‘ఇడియట్’ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా? అది ఎంతో ప్రమాదం!

Idiot Syndrome: ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే అంటారు.

Idiot Syndrome: ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే అంటారు.

ప్రపంచం టెక్నాలజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది. మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదని ఎన్నో నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఆకాశం, భూమి, సముద్రం అన్నింటా తన ఆదిపత్యాన్ని చాటుకుంటున్నాడు. కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్టే అంటున్నారు. సెల్ ఫోన్ తో కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాదు.. ఫోటోలు, వీడియోలు, చాటింగ్స్ లాంటి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు మనకు తెలియని విషయాలు గూగుల్ లో సర్చ్ చేసే అవకాశం ఉంది. ఇటీవల తమకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే సొంత చిట్కాల కోసం గూగుల్ లో ఎక్కువ వెతుకుతున్నారు. అలా సొంత వైద్యం డేంజర్ అంటున్నారు నిపుణులు. వివరాల్లోకి వెళితే..

స్మార్ట్ ఫోన్ అనేది పట్టణాల్లోనే కాదు.. మారుమూల ప్రాంతాల్లో కూడా విపరీతంగా వాడుతున్నారు. ఇంటర్ నెట్ అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ రంగంలో ఎంత మంచి ఉందో.. అంతే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు. గూగుల్ సెర్చ్ లో మనకు తెలియని ప్రతి విషయం సెకన్లలో తెలిసిపోతుంది. సాధారణంగా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే చిన్న చిన్న చిట్కాలు తీసుకొని సొంత వైద్యం చేసుకుంటారు. తగ్గక పోతే వెంటనే హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్లకు చూపించుకుంటాం. కానీ ఈ మధ్య సొంత చికిత్స కోసం గూగుల్ లో ఎక్కువగా వెతుకుతూ ఎవరికి వారు గూగుల్ డాక్టర్లు అవుతున్నారు. ఇలా వైద్యం కోసం డాక్టర్లను ఆశ్రయించకుండా గూగుల్ పై ఆధారపడే లక్షణాన్నే ‘ఇడియట్ సిండ్రోమ్’ అని అంటారు. దీన్నే ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్ స్ట్రక్షన్ ట్రీట్ మెంట్ అంటారు.దీన్ని సైబర్ క్రోండియా అని కూడా పిలుస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే మీకు ఉన్న అనారోగ్య సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇంటర్నెట్ లో దొరికే వైద్య సమాచారంతో పోల్చుకొని తప్పుగా అన్వయించుకోవడం అన్నమాట.

ఇటీవల ఇలాంటి వారి సంఖ్య మరీ ఎక్కువ అయ్యింది. ఎంతగా అంటే ఎలాంటి అనుభవం లేకుండా యూట్యూబ్ లో వీడియోలు చూసి ఆపరేషన్లు, డెలివరీ  చేస్తున్నారు. వీటి వల్ల ఎంతోమంది తమ ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. వీటి వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు చెప్పినప్పటికీ.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. గూగుల్ లో సర్చ్ చేసి మెడిసన్స్ ని ఫాలో అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని తాజా అధ్యాయనం వెల్లడించింది. ఇలా చేయడం వల్ల మంచి కన్నా చెడు జరిగే ప్రమాదం ఎక్కువ ఉందని నిపుణులు చెబుతున్నారు. నమ్మదగిన హెల్త్ వెబ్ సైట్స్ ద్వారా రోగులకు తగిన సమాచరం పొందడం మంచిదే.. కానీ అర్హత గల వైద్య నిపుణుడి వ్యాధి నిర్ధారణ సామర్థ్యం ఏమాత్రం సమం కాదని నిపుణులు అంటున్నారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు చెందిన ‘క్యూరియస్’ లో దీనికి సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి.

Show comments