iDreamPost
android-app
ios-app

ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వృద్ధుడు! పెళ్లిళ్లే తన ఆరోగ్య రహస్యమంటూ..!

  • Author Soma Sekhar Published - 07:24 PM, Mon - 17 July 23
  • Author Soma Sekhar Published - 07:24 PM, Mon - 17 July 23
ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వృద్ధుడు! పెళ్లిళ్లే తన ఆరోగ్య రహస్యమంటూ..!

‘అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కుక్కపిల్ల.. కాదేదీ కవితకు అనర్హం’ అన్నాడు ఆ నాడు మహాకవి శ్రీశ్రీ. కానీ ఓ వృద్ధుడు ఒక్క అడుగు ముందుకేసి.. వయసు పెళ్లికి అడ్డంకి కాదు.. పైగా తన ఆరోగ్యా రహస్యం అదే అంటున్నాడు ఈ 90 ఏళ్ల వృద్ధుడు.. కాదు కాదు.. 90 ఏళ్ల నవ వరుడు. ఈ మాటలు మీకు వింతగా.. కొత్తగా అనిపించవచ్చు కానీ నిజం. ప్రస్తుతం సౌదీ అరబ్ మీడియాలో 90 సంవత్సరాల వృద్ధుడి పెళ్లి వైరల్ గా మారింది. 90 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకోవడమే కాకుండా.. తన ఆరోగ్య రహస్యం పెళ్లిళ్లే అంటూ స్టేట్ మెంట్ కూడా పాస్ చేశాడు ఈ వృద్ధ పెళ్లికొడుకు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నాదిర్ బిన్ దహైమ్ వాహక్ అల్ ముర్షీదీ అల్ ఓతాబీ అనే వ్యక్తి సౌదీ అరేబియాకు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు. ఇప్పుడు ఇతడు సౌదీలో హాట్ టాపిక్ గా నిలిచాడు. దానికి కారణం 90 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకోవడమే. సౌదీలోని ఆఫీస్ ప్రాంతంలో ఐదవ పెళ్లి చేసుకున్నాడు నాదిర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వృద్ధ పెళ్లికొడుకుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నాదిర్ కు అతిథులు ఐదవ పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదీకాక అతడి మనవడు సైతం తాతకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పడం ఇందులో విశేషం. ఈ వృద్ధ పెళ్లి కొడుకు తాజాగా అరేబియా టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో.. పెళ్లి కాని వారందరు తప్పకుండా వివాహం చేసుకోవాలని సందేశాన్నిచ్చాడు. ఈ పెళ్లి తర్వాత నేను మరో పెళ్లి కూడా చేసుకుంటాను అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అసలు తన ఆరోగ్యానికి, దీర్ఘాయుష్షుకు కారణం తాను చేసుకున్న పెళ్లిళ్లే అని చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ వృద్ధుడు చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి తన ఆరోగ్య రహస్యం పెళ్లిళ్లే అని చెప్పిన ఈ 90 ఏళ్ల నవ వరుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: దారుణం: ప్రముఖ సింగర్ ను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు!

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet