వారానికి 10 గంటలే పని.. ఏడాదికి రూ. 80 లక్షల సంపాదన!

యుక్త వయస్సులో ఉన్నప్పుడే వీలైనత ఎక్కువగా సంపాదించుకోవాలి. శరీరం పూర్తిగా సహకరించే ఆ దశలో సంపాదనపై పూర్తి స్థాయిలో ఆలోచనలు చేయాలి. అలా చేసిన ఓ యువతి..కేవలం తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని అర్జిస్తూ.. నేటితరం యువతకి ఆదర్శంగా నిలుస్తుంది.

యుక్త వయస్సులో ఉన్నప్పుడే వీలైనత ఎక్కువగా సంపాదించుకోవాలి. శరీరం పూర్తిగా సహకరించే ఆ దశలో సంపాదనపై పూర్తి స్థాయిలో ఆలోచనలు చేయాలి. అలా చేసిన ఓ యువతి..కేవలం తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని అర్జిస్తూ.. నేటితరం యువతకి ఆదర్శంగా నిలుస్తుంది.

ప్రతి మనిషికి ఎక్కువ ధనం సాంపాదించాలనే కోరిక ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని ఎంచుకుంటారు. అయితే కొందరు రేయింబవళ్లు కష్టపడిన కూడా చాలిచాలని ఆదాయం మాత్రమ వస్తుంది. కొందరు మాత్రం ఎలాగైనా ఎక్కువ డబ్బుల సంపాధించాలని రెండు లేదా అంతకు మించి  జాబులు చేస్తుంటారు. అంతాల కష్టపడినా వారు ఆశించిన స్థాయిలో మాత్రం సంపాదన అందదు. కానీ ఓ అమ్మాయి. మాత్రం ఎక్కంగా ఎనిమిది ఆదాయా మార్గాలతో భారీగా ధనం అర్జిస్తోంది. కేవలం వారానికి 10 గంటలు మాత్రమే పని చేస్తూ ఏడాదికి రూ.80లక్షల వరకు సంపాదిస్తుందట. మరి.. ఆ యువతి సక్సెస్ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఎవరమైనా వ్యక్తిగత జీవితాన్ని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నస్తుంటారు. వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూ..భారీ ఆదాయం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే అలా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూ భారీగా సంపాదించగలరు. అలాంటి అతి తక్కువ మంది వ్యక్తుల్లో  గ్రేస్ ర్యూ అనే యువతి ఒకరు. అమెరికాలోని ఓ హ్యూస్టన్ లో గ్రేస్ ర్యూ నివాసం ఉంటుంది. ఈమె చిన్నతనం నుంచి బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉండేది. అలానే తన వ్యక్తిగత జీవితానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని భావించింది. గ్రేస్ ర్యూ పలు ఉద్యోగాలు చేస్తూ నెలకు ఆరు అంకెల జీతం సంపాదిస్తోంది.

ఆమె తన వ్యక్తిగత జీవితం వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసేలానే తన ఉద్యోగాలను ఎంచుకుంది. తను జీవితంలో ఎట్టిపరిస్థితుల్లోనూ 9 టు 5 టైమింగ్ ఉండే ఉద్యోగాలు చేయకూడదని గ్రేస్ ర్యూ స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుందట. అందుకే అసలకే అలాంటి ఉద్యోగాల జోలికే గ్రేస్‌ ర్యూ వెళ్లలేదు. ప్రస్తుతం ఆండ్రీ గ్రేస్ ర్యూ వయస్సు 23 సంవత్సరాలు. ఈమె ఇప్పటి వరకు పలు ఉద్యోగాలు చేస్తూ.. 96,000 డాలర్లు సంపాదిస్తుంది. ఇండియన్ కరెన్సీలో 80 లక్షల 15 వేల రూపాయలు సంపాదించింది. ప్రస్తుతం గ్రేస్  ర్యూ.. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో రిక్రియేషన్ పార్క్ అండ్ టూరిజం సైన్స్ చదువుతోంది.  అదే సమయంలో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఏ ఒక్క ఉద్యోగానికో పరిమితంగా ఉండలేదు.

తనకు నచ్చిన, ఇష్టమైన పని చేస్తూ డబ్బు సంపాదిస్తుంది. టెక్నాలజీ, సేల్స్, హాస్పిటాలిటీకి సంబంధించిన అన్నీ రకాల సెక్టార్స్ లోనూ గ్రేస్ పనిచేసింది. గ్రేస్ కి ఈ ఉద్యోగాలన్నింటిలో ఎక్కువ అనుభవం ఉంది. అదీగాక గ్రేస్‌కు ట్రావెలింగ్‌ చేయడం అంటే చాలా ఇష్టం అంట. గ్రేస్ తల్లిదండ్రులు కొరియాలో ఉంటారు. ఆమె అప్పుడప్పుడూ వారిని చూసేందుకు అక్కడికి వెళ్తోంది. గ్రేస్‌కు కొన్ని సొంత ఇళ్లు కూడా ఉన్నాయి. వాటి నుంచి కూడా గ్రేస్ కి మంచి ఆదాయం వస్తుంది.  ఇలా తన ఇళ్ల నుంచి వచ్చే అద్దెను మళ్లీ పెట్టుబడిగా పెడుతూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది.

తన ఇంటిని అద్దెకు ఇచ్చిన గ్రేస్, వచ్చిన మొత్తాన్ని మళ్లీ పెట్టుబడి పెడుతూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఈక్రమంలో గ్రేస్‌  చాలా ఉద్యోగాలు కూడా చేసింది.  ఈయువతి టెక్ కంపెనీలో కూడా పని చేసి..తన ప్రతిభను చూపించింది. డాగ్ వాకర్, క్రియేటర్, టిక్‌టాక్ పార్టనర్‌తో సహా ప్రీ-లైసెన్సర్‌గా కూడా గ్రేస్ పనిచేశారు. ఇలా గ్రేస్ మొత్తంగా ఎనిమిది ఉద్యోగాలు చేసినప్పటికీ వాటన్నింటికి సగటున వారానికి పది గంటలే పని చేస్తుందట. అంతేగాదు రొటీన్‌గా సాగిపోయే 9 నుంచి 5 గంటల జాబ్ చేసేకంటే మీకు నచ్చిన పనులు హాయిగా చేసుకుంటూ. సమయాని సరిగ్గా వినియోగించుకుంటూ ఎక్కువ డబ్బులు సంపాదించడమే తెలివైన పని అని గ్రేస్ చెబుతోంది. మరి..23 ఏళ్ల వయస్సులోనే ఇలాంటి అద్భుతాలు సాధించిన ఈ యువతి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. మరి.. ఈ యువతి సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments