iDreamPost
android-app
ios-app

అది విమాన ప్రమాదం కాదు.. ఓ మారణ హోమం! 583 మంది కళ్ల ముందే కాలిపోతుంటే..!

  • Published Mar 27, 2024 | 6:06 PM Updated Updated Mar 27, 2024 | 6:06 PM

1977 Tenerife Airport Disaster: కొన్ని ప్రమాదాలు చరిత్రలో నిలిచిపోతాయి.. కొన్ని ప్రమాదాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తాయి.. ఈ రెండు జరిగిన ఒక ప్రమాదం ఉంది. చరిత్రలోనే అత్యంత పెద్ద విమాన ప్రమాదంగా నిలిచింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1977 Tenerife Airport Disaster: కొన్ని ప్రమాదాలు చరిత్రలో నిలిచిపోతాయి.. కొన్ని ప్రమాదాలు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తాయి.. ఈ రెండు జరిగిన ఒక ప్రమాదం ఉంది. చరిత్రలోనే అత్యంత పెద్ద విమాన ప్రమాదంగా నిలిచింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 27, 2024 | 6:06 PMUpdated Mar 27, 2024 | 6:06 PM
అది విమాన ప్రమాదం కాదు.. ఓ మారణ హోమం! 583 మంది కళ్ల ముందే కాలిపోతుంటే..!

సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో రెండు వాహనాలు ఢీకొంటే ప్రాణనష్టంతో పాటు.. ఆ దృశ్యాలు చూసేందుకు భయకరంగా ఉంటాయి. అలాగే రెండు ట్రైన్స్‌ ఎదురెదురుగా ఢీ కొంటే ప్రమాద తీవ్రతను ఊహించలేం. అలాంటిది ప్రయాణికులతో ఫుల్‌ అయిన రెండు విమానాలు ఢీ కొంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? బస్సులు, రైళ్ల కంటే ఎన్నో రెట్లు వేగంగా ప్రయాణించే విమానులు.. ఢీ కొంటే అది ప్రమాదం కాదు.. ఓ మారణ హోమం అవుతుంది. ఊహిస్తేనే భయకరంగా ఉందికదా.. కానీ, ఇలాంటి దారుణం నిజంగానే జరిగింది. 1977 మార్చి 27 అంటే సరిగ్గా ఇదే రోజు రన్‌వే పై రెండు విమానాలు ఢీ కొని ఏకంగా 583 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ చరిత్రలో అతి పెద్ద విమాన ప్రమాదంగా చెప్పుకునే టెనెరిఫ్‌ విమాన ప్రమాదం జరిగి నేటికి 47 ఏళ్లు పూర్తి అయ్యాయి. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

స్పెయిన్‌లోని టెనెరిఫేలోని కానరీ ద్వీపంలోని లాస్ రోడియోస్ విమానాశ్రయంలో రెండు విమానాలు టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్నాయి. కేఎల్‌ఎం బోయింగ్ 747 విమానంతో పాటు, పన్‌ ఆమ్‌ విమానం ప్రయాణికుల ఫుల్‌ అయి.. గాల్లోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు విమానాలకు ఏవియేషన్‌ అధికారుల నుంచి టేకాఫ్‌కు క్లియర్స్‌ రావాల్సి ఉంది. అంతకంటే కొద్ది సేపటి ముందు గ్రాన్‌ కానరియా ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన తీవ్రవాద సంఘటన కారణంగా చాలా విమానాలను లాస్‌ రోడియోస్‌కు మళ్లించారు. ఇది చిన్న ఎయిర్‌పోర్ట్‌ కావడంతో అంతా గందరగోళం నెలకొంది. అదే సమయానికి పన్‌ఆమ్‌ విమానం ఓ రన్‌వేపై ఆగి ఉంది. అయితే.. ఏవియేషన్‌ అధికారుల నుంచి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ క్లియరెన్స్‌ వచ్చిందని కేఎల్‌ఎం విమాన కెప్టెన్‌ రన్‌వేపై విమానాన్ని టేకాఫ్‌కు సిద్ధం చేసి పరుగులు పెట్టించాడు. అయితే.. క్లియరెన్స్‌ వచ్చిందని అతను పొరపాటు పడ్డాడు. ఇంకా ఆ విమానానికి టేకాఫ్‌ కోసం క్లియర్స్‌ రాలేదు. ఈ కేఎల్‌ఎం విమానం పరుగులు తీస్తున్న రన్‌వే పైనే అడ్డంగా పన్‌ఆమ్‌ విమానం ఆగి ఉంది.

రన్‌వేపై భారీగా పొగమంచు ఉండటంతో కేఎల్‌ఎం పైలెట్లు ఆ విమానానికి దగ్గరగా వచ్చేంత వరకు కూడా చూడలేకపోయారు. చాలా దగ్గరికి వచ్చిన తర్వాత సెన్సార్లు అలర్ట్‌ అవ్వడం, దూరంగా విమానం కనిపించడంతో ఎమర్జెన్సీ టేకాఫ్‌ కోసం కేఎల్‌ఎం పైలెట్లు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. చాలా వేగంగా వచ్చిన కేఎల్‌ఎం విమానం, పన్‌ఆమ్‌ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేఎల్‌ఎం విమానంలోని మొత్తం 234 మంది ప్రయాణికులు. 14 మంది సిబ్బంది మరణించారు. పాన్ ఆమ్ విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 396 మంది ఉండగా అందులో 335 మంది మరణించారు. క్లియర్స్‌ వచ్చిందని కెప్టెన్‌ పొరపాటు పడటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విచారణలో తేలింది. ఈ ప్రమాదానికి సంబంధించిన గ్రాఫిక్స్‌ కూడా రూపొందించారు. ఆ విజువల్స్‌లో ప్రమాదం జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. కింద ఆ వీడియో ఉంది, వీడియో చూసి.. ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.