iDreamPost
android-app
ios-app

వీడియో: లేడీ బుమ్రా సూపర్బ్ బౌలింగ్.. అచ్చం టీమిండియా స్పీడ్​స్టర్​ను దించేసింది!

  • Published Aug 29, 2024 | 3:55 PM Updated Updated Aug 29, 2024 | 3:55 PM

Jasprit Bumrah, Lady Bumrah, Team India: టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాను ఎంతో మంది యంగ్​స్టర్స్ స్ఫూర్తిగా తీసుకుంటారు. అతడిలా దేశానికి ఆడాలని, అంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. అతడి బౌలింగ్ యాక్షన్​ను ఇమిటేట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు.

Jasprit Bumrah, Lady Bumrah, Team India: టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రాను ఎంతో మంది యంగ్​స్టర్స్ స్ఫూర్తిగా తీసుకుంటారు. అతడిలా దేశానికి ఆడాలని, అంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. అతడి బౌలింగ్ యాక్షన్​ను ఇమిటేట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు.

  • Published Aug 29, 2024 | 3:55 PMUpdated Aug 29, 2024 | 3:55 PM
వీడియో: లేడీ బుమ్రా సూపర్బ్ బౌలింగ్.. అచ్చం టీమిండియా స్పీడ్​స్టర్​ను దించేసింది!

ప్రస్తుత క్రికెట్​లో టాప్ బౌలర్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు.. జస్​ప్రీత్ బుమ్రా. ఫార్మాట్​తో సంబంధం లేకుండా ఆడిన ప్రతి చోట, ప్రతి మ్యాచ్​లో దుమ్మురేపడం బుమ్రాకు అలవాటుగా మారింది. అతడి బౌలింగ్​ను ఎదుర్కోవాలంటేనే ప్రత్యర్థి బ్యాటర్లు వణుకుతున్నారు. పరుగులు తీయడం పక్కనబెడితే.. వికెట్లు కాపాడుకున్నా గొప్పే అన్నట్లుగా ఉంది సిచ్యువేషన్. బుమ్రాను స్ఫూర్తిగా తీసుకొని బౌలింగ్ మొదలుపెడుతున్న వారూ ఉన్నారు. ఈ జనరేషన్​లో ఎంతో మంది యంగ్​స్టర్స్ టీమిండియా స్పీడ్​స్టర్​ను చూసి ఇన్​స్పైర్ అవుతున్నారు. అతడిలా దేశానికి ఆడాలని, ఆ రేంజ్​లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. కొందరైతే బుమ్రా బౌలింగ్ యాక్షన్​ను దింపేస్తున్నారు. ఈ అమ్మాయి కూడా ఇదే కోవలోకి వస్తుంది.

బెంగళూరుకు చెందిన ఓ స్కూల్ గర్ల్ అచ్చం బుమ్రా మాదిరిగా బౌలింగ్ చేస్తూ ఫేమస్ అయిపోయింది. స్కూల్ డ్రెస్​లోనే గ్రౌండ్​కు వచ్చిన ఆ అమ్మాయి.. చేతికి బాల్ అందుకొని రనప్ మొదలుపెట్టింది. బుమ్రా మాదిరిగా పరిగెత్తుకుంటూ వచ్చి అతడి స్టైల్​లోనే బాల్​ను రిలీజ్ చేసి బ్యాటర్ వైపు సంధించింది. పిచ్​పై పడిన బంతి అంతకంటే వేగంగా బ్యాటర్ వైపు దూసుకెళ్లింది. బాల్ చేతిలో పట్టుకున్న తీరు దగ్గర నుంచి రనప్, ఫుట్ ల్యాండింగ్, హెడ్ పొజిషన్ అన్నీ టీమిండియా స్పీడ్​స్టర్​ను పోలి ఉన్నాయి. ఆమె జంప్ చేసిన తీరు కూడా అదే. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఆమె బుమ్రా సోదరిలా ఉందని అంటున్నారు. లేడీ బుమ్రా బౌలింగ్ సూపర్బ్​గా ఉందని.. అదిరిపోయిందని మెచ్చుకుంటున్నారు.

అచ్చం బుమ్రా మాదిరే బౌలింగ్ చేస్తున్న ఈ అమ్మాయి.. ఫ్యూచర్​లో టీమిండియాకు ఆడి అతడిలాగే నంబర్ వన్ బౌలర్​గా ఎదగాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. ఆమె పట్టుదల చూస్తుంటే ఆ స్థాయికి చేరుకుంటుందనే నమ్మకం ఉందని అంటున్నారు. ఆమెను సెలెక్ట్ చేసి సరైన ట్రైనింగ్, గైడెన్స్ ఇస్తే వరల్డ్ నంబర్ వన్ బౌలర్​గా మారుతుందని చెబుతున్నారు. ఇలాంటి వారిని వెలుగులోకి తీసుకురావాలని.. తన టాలెంట్​ను భారత క్రికెట్​ బోర్డు గుర్తించి ప్రోత్సహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇక, ఆ లేడీ బుమ్రా పేరు మైరా జైన్ అని తెలుస్తోంది. ఆమె బౌలింగ్ వేసిన వీడియోతో పాటు బ్యాటింగ్ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో నిల్చున్న చోటు నుంచే అలవోకగా భారీ షాట్స్ కొడుతూ కనిపించింది మైరా. మరి.. ఈ లేడీ బుమ్రా.. రియల్ బుమ్రా రేంజ్​లో సక్సెస్ అవుతుందా? మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by OneCricket (@onecricket.official)