iDreamPost
android-app
ios-app

వీడియో: బాల్కనీనే ఇల్లు.. నెలకు అద్దె రూ.80 వేలు..! ఎక్కడంటే..

Sydney, Balcony: సాధారణంగా ఇల్లు అద్దెకు అనగానే ఒక సింగిల్ రూమ్, డబుల్ బెడ్ రూం, కిచెన్, వాష్ రూమ్ వంటివి అనేకం ఉంటాయి. కానీ ఓ ప్రాంతంలో మాత్రం బాల్కానీనే అద్దెకు ఇస్తున్నారు.

Sydney, Balcony: సాధారణంగా ఇల్లు అద్దెకు అనగానే ఒక సింగిల్ రూమ్, డబుల్ బెడ్ రూం, కిచెన్, వాష్ రూమ్ వంటివి అనేకం ఉంటాయి. కానీ ఓ ప్రాంతంలో మాత్రం బాల్కానీనే అద్దెకు ఇస్తున్నారు.

వీడియో: బాల్కనీనే ఇల్లు..  నెలకు అద్దె రూ.80 వేలు..! ఎక్కడంటే..

నేటికాలంలో చాలా మంది ఉద్యోగాల నిమిత్తం పట్టణాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడే అద్దెకు ఇల్లు తీసుకుని నివాసం ఉంటారు. ఇక ఇల్లు అద్దెకు అనగానే ఒక సింగిల్ రూమ్, డబుల్ బెడ్ రూం, కిచెన్, వాష్ రూమ్ వంటివి అనేకం ఉంటాయి. ఇక హాస్టల్స్ అయినా సరే ఒక బెడ్ ఉంటుంది. ఆ బెడ్ కూడా ఓ రూమ్ లోనే ఉంటుంది. కానీ ఓ ప్రాంతంలో మాత్రం బాల్కానీనే అద్దెకు ఇస్తున్నారు. అయితే దీని అద్దె ఎంత ఉంటుందిలే.. మహా అయితే వెయ్యి, రెండు వేలు ఉంటుందని చాలా మంది భావిస్తారు. కానీ ఏకంగా బాల్కానీ నెల అద్దె రూ.80 వేలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న.. అది మాత్రం నిజం. మరి.. ఎక్కడ, ఆ బాల్కానీ ప్రత్యేకలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ బాల్కానీ రెంట్ అనేది ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. మాములు అద్దెలకు భిన్నంగా మాత్రం ఏకంగా ఇంటి బాల్కనీని అద్దెకు ఇచ్చారు. ఇక ఈ బాల్కనీలోనే పడక ఉంటుంది. ఇక బాత్రూం, వాష్ రూమ్ అంటారా.. వాటిని మాత్రం ఉమ్మడిగా వాడుకోవాల్సిందే. కేవలం పడుకోవటం మాత్రం బాల్కనీలోనే ఉంటుంది. అలానే ఆఫీసుకు ఉన్న రోజుల్లో కేవలం బాల్కనీలో మాత్రమే ఉండాలి. సరే బాల్కనీ కాబట్టి తక్కువ అద్దె అనుకుంటే.. అది కాదు. బాల్కనీ అద్దె నెలకు అక్షరాల 80 వేల రూపాయలు ఉంది. ఆస్ట్రేలియాలోని ప్రైమ్ లొకేషన్ ప్రాంతంలో ఈ భారీ అద్దె ఉంది.

ఆస్ట్రేలియాలోని ఖరీదైన ప్రాంతంలో ఉండే ఓ వ్యక్తి.. సన్నీ రూం అంటూ సోషల్ మీడియాలో బాల్కానీ ఇంటికి గురించి  వీడియో తీసి పోస్టు చేశాడు. ఏంట్రా బాబు ఇది అని నెటిజన్స్ ఆరా తీయగా కళ్లు తిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దేశంలోని సిడ్నీలోని వెస్ట్, సౌత్ సైడ్  ప్రాంతంలో అద్దె రేట్లు 28శాతం నుంచి 31 శాతానికి పెంచారు. దీంతో అక్కడ చదువుకోవడానికి వెళ్లే విధ్యార్థులకు తీవ్రంగా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే కాలంలో చాలా ప్రాంతాల్లో అద్దెలు బాగా పెరిగాయి.

ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు భారీగా స్థాయిలో పెరగడంతో జనాలు అల్లాడిపోతున్నారు. అలాంటి ఇళ్ల అద్దెలు కూడా ఇలా భారీగా పెంచడంతో ..చదువు కోసం, ఉద్యోగం కోసం వెళ్లే ఇతర దేశాల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడతారని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా ఇళ్ల రెంట్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాల్కానీ రెంట్ సోషల్ మీడీయాలో వెలుగులోకి రావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ బాల్కానీ రెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.