iDreamPost
android-app
ios-app

పెళ్లికొచ్చిన 60 మంది గెస్టులని వివాహం చేసుకున్న యువతి.. పిచ్చండి ఇది!

  • Published Jun 30, 2024 | 1:06 PM Updated Updated Jun 30, 2024 | 1:06 PM

Woman Married 60 Guests: ఇక్కడ ఒక్కరిని పెళ్లి చేసుకోవడానికే దిక్కు లేదు. అలాంటిది ఈ యువతి ఏకంగా 60 మందిని పెళ్లి చేసుకుంది. అది కూడా కేవలం 3 రోజుల్లో. అసలు సరైన లైఫ్ పార్టనర్ దొరకడానికే సంవత్సరాల సమయం పడుతుంది. అలాంటిది ఈమె 3 రోజుల్లో 60 మందిని సెట్ చేసేసుకుంది. ఈమెకేమైనా పిచ్చా అని అనిపిస్తుంది కదూ. 

Woman Married 60 Guests: ఇక్కడ ఒక్కరిని పెళ్లి చేసుకోవడానికే దిక్కు లేదు. అలాంటిది ఈ యువతి ఏకంగా 60 మందిని పెళ్లి చేసుకుంది. అది కూడా కేవలం 3 రోజుల్లో. అసలు సరైన లైఫ్ పార్టనర్ దొరకడానికే సంవత్సరాల సమయం పడుతుంది. అలాంటిది ఈమె 3 రోజుల్లో 60 మందిని సెట్ చేసేసుకుంది. ఈమెకేమైనా పిచ్చా అని అనిపిస్తుంది కదూ. 

  • Published Jun 30, 2024 | 1:06 PMUpdated Jun 30, 2024 | 1:06 PM
పెళ్లికొచ్చిన 60 మంది గెస్టులని వివాహం చేసుకున్న యువతి.. పిచ్చండి ఇది!

సాధారణంగా పెళ్లి వేడుకలు అంటే అతిథులు వెళ్లడం అనేది మామూలే. ఆ వేడుకలో దంపతులను ఆశీర్వదిస్తారు. అయితే ఇక్కడ విచిత్రంగా పెళ్ళికి వచ్చిన అతిథులే భర్తలయ్యారు. తన పెళ్ళికి రమ్మని పిలిచిన అతిథులే ఆ మహిళను పెళ్లి చేసుకున్నారు. అది కూడా ఒకరిద్దరు కాదు, ఏకంగా 60 మంది అతిథులు ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ మహిళే వారిని పెళ్లి చేసుకోమని కోరింది. ఆమె పేరు కార్లీ సారీ. ఆస్ట్రేలియాకి చెందిన 40 ఏళ్ల కార్లీ మూడు రోజుల్లో 60 మందిని వివాహం చేసుకుంది. ఈమె ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. అయితే ఫోటోగ్రాఫర్ గా చేసి చేసి అలసిపోయిన ఈమె పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేయాలని అనుకుంది. అందుకోసం తన పెళ్లి 3 రోజుల పాటు ప్లాన్ చేసుకుంది. అయితే ఈ మూడు రోజుల్లో 60 మందిని పెళ్లి చేసుకోవాలని భావించింది. ఈ 60 మందిలో మగాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉన్నారు. 

అయితే ఆమె ఇలా 60 మందిని వివాహం చేసుకోవడంపై నెట్టింట చర్చ మొదలైంది. నెటిజన్స్ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ కార్లీ మాత్రం తన నిర్ణయం పట్ల గర్వపడుతున్నా అని.. తాను పెళ్లి చేసుకున్న 60 మంది తనకు చాలా ముఖ్యమని వెల్లడించింది. ఎన్నో పెళ్లిళ్లలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా పని చేసింది. ఆ పెళ్లిళ్లకు అందరూ కలిసి రావడం, పాటలు పాడడం, డ్యాన్సులు చేయడం, పార్టీలు ఇవన్నీ ఆమెను పెళ్లి చేసుకునేలా ప్రభావితం చేశాయి. అంతే తన స్నేహితులకి పెళ్లి పత్రికలను పంపించేసింది. తనను పెళ్లి చేసుకోవాలని ఎవరెవరికి ఉంటే వాళ్ళు అందరూ తన పెళ్ళికి గెస్టుగా వచ్చి లైఫ్ పార్టనర్ అవ్వాలని కోరింది. ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి పెళ్లి పత్రికల్లో చెప్పలేదు. కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే పెళ్ళికి రండి అంటూ వెల్లడించింది.

ఆమె కోరినట్లే ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్న 60 మంది మాత్రమే ఆ పెళ్ళికి హాజరయ్యారు. హాజరైన వాళ్ళే ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రతి ఒక్కరినీ పెళ్లి చేసుకుంది. మూడు రోజుల్లో 60 మందిని పెళ్లి చేసుకుంది. ఒక జీవిత భాగస్వామి సరిపోరని.. తన జీవితాన్ని ఒకరికి మాత్రమే అంకితం చేయదలచుకోలేదని.. అందుకే 60 మందిని పెళ్లి చేసుకున్నా అని వెల్లడించింది. అంతేకాదు.. తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. మీ స్నేహితులని పెళ్లి చేసుకోండి. లవర్స్ ని లవ్ చేయండి. నేను నా స్నేహితులను, లవర్స్ ని పెళ్లి చేసుకున్నా’ అంటూ పోస్ట్ పెట్టింది. కాగా దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ పిచ్చండి ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మహిళ 60 మందిని పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet