iDreamPost
android-app
ios-app

Viral Video: AC బాక్సు ఎంత పని చేసింది.. క్షణాల్లో ప్రాణం పాయె!

  • Published Dec 10, 2023 | 3:33 PM Updated Updated Dec 10, 2023 | 3:33 PM

చిన్న గడ్డిపోచ కూడా కావచ్చు.. కొన్ని సార్లు అది మన ప్రాణాలు తీయొచ్చు. అలాంటి ఓ ఎయిర్‌ కండిషనర్‌ ప్రాణాలు తీయలేదా. అవును.. ఏసీ కారణంగా ఓ మహిళ తన ప్రాణాలు కోల్పోయింది...

చిన్న గడ్డిపోచ కూడా కావచ్చు.. కొన్ని సార్లు అది మన ప్రాణాలు తీయొచ్చు. అలాంటి ఓ ఎయిర్‌ కండిషనర్‌ ప్రాణాలు తీయలేదా. అవును.. ఏసీ కారణంగా ఓ మహిళ తన ప్రాణాలు కోల్పోయింది...

  • Published Dec 10, 2023 | 3:33 PMUpdated Dec 10, 2023 | 3:33 PM
Viral Video: AC బాక్సు ఎంత పని చేసింది.. క్షణాల్లో ప్రాణం పాయె!

మనిషి జీవితం చాలా చిన్నది. సమయంతో పోటీ పడి ఓడిపోవడం దాని నైజం. కళ్లు మూసి తెరిచేలోగా మనిషి మృత్యువు ఒడికి చేరుతూ ఉంటాడు. ఒక్కోసారి అనుకోని విధంగా మృత్యువు మనిషిని కబళిస్తూ ఉంటుంది. అప్పటి వరకు బాగానే ఉ‍న్న వారు.. ఆడుతూ పాడుతూ తిరిగిన వారు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అనారోగ్యమో.. ప్రమాదమో.. కొన్ని సార్లు మనిషి జీవితం అర్థాంతరంగా ముగుస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగాయి.

చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు చనిపోతున్నారు. కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వాళ్లు.. క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటు మరణాలు ఒక ఎత్తయితే.. అనుకోని ప్రమాదాలు మరో ఎత్తు.. సోషల్‌ మీడియా వైరల్‌ అయ్యే కొన్ని ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చూసినపుడు ఒళ్లు జలదరిస్తూ ఉంటుంది. భయం కూడా వేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబేయే స్టోరీ కూడా ఇలాంటిదే.

ఏసీ బాక్సు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అంతస్తుల మేడపై నుంచి ఏసీ బాక్సు ఓ మహిళ తలపై పడటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోలో  ఏముందంటే.. కొందరు వ్యక్తులు బస్టాప్‌ దగ్గర బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఓ ఇద్దరు మహిళలు పక్కనే ఉన్న భవనం దగ్గర నిలబడి ఉన్నారు.

కొద్దిసేపటి తర్వాత నల్ల దుస్తుల్లో ఉన్న అమ్మాయి రోడ్డవైపు చూస్తూ ఉంది. ఇంతలో పైనుంచి ఓ ఏసీ అవుట్‌డోర్‌ యూనిట్‌ బాక్సు ఆమె తలపై పడింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. పక్కనే ఉన్న మహిళ ఆమెను పైకి లేపటానికి ప్రయత్నించింది. అప్పటికే ఆమె ప్రాణాలు పోయినట్లు ధ్రువీకరణ అయింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో.. ఎవ్వరమూ చెప్పలేము’’.. ‘‘ ఏసీ బాక్సు ప్రాణాలు తీయటం ఏంటి? దారుణంగా ఉంది..’’..

‘‘ వీడియో చూడగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి’’.. ‘‘ ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా కామన్‌ అయిపోయాయి. ఇంతకంటే దారుణమైన వీడియోలను చూశాను’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఏసీ అవుట్‌డోర్‌ యూనిట్‌ బాక్సు తల మీద పడి ఓ మహిళ ప్రాణాలు పోగొట్టుకున్న ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet