iDreamPost
android-app
ios-app

Thyroid: థైరాయిడ్ ఉన్న స్త్రీలు తప్పనిసరిగా చేయాల్సిన ఎక్సైర్ సైజ్ లు ఇవే!

  • Published Nov 16, 2024 | 5:06 PM Updated Updated Nov 16, 2024 | 5:06 PM

Thyroid: ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కూడా థైరాయిడ్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా మహిళల్ని బాగా వేధిస్తుంది.

Thyroid: ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కూడా థైరాయిడ్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. ఈ సమస్య ముఖ్యంగా మహిళల్ని బాగా వేధిస్తుంది.

Thyroid: థైరాయిడ్ ఉన్న స్త్రీలు తప్పనిసరిగా చేయాల్సిన ఎక్సైర్ సైజ్ లు ఇవే!

ఈ రోజుల్లో చాలా మంది కూడా థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నారు. అంచనా ప్రకారం, భారతదేశంలో ప్రతి 100 మందిలో 30 మంది దాకా ఈ సమస్యతో బాధ పడుతున్నారని తేలింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా చాలా మంది ప్రజలు థైరాయిడ్ సమస్యతో ఎంతగానో బాధపడుతున్నారు. ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలలో థైరాయిడ్‌ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి పనితీరు దెబ్బతింటే హార్మోన్లనేవీ దెబ్బతింటాయి. అందువల్ల బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు విపరీతంగా రాలడం, అలసట పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చకపోవడం లాంటి ప్రమాదకర సమస్యలు వస్తాయి. అయితే ఎలాంటి చికిత్సలు, మందులతో కాకుండా చాలా సులభంగా ఎలాంటి ఖర్చు లేకుండా థైరాయిడ్ సమస్యని తగ్గించే మార్గం ఒకటి ఉంది. అదే వ్యాయామం. మనం కొన్ని ఎక్సర్ సైజులు చేస్తే థైరాయిడ్ సమస్యని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో బాధపడే మహిళలు కచ్చితంగా ఈ ఎక్సర్ సైజులు చేయాలి. ఇక ఆ ఎక్సర్సైజులు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

థైరాయిడ్ సమస్యతో బాధ పడే వారు కచ్చితంగా నెక్ ఎక్సర్ సైజులు చేయాలి. అంటే మెడ వ్యాయామాలు. ఎందుకంటే థైరాయిడ్ గ్రంధి మన గొంతు భాగంలో ఉంటుంది. దానికి సరైన పని లేకుంటే కచ్చితంగా థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ముందుగా మీరు ప్రశాంతంగా కింద కూర్చోండి. నడుము వంచకుండా స్ట్రెయిట్ గా కూర్చోండి. మీ తలని మెల్లిగా పైకి కిందకి అంటూ ఉండండి. అంటే మీ గొంతు టైట్ అయ్యేలా పూర్తిగా తలని పైకి ఎత్తి ఆకాశం వైపు చూడండి. అలాగే మీ గడ్డం మీ ఛాతికి టచ్ అయ్యే విధంగా తలను కిందకు దించండి. ఇలా కాసేపు చేయండి. అలాగే మీ తలని మెల్లిగా రైట్ నుంచి లెఫ్ట్ కి లెఫ్ట్ నుంచి రైట్ కి తిప్పుతూ ఉండండి. ఇలా కాసేపు చేయండి. అలాగే మీ తలను మీ భుజాలకు టచ్ అయ్యేలా బెండ్ చేయండి. అంటే మీ చెవులు మీ భుజానికి టచ్ అయ్యేలా మీ తలని సైడ్ కి బెండ్ చేయండి. లెఫ్ట్, రైట్ రెండు సైడ్స్ కూడా బెండ్ చేయండి. ఇలా కాసేపు చేయండి. అలాగే మీ తలని గుండ్రంగా రొటేట్ చేయండి. అంటే మనం పేపర్ పై సున్నా ఎలా చూడతామో అలా మీ తలని కూడా గుండ్రంగా రొటేట్ చేయండి. ఫస్ట్ క్లాక్ వైస్ డైరక్షన్ లో కాసేపు తిప్పి ఆ తరువాత యాంటీ క్లాక్ వైస్ డైరక్షన్ లో కాసేపు రొటేట్ చేయండి. స్పీడ్ గా వద్దు. మెల్లిగానే ఈ మెడ వ్యాయామాలు చేయండి.

ఈ నాలుగు ఎక్సర్సైజులు చేయడం వలన కచ్చితంగా థైరాయిడ్ సమస్య న్యాచురల్ గా తగ్గిపోతుంది. అలాగే ఈ వ్యాయామాలు చేయడం వలన ఫ్యూచర్ లో ఈ సమస్య రానే రాదు. అలాగే మెడ నొప్పితో బాధ పడేవారికి ఇది చాలా బెస్ట్. గంటల కొద్ది ఆఫీసులో సిస్టమ్ ముందు కూర్చొని పని చేసే వారికి మెడ నొప్పులు, తల నొప్పులు సాధారణంగా వస్తాయి. అలాగే చాలా ఒత్తిడికి కూడా గురవుతారు. అయితే ఈ వ్యాయామాలు రోజూ చేయడం వలన మీకు ఈ సమస్యలేవీ రావు. మీ మెడ, గొంతు, గడ్డం దగ్గర కొవ్వు పెరగదు. మీ మొహానికి మంచి షేప్ వస్తుంది. చాలా స్లిమ్ గా అందంగా కనిపిస్తారు. కాబట్టి కచ్చితంగా ఈ మెడ వ్యాయామాలు చేయండి. ఎలాంటి సమస్యలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. ఇదీ సంగతి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.