స్కూల్‌కి సెలవు పెట్టకుండా 50 దేశాల్లో పర్యటించిన పదేళ్ల చిన్నారి!

స్కూల్‌కి సెలవు పెట్టకుండా 50 దేశాల్లో పర్యటించిన పదేళ్ల చిన్నారి!

  • Author Soma Sekhar Published - 02:52 PM, Sat - 22 July 23
  • Author Soma Sekhar Published - 02:52 PM, Sat - 22 July 23
స్కూల్‌కి సెలవు పెట్టకుండా 50 దేశాల్లో పర్యటించిన పదేళ్ల చిన్నారి!

మనలో చాలా మందికి ప్రపంచ దేశాలు చుట్టిరావాలన్న కోరిక ఉంటుంది. అయితే పిల్లల స్కూళ్లు, ఖర్చులు, ఉద్యోగాలు లాంటి అనేక కారణాల వల్ల ఆ కోరికలు అలాగే ఉంటూ ఉంటాయి. కానీ ఓ పదేళ్ల చిన్నారికి ఇవేవీ అడ్డురాలేదు. దాంతో ఇప్పటి వరకు 50 దేశాలను చుట్టి వచ్చింది. పదేళ్ల చిన్నారి అంటే ఉద్యోగం ఉండదు కానీ.. అంతకంటే ఎక్కువైన స్కూల్ ఆ చిన్నారికి ఉంటుంది. అయితే 50 దేశాలు చుట్టి వచ్చినా గానీ ఇప్పటి వరకు ఈ చిన్నారి ఒక్కరోజు కూడా స్కూల్ కు లీవ్ పెట్టలేదంటే మీరు నమ్ముతారా? ఆశ్చర్యంగా ఉంది కదూ! మరి ఆ చిన్నారి స్కూల్ ఎగ్గొట్టకుండా ఎలా ఇన్ని దేశాలు తిరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

అదితి త్రిపాఠి.. భారత సంతతికి చెందిన పదేళ్ల చిన్నారి. ఆమె తల్లిదండ్రులు దీపక్ త్రిపాఠి, అవిలాష బ్యాంక్ లో అకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు. వీరు సౌత్ లండన్ లో నివాసం ఉంటున్నారు. తమ కూతురు అదితికి చిన్నతనం నుంచే అనేక దేశాలను చూపిస్తూ.. వస్తున్నారు తల్లిదండ్రులు. అలా చూపించడం వల్ల సమాజంపై అవగాహనతోపాటుగా.. వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, రకరకాల మనుషుల గురించి తెలుసుకుంటుందన్నారు. ఇది తనకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని తండ్రి దీపక్ తెలిపారు. అయితే 50 దేశాలు తిరిగినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా స్కూల్ కు సెలవు పెట్టలేదట చిన్నారి అదితి. అలా ఎలా? అని వారి తల్లిదండ్రులను అడగ్గా.. వారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

“అదితిని శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి నేరుగా వెకేషన్ కు తీసుకెళ్తాం. ఏ దేశం వెళ్లాలో ముందుగానే నిర్ణయించుకుంటాం. అలాగే ఎక్కడికి వెళ్లినా గానీ ఆదివారం రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటాం. అయితే ఒక్కోసారి లేట్ అవుతుంది. అప్పుడు నేరుగా ఎయిర్ పోర్ట్ నుంచి స్కూల్ కు వెళ్లిపోతుంది. మా పర్యటనల కోసం ఏడాదికి ఏకంగా 20వేల పౌండ్లను(ఇండియా కరెన్సీలో రూ.21 లక్షలు) ఖర్చు చేస్తాం” అని దీపక్ త్రిపాఠి తెలిపారు. ఇక ఇప్పటి వరకు తమకు సొంత కారు కూడా లేదని, పర్యటనలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ నే వినియోగిస్తామని వారు తెలిపారు.

ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో కూడా తనకు వీలైనన్ని ఎక్కువ దేశాలు చూపిస్తామని అదితి తల్లిదండ్రులు పేర్కొన్నారు. నాకు నేపాల్, జార్జియా, అర్మేనియా దేశాలు అంటే ఎంతో ఇష్టమని అదితి తెలిపింది. ఇలా దేశాలు తిరగడం వల్ల మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఈ చిన్నారి తెలిపింది. మరి ఒక్కరోజు కూడా స్కూల్ ఎగ్గొట్టకుండా 50 దేశాలు చూసొచ్చిన చిన్నారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రైల్వే ట్రాక్ పై కారు నడిపిన వ్యక్తి.. వైరలవుతున్న వీడియో!

Show comments