Mobile Addiction-Health Problems, Fertility Issue: మహిళల్లో సంతానలేమికి కారణం అవుతున్న మొబైల్‌ ఫోన్లు.. బీకేర్‌ఫుల్‌!

మహిళల్లో సంతానలేమికి కారణం అవుతున్న మొబైల్‌ ఫోన్లు.. బీకేర్‌ఫుల్‌!

Mobile Phone: నేటి కాలంలో మొబైల్‌ వినియోగం అనేది తప్పనిసరి అయ్యింది. అయితే దీని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తాజాగా నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..

Mobile Phone: నేటి కాలంలో మొబైల్‌ వినియోగం అనేది తప్పనిసరి అయ్యింది. అయితే దీని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తాజాగా నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాలు..

ఇప్పుడంత స్మార్ట్‌ ఫోన్‌ యుగం. నేటి కాలంలో చేతిలో మొబైల్‌ లేకుండా ఒక్క రోజు కాదు కదా.. కనీసం గంటలు కూడా ఉండలేం. అంతలా మొబైల్‌ ఫోన్‌ మన జీవితాలను మార్చేసింది. తెల్లవారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్‌ చూస్తేనే గడిపేసేవాళ్లు ఎందరో ఉన్నారు. చాలా మంది ఆఖరికి బాత్రూంలోకి కూడా మొబైల్‌ ఫోన్లు తీసుకెళ్తారు. ఇక చేతిలో సెల్లు లేకపోతే ప్రపంచం ఆగిపోయినట్లు భావించేవారు మనలో ఎందరో. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం వల్ల మన జీవితంలోకి ఎన్ని కొత్త సౌకర్యాలు వచ్చాయో.. అదే స్థాయిలో అనారోగ్య సమస్యలు కూడా వచ్చి చేరాయి. గంటల తరబడి మొబైల్‌ చూడటం వల్ల నిద్రలేమి, మతిమరుపు వంటి సమస్యలు.. వీటి కారణంగా మరి కొన్ని అనారోగ్యాల బారిన పడుతున్నాం. ఈ క్రమంలో తాజాగా ఓ నివేదిక మరికొన్ని షాకింగ్‌ విషయాలు వెల్లడించింది.

మొబైల్‌ ఫోన్‌ వల్ల.. మహిళల్లో సంతాన లేమి సమస్య తలెత్తుతుందని అంటున్నారు నిపుణులు. నేటి కాలంలో మన సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్న సమస్య సంతానలేమి. లేటు వయసులో వివాహాలు, మారిన జీవనశైలి వంటి కారణాల వల్ల సంతానలేమి సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇక తాజాగా మొబైల్‌ వినియోగం వల్ల కూడా సంతానలేమి సమస్య కలుగుతుందంటూ నివేదికలు షాకింగ్‌ విషయాలు వెల్లడిస్తున్నాయి. మధ్యలో ఏమాత్రం విరామం తీసుకోకుండా మొబైల్‌ ఫోన్‌ వినియోగించే అలవాటును మొబైల్‌ అడిక్షన్‌ అంటారు. నేటి కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ మొబైల్‌ అడిక్షన్‌ బారిన పడుతున్నారు.

మహిళలు ఈ మొబైల్‌ అడిక్షన్‌ బారిన పడి సంతానలేమి సమస్యను కొని తెచ్చుకుంటున్నారు అని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చొని.. ఫోన్‌ వినియోగిస్తే.. భవిష్యత్తులో గర్భాశయ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. గర్భాశయ సమస్యలకు అనేక కారణాలు ఉండగా.. వాటిలో మొబైల్‌ అడిక్షన్‌ కూడా ఒకటి అంటున్నారు. ఇక గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చొని మొబైల్‌ వాడటం వల్ల.. భుజాలు, మెడ, తలలో నొప్పితోపాటు దిగువ వీపుకు కూడా ఇది వ్యాపిస్తుంది. ఇది ఇలానే కొనసాగితే.. దీర్ఘకాలంలో సంతానలేమి సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కనుక మొబైల్‌ ఫోన్‌ వాడకంలో పరిమితి విధించుకోవాలని సూచిస్తున్నారు.

గర్భాశయ నొప్పి నివారణ కోసం..

  • రాత్రి పడుకునే ముందే గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కండరాలు రిలీక్స్‌ అవుతాయ.
  • అలానే గంటల తరబడి ఒకే చోట.. ఒకే యాంగిల్‌లో కూర్చొని ఫోన్‌ వాడకూడదు.
  • పడుకుని ఫోన్‌ చూస్తుంటూ.. వెనకభాగంలో నిటారుగా ఉండేలా పడుకోవాలి.
  • అలానే కూర్చున్నప్పుడు కూడా వీపును నిటారుగా ఉంచాలి.
Show comments