iDreamPost
android-app
ios-app

ట్రంప్ తో ఏకాంతంగా గడిపా.. కోర్టులో శృOగార తార సాక్ష్యం.. !

  • Published May 08, 2024 | 6:03 PM Updated Updated May 08, 2024 | 6:03 PM

Actress Daniel- Former President Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా శృOగార తార న్యూయార్క్ న్యాయస్థానంలో తన సాక్ష్యాన్ని చెప్పింది. తాను ట్రంప్ తో ఏకాంతంగా గడిపిన విషయం నిజమే అంటూ కామెంట్స్ చేసింది.

Actress Daniel- Former President Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా శృOగార తార న్యూయార్క్ న్యాయస్థానంలో తన సాక్ష్యాన్ని చెప్పింది. తాను ట్రంప్ తో ఏకాంతంగా గడిపిన విషయం నిజమే అంటూ కామెంట్స్ చేసింది.

  • Published May 08, 2024 | 6:03 PMUpdated May 08, 2024 | 6:03 PM
ట్రంప్ తో ఏకాంతంగా గడిపా.. కోర్టులో శృOగార తార సాక్ష్యం.. !

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఓ శృOగార తార డొనాల్డ్ ట్రంప్ తో ఏకాంతంగా గడిపిన విషయం నిజమేనంటూ న్యూయార్క్ న్యాయస్థానంలో వాగ్మూలం ఇచ్చింది. అసలు విషయం బయటకు రాకుండా ఉండేందుకు డొనాల్డ్ ట్రంప్ న్యాయవాదులు తనకు డబ్బులు కూడా ముట్టజెప్పినట్లు ఆ నటి తన స్టేట్మెంట్ లో పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ పై ఆరోపణలు రాకుండా ఉండేందుకు తప్పుడు దారులు తొక్కారనే ఆరోపణలకు సంబంధించి సుధీర్ఘంగా విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వాదనల్లో శృOగార తార ఇచ్చిన వాగ్మూలం కీలకంగా మారబోతోంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఏకాంతంగా గడిపిన విషయం నిజమేనంటూ న్యూయార్క్ కోర్టులో శృOగార తార స్టార్మీ డేనియల్ సాక్ష్యం చెప్పింది. ఈ విషయానికి సంబంధించి ఎక్కడా మాట్లాడకుండా ఉండేందుకు తనకు డబ్బు కూడా ఇచ్చారంటూ ఆమె వెల్లడించింది. అసలు డొనాల్డ్ ట్రంప్ ని ఎలా కలిశారు? వారి మధ్య ఏం జరిగింది అనే విషయాలను తన స్టేట్మెంట్ లో రికార్డ్ చేశారు. “2006లో ఓ గోల్ఫ్ టోర్నమెంట్ లో నేను డొనాల్డ్ ట్రంప్ ను కలిశాను. ఆయన తన సెక్యూరిటీతో నన్ను డిన్నర్ కు ఇన్వైట్ చేశారు. ఆ తర్వాత నన్ను ఒక లగ్జరీ సూట్ కి తీసుకెళ్లారు. నన్ను అక్కడికి ఎందుకు తీసుకెళ్లారో నాకు అర్థమైపోయింది. అక్కడే ఇద్దరం ఏకాంతంగా గడిపాం.

Trump

ఆ తర్వాత కూడా నేను- డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో కలిశాం. అయితే అప్పుడు మాత్రం సన్నిహితంగా గడిపింది లేదు. అంతేకాకుండా మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి చాలా మందికి తెలుసు. 2011లో ఓ బ్లాగ్ ద్వారా మా విషయం వెలుగు చూసింది. అయితే 2016 ఎన్నికల టైమ్ లో నేను ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండేందుకు ట్రంప్ లాయర్ నాకు 1,30,000 డాలర్లు ఇచ్చారు. ట్రంప్ వద్దనుంచి డబ్బు తీసుకోవాలి అనేది అసలు నా ఉద్దేశం కాదు” అంటూ స్టార్మీ డేనియల్ తన వాగ్మూలంలో తెలియజేశారు. అయితే స్టార్మీ డేనియల్ ఆరోపణలను ట్రంప్ తరఫు న్యాయవాదులు తోసిపుచ్చారు.

ఆ శృOగార తార స్టార్మీ డేనియల్ కేవలం డబ్బు కోసమే డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. హష్ మనీకి సంబంధించి న్యూయార్క్ న్యాయస్థానంలో గత కొన్ని రోజులుగా వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. 13వ రోజు విచారణలో భాగంగా శృOగార తార కోర్టుకు వచ్చిన సాక్ష్యం చెప్పారు. స్టార్మీ డేనియల్ సాక్ష్యం చెప్తున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ తల ఊపుతూ కనిపించారు. అయితే అలా చేయడం సాక్షిని బెదిరించడమే అవుతుందని జ్యూరీ అభిప్రాయ పడింది. మరి.. డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా కోర్టులో శృOగార తార సాక్ష్యం చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş