Arjun Suravaram
Miss Universe Argentina: అందాల పోటీ అంటే మనకు టీనేజ్ అమ్మాయిలే గుర్తొస్తారు. వారి అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంటారు. అలానే ఆ టినేజ్ యువతుల్లోనే ఎవరో ఒకరు అందాల కిరీటాన్ని అందుకుంటారు. కానీ అందరి ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ ఓ 60 ఏళ్ల మహిళ సరికొత్త చరిత్ర సృష్టించారు.
Miss Universe Argentina: అందాల పోటీ అంటే మనకు టీనేజ్ అమ్మాయిలే గుర్తొస్తారు. వారి అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంటారు. అలానే ఆ టినేజ్ యువతుల్లోనే ఎవరో ఒకరు అందాల కిరీటాన్ని అందుకుంటారు. కానీ అందరి ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ ఓ 60 ఏళ్ల మహిళ సరికొత్త చరిత్ర సృష్టించారు.
Arjun Suravaram
సాధారణంగా అందాల పోటీలు, ఫ్యాషన్ కాంపిటీషన్ వంటివి అనగానే టీనేజ్ అమ్మాయిలే గుర్తుకు వస్తుంటారు. అలా ఇప్పటికే వరకు ఎక్కడ అందాల పోటీ జరిగిన యువతలు ఎక్కువగా కనిపిస్తుంటారు. తమదైన వెరైటీ దుస్తులతో, శరీర సౌందర్యతంతో అందరిని ఆకట్టుకుంటారు. అలానే ఆ టీనేజ్ గర్ల్స్ లోనే నుంచే ఒకరు అందాల కిరీటాన్ని ముద్దాడుతుంటారు. ఎప్పుడు ఇలాంటి అందాలు పోటీలు జరిగిన యువతులే కిరీటం గెల్చుకుంటారనేది అందరి ఆలోచన. అయితే ఆ ఆలోచనలు పటాపంచలు చేస్తూ..అర్జెంటీనాకు చెందిన 60 ఏళ్ల అలెజాండ్ర మరీసా రొడ్రిగోడ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. అందాల పోటీల్లో తొలిసారి 60 ఏళ్ల మహిళ కిరీటం సొంతం చేసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా దేశంలో ఓఅరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్ అనే 60 ఏళ్ల మహిళ సరికొత్త చరిత్ర సృష్టించారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో ఇటీవల అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ప్లాటా నగరానికి చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా కూడా పాల్గొన్నారు. ఈమెతో చాలా మంది యువతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అందరిని వెనక్కి నెట్టి 60 ఏళ్ల అలెజాండ్ర విజేతగా నిలిచారు. ‘మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్’ టైటిల్ ఈ 60ఏళ్ల మహిళ గెలుచుకున్నారు. అదే విధంగా అలెజాండ్రా ఓ సరికొత్త రికార్డు సృష్టించారు. అందాల పోటీల్లో 60 ఏళ్ల వయస్సులో కిరీటం పొందిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
అలెజాండ్రా వృత్తిరీత్యా లాయర్, జర్నలిస్టు అయినప్పటికీ ఫ్యాషన్ పై కూడా ఆమెకు ఆసక్తి ఎక్కువే. అందుకే ఎలాగైనై తాను అందాల పోటీల్లో పాల్గొన్నాని భావించి.. తన సంకల్పానికి వయసు అడ్డు కాదని నిరూపించారు. అందానికి సరికొత్త అర్థం చెప్పారు అలెజాండ్రా. 2024 మే నెలలో జరగబోయే ‘మిస్ యూనివర్స్ అర్జెంటీనా’ పోటీల్లో ఈమె బ్యూనస్ ఎయిర్స్ తరపు నుంచి ప్రాతినిధ్యం వహించనుంది. అక్కడ కూడా ఆమె గెలిస్తే 2024 సెప్టెంబరులో మెక్సికో వేదికగా జరిగే ‘మిస్ యూనివర్స్-2024’ పోటీల్లో అర్జెంటీనా దేశం తరఫున పాల్గొంటారు. ఈ 60 ఏళ్ల అందాల రాణి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి.. ఈ 60 మిస్ యూనివర్స్ సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
La abogada y periodista Alejandra Marisa Rodríguez de 60 años, ganó el concurso Miss Buenos Aires 2024 y estará compitiendo para representar a Argentina en Miss Universe.
La señora de atrás con el traje azul fue la primera finalista y tiene 73 años.
La verdad es que la ganadora… pic.twitter.com/Z6LcXnzIcj
— Molusco (@Moluskein) April 23, 2024