iDreamPost
android-app
ios-app

హోలీలో రంగులు పూసుకున్నాక.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే చాలా ప్రమాదం!

  • Published Mar 25, 2024 | 3:46 PM Updated Updated Mar 25, 2024 | 3:46 PM

Precautions be taken on Holi Celebrations: సంతోషాన్ని.. ఆనందాన్ని ఇచ్చే రంగుల పండుగ హోలీ. ఈ పండుగ రోజు చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు.

Precautions be taken on Holi Celebrations: సంతోషాన్ని.. ఆనందాన్ని ఇచ్చే రంగుల పండుగ హోలీ. ఈ పండుగ రోజు చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు.

హోలీలో రంగులు పూసుకున్నాక.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే చాలా ప్రమాదం!

దేశ వ్యాప్తంగా హూలీ పండు ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు రంగులు, రంగు నీళ్లు చల్లుకుంటూ ఆనందంగా హూలీ వేడుకలు జరుపుకుంటారు. కొంతమంది స్నేహితులు కోడి గుడ్లు, టమాటలు నెత్తిపై కొడుతూ హడావుడి చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో హూలీ సంబరాలు రెండు మూడు రోజుల జరుపుకుంటారు. ఇటీవల రంగుల్లో కెమికల్స్ కలవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. పండుగ జరుపుకునే ముందు.. తర్వాత కొన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇందుకోసం ఏం చేయాలన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

రంగుల పండుగ హూలీ ప్రతి ఒక్కరికీ ఇష్టమైన పండుగ. దేశ వ్యాప్తంగా సోమవారం, మార్చి 25న ఈ పండుగ జరుపుకుంటున్నారు. హూలీ అంటేనే రంగుల పండుగ.. ఇందుకోసం మార్కెట్ లో ఎన్నో రకాల రంగులు దొరుకుతున్నాయి. హూలీ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు, రంగు నీళ్లు చల్లుకోవడం చేస్తుంటారు. హూలీ జరుపుకున్నంత సేపు మంచి సరదాగే ఉంటుంది. ఆ తర్వాత ఇబ్బందులు మొదలవుతాయి. రంగుల్లో ఉండే కెమికల్స్ వల్ల కొన్నిసార్లు చర్మం పాడవుతుంది. రంగులు నేరుగా చర్మంపై పడి చాలా మందికి స్కిన్ ఎలర్జీ వస్తుంది. రంగులు కొన్నిసార్లు కళ్లలో పడి కళ్లు దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక జుట్టు సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఈ సమస్యల నుంచి కొన్ని చిట్కాలు పాటించి రక్షణ పొందవొచ్చు.

హూలీ ఆడిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • హూలీ ఆడిన వెంటనే గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.. దీంతో హానికరమైన సూక్ష్మ క్రిములు వదిలిపోతాయి.
  • హూలీ ఆడిన తర్వాత కొంతమంది సాయంత్రం వరకు ఎంజాయ్ చేస్తుంటారు.. అది చాలా ప్రమాదం. వెంటనే రంగులు కడిగితే ఇబ్బందులు రావు
  • ఒంటికి అంటుకున్న రంగును వదిలించుకోవడానికి పదే పదే రుద్దడం చర్మానికి మంచిది కాదు. నెమ్మదిగా పొగొట్టే ప్రయత్నం చేయాలి
  • డ్రై స్కిన్ ఉన్న వారు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అలా చేస్తే చర్మం లోపల తేమను ఉంచతుంది.
  • చర్మం చికాకుగా ఉంటే.. సాధారణ కొబ్బరి నూనెను రుద్దుకుంటే కూల్ గా ఉంటుంది.
  • కొబ్బరి నూనె రాసినా కూడా చర్మం దురద అనిపిస్తే.. వేపాకు నీటితో స్నానం చేస్తే రిలీఫ్ గా ఉంటుంది.
  • ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మ సమస్య, కళ్లు బాగా మండితే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచింది. వారి ఇచ్చే సూచనలు పాటించాలి.
  • కొన్ని సార్లు చర్మంపై రంగులు వెంటనే పోవు.. అక్కడ క్రీములు పదే పదే పూయడం లాంటివి చేయవొద్దు. వాటంతట అవే పోయేవరకు వెయిట్ చేయాలి