iDreamPost
android-app
ios-app

షుగర్‌ పేషెంట్లకు కీలక హెచ్చరికలు.. ORSL వినియోగంపై సూచనలు

  • Published Apr 26, 2024 | 9:05 AM Updated Updated Apr 26, 2024 | 9:05 AM

వేసవి కాలంలో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండటం కోసం చాలా మంది ఓఆర్‌ఎస్‌ఎల్‌ డ్రింక్స్‌ తాగుతుంటారు. వీటి వినయోగంపై వైద్యులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ వివరాలు..

వేసవి కాలంలో డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండటం కోసం చాలా మంది ఓఆర్‌ఎస్‌ఎల్‌ డ్రింక్స్‌ తాగుతుంటారు. వీటి వినయోగంపై వైద్యులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆ వివరాలు..

  • Published Apr 26, 2024 | 9:05 AMUpdated Apr 26, 2024 | 9:05 AM
షుగర్‌ పేషెంట్లకు కీలక హెచ్చరికలు.. ORSL వినియోగంపై సూచనలు

వేసవి కాలం వచ్చిందంటే.. తీవ్రమైన దాహం వెంటాడుతుంది. ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరదు. ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, గర్భిణీలకు ఓఆర్‌ఎస్‌ ఇస్తారు. సాధారణంగా అయితే దీనిని ఇంట్లోనే తయారు చేసుకుంటారు కొందరు. డీహైడ్రేషన్‌ వల్ల శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి ఫిల్‌ చేయ్యడానికి గాను నీటిలో ఉప్పు, చక్కెర కలిపి తీసుకుంటారు. అయితే ఇప్పుడు మార్కెట్‌లోకి రకరకాల ఫ్లేవర్లలో ఓఆర్‌ఎస్‌లు వస్తున్నాయి. వీటిని అతిగా వినియోగించకూడదు అంటున్నారు వైద్యులు. ఇక వేసవిలో వీటి వినియోగం బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో డాక్టర్లు ఓఆర్‌ఎస్‌ఎల్‌ వినియోగంపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు..

నీరసం, డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఉండేందుకు చాలా ఓఆర్‌ఎస్‌ఎల్‌ డ్రింక్స్‌ తీసుకుంటున్నారని.. అయితే వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోందించలేదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి కాలంలో చాలా మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిన ఓఆర్‌ఎస్‌కు బదులుగా ఓఆర్‌ఎస్‌ఎల్‌ డ్రింక్స్‌ను తీసుకుంటున్నారని ఇది వారిని మరింత ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాక షుగర్‌ బాధితులు ఇలాంటి ఓఆర్‌ఎస్‌ఎల్‌ డ్రింక్స్‌ తీసుకోకపోవడం మంచిది అంటున్నారు వైద్యులు.

షుగర్‌ బాధితులు ఇలాంటి డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌ బారిన పడడంతో పాటు వారికి ప్రాణాంతకమయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఓఆర్‌ఎస్‌ఎల్‌ డ్రింక్స్‌లో చక్కెర స్థాయి అధికంగా ఉండడంతో కణాల్లో నుంచి నీరు రక్తనాళాల్లోకి చేరి, మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుందని వివరించారు. దీంతో శరీరం మరింత డీహైడ్రేషన్‌కు గురవుతుందని హెచ్చరిస్తున్నారు. ఓఆర్‌ఎస్‌ఎల్‌ డ్రింక్స్‌ షుగర్‌ బాధితులకు ఎంతో ప్రమాదకరమని వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఓఆర్‌ఎస్‌ పౌడర్‌ను మాత్రమే వినియోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. కనుక ఇకపై మీరు ఓఆర్‌ఎస్‌ఎల్‌ డ్రింక్‌ తాగాలని భావిస్తే.. ఈ జాగ్రత్తలు పాటించండి. షుగర్‌ పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు.