iDreamPost
android-app
ios-app

ఎవరెస్ట్ ఎక్కిన రెండేళ్ల బుడ్డోడు.. అతి పిన్న వయస్కుడిగా..!

  • Published Jan 29, 2024 | 3:22 PM Updated Updated Jan 29, 2024 | 3:22 PM

ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని ఇప్పటి వరకు ఎంతోమంది అధిరోహించారు. కానీ, ఈ బుడ్డోడు మాత్రం దానిని అధిరోహించడమే కాకుండా.. రికార్డు కూడా క్రియేట్ చేశాడు.

ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని ఇప్పటి వరకు ఎంతోమంది అధిరోహించారు. కానీ, ఈ బుడ్డోడు మాత్రం దానిని అధిరోహించడమే కాకుండా.. రికార్డు కూడా క్రియేట్ చేశాడు.

ఎవరెస్ట్ ఎక్కిన రెండేళ్ల బుడ్డోడు.. అతి పిన్న వయస్కుడిగా..!

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏదీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఎవరెస్ట్ శిఖరం. ఈ శిఖరం ఎక్కి చూస్తే.. ప్రపంచం మన కళ్లముందే ఉందా అన్నంత అనుభూతి కలుగుతుంది. అంతటి మహూన్నతమైన శిఖరాన్ని అధిరోహించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కఠోర శ్రమ, శిక్షణ ఎంతో అవసరం. అంతకు మించి వాతావరణ పరిస్థితులు తట్టుకోవాలి.. గుండె నిండా ధైర్యం కావాలి. మనిషి తల్చుకుంటే ఏదైనా సాధ్యమే అన్న చందంగా ఇప్పటి వరకు ఎంతోమంది ఈ శిఖరాన్ని అధిరోహించి తామేంటో ప్రపంచానికి చాటి చెప్పారు. తాజాగా అతి చిన్న వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు ఓ బుడ్డోడు. వివరాల్లోకి వెళితే..

కొంతమంది చిన్నారులు మాటలు నేర్చుకునే సమయానికే అద్భుతాలు సృష్టిస్తుంటారు. వాళ్లు చేసే పనులు ఎంతో ముద్దుగానే కాదు.. అశ్యరం కలిగించేలా ఉంటాయి. అలాంటి ఓ వండర్ క్రియేట్ చేశాడు బ్రిటీష్ కు చెందిన రెండు సంవత్సరాల చిన్నారి టాట్ కార్టర్. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన టాట్ కార్డర్ పర్వతారోహకునిగా టైటిల్ దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్శించాడు. ఇప్పటి వరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ని చిన్నవయసు వాళ్లు ఎంతోమంది చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ, అతి పిన్న వయసు అంటే కేవలం రెండేళ్లకే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను చేరుకొని రికార్డు క్రియేట్ చేశాడు బ్రిటీష్ కి చెందిన టాట్ కార్టర్.

A two-year-old boy who climbed Everest

గతంలో చెక్ రిపబ్లిక్ కు చెందిన నాలుగు సంవత్సరాల ఓ చిన్నారి ఎవరెస్ట్ బేస్ క్యాంపు చేరుకున్నాడు.  టాట్ కార్టర్ తండ్రి మాట్లాడుతూ.. 2023, అక్టోబర్ 25న తమతో పాటు టాట్ కార్టర్ కూడా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు చేరుకున్నాడు. టాట్ కార్టర్ అతి పిన్న వయసులోనే సాధించిన వియజయం పై చాలా ఆనందంగా ఉంది. బాబుకు శ్వాస సంబంధితన శిక్షణ అందించాం.. దీనికి తోడు చిన్నారి ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే సమయంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు అందేలా చూసుకున్నాం. గతంలో శ్రీలంక, నేపాల్, మాల్దీవులతో సహా అనేక దేశాలు సందర్శించాం. ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నాం’అని అన్నారు. చిన్నారి సాహసం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.