Arjun Suravaram
చాలా మందికి ధూమపానం చేయడం వలన కలిగే నష్టం గురించి అందరికి తెలుసు. ఏసీ గదుల్లో కూర్చొని సిగరేట్ తాగేవారికి ఎంతో నష్టం జరుగుతుందో మీకు తెలుసా?. ఆ నిజాలు తెలిస్తే.. ఇక వాటి జోలికే మీరు వెళ్లరు.
చాలా మందికి ధూమపానం చేయడం వలన కలిగే నష్టం గురించి అందరికి తెలుసు. ఏసీ గదుల్లో కూర్చొని సిగరేట్ తాగేవారికి ఎంతో నష్టం జరుగుతుందో మీకు తెలుసా?. ఆ నిజాలు తెలిస్తే.. ఇక వాటి జోలికే మీరు వెళ్లరు.
Arjun Suravaram
చాలా మంది కొన్ని చెడు వ్యసనాలు ఉంటాయి. ముఖ్యంగా మద్యం తాగడం, సిగరేట్లు తాగడం, గంజాయి సేవించడం వంటివి ఉంటాయి. ఇంకా దారుణం ఏమిటంటే..ఇటీవల కాలంలో సిగరెట్ తాగే వారి సంఖ్య బాగా పెరిగింది. సరదాగానో, ఫ్యాషన్ గానో మొదలయ్యే ఈ సిగరెట్ అలవాటు వ్యసనంగా మారుతుంది. కొంరు మొదట్లో రోజుకొక సిగరెట్ తో ప్రారంభమై..ప్యాకెట్లు ప్యాకెట్లు చొప్పున పీల్చేస్తున్నారు. దీంతో మనిషిని ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా నాశనం చేస్తుంది. ఇంకా దారుణం ఏమిటంటే ధూమపానం వల్ల నష్టం పీక్స్ కి చేరేంతవరకు గుర్తించలేరు. ఇది ఇలా ఉంటే ఏసీ రూముల్లో సిగరెట్ తాగటం అంతకు మించి ప్రమాదకరమని తెలుస్తోంది. ఏసీ రూముల్లో ధూమపానం చేయడం వలన కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
చాలా మందికి ధూమపానం చేయడం వలన కలిగే నష్టం గురించి అందరికి తెలుసు. అయితే అలా సిగరెట్ తాగడం వలన కలిగే నష్టాలు తెలిసి కూడా ఆ వ్యసనం నుంచి బయట పడలేరు. ఇక ఎక్కువ మంది రూమ్ లో కూర్చోని తెగ సిగరెట్లు కాలుస్తుంటారు. ఇది చాలా ప్రమాదమని తెలిసిందే. అయితే మాములు గదుల్లో కంటే.. ఏసీ గదుల్లో కూర్చొని సిగరేట్ తాగేవారికి ఎంతో నష్టం జరుగుతుందని నిపుణలు చెబుతున్నారు. ఏసీలో కూర్చొని చాలా మంది ధూమపానం చేస్తుంటారు. దీని వల్ల సిగరెట్ తాగటం వల్ల కలిగే నష్టం రెట్టింపవుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో, అలానే ఏసీ రూమ్ లో కూర్చొన్ని సిగరెట్ తాగడం వలనే కలిగే నష్టాలు అనేకం ఉన్నాయి.
సిగరెట్లు, ఇతర ధూమపానలు చేయడం వలన గుండె పోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలానే లంగ్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పేగుల్లో మంట, మైగ్రేన్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. పొగాకు వల్ల అనేక అనార్థాలు కలుగుతాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ సమస్య, లంగ్ క్యాన్సర్, డిప్రెషన్ కి లోను కావడం వంటి సమస్యలు వస్తాయి. ఇంతటి హానికరమైన దూమపానం అలవాటు వెంటనే మానెయ్యాలంటే మిరియాలు, లవంగం, పసుపు, ఆకు కూరలు, వాము బాగా సాయపడతాయి. మొత్తంగా అసలు ఏసీ రూమ్, మాములు రూమ్ అని కాకుండా.. సిగరెట్లు తాగడం మానేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇలా సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చి అనేక మంది వివిధ రకాల అనారోగ్యాలకు గురయ్యారు. అలానే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. విద్యార్థులు కూడా ఇలాంటి చెడు అలవాట్లు బానిసలు అవుతున్నారు.