‌ వ్యాలీలో గల కిజాబె డ్యామ్‌ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో ఆ నీరంతా దిగువ ప్రాంతాల్లోకి పోటెత్తడంతో సుమారు 42 మంది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. నీటి ఉద్ధృతికి పలు ఇళ్లు, వాహనాలు, రోడ్లు కూడా కొట్టుకుపోయాయని తెలిపారు. బుదరలో మరికొంత మంది చిక్కుకుపోయినట్లు చెప్పారు. దీంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మరోవైపు కెన్యా ఎయిర్‌పోర్టు కూడా వరద నీటితో నిండిపోయింది. దీంతో కొన్ని విమానాలను దారి మళ్లించవలసి వచ్చింది. భారీ వర్షాల నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.