Uppula Naresh
మీరు రోజు కోడి గుడ్డు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? ఇలా చేయకూడదని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. అసలు విషయం ఏంటంటే?
మీరు రోజు కోడి గుడ్డు తినేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? ఇలా చేయకూడదని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. అసలు విషయం ఏంటంటే?
Uppula Naresh
కోడి గుడ్డులో ఎన్నో పోషకాలు, పొట్రిన్స్ కలిగి ఉంటాయి. రోజు క్రమం తప్పకుండా గుడ్డును తీసుకోవడం ఆరోగ్యం ఉంటారని వైద్యులతో పాటు పోషకాహార నిపుణులు చెప్పడంతో అందరూ కోడి గుడ్డును ఎంతో ఇష్టంగా తింటుంటారు. చాలా మంది రోజులో కనీసం ఒకసారైన కోడి గుడ్డు తింటుంటారు. ఇటు చిన్న పిల్లల నుంచి అటు వృద్దులు వరకు.. ఇలా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎగ్ ను తినేందుకు ఇష్టపడుతున్నారు అయితే, కోడి గుడ్డు తినే క్రమంలో చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు చేయడం మానేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. గుడ్డు తినడం వల్లే కలిగే లాభాలు ఏంటి? పారం కోడి గుడ్డు మంచిదా లేక నాటుకోడి గుడ్డు మంచిదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
మనం రోజూ తినే గుడ్డులో కూడా రెండు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఫారం కోడి గుడ్డు కాగా, మరొకటి నాటు కోడి గుడ్డు. అయితే ఈ రెండిటిలో ఏ గుడ్డు తింటే మంచిదన్న ప్రశ్న ఇప్పటికీ చాలా మందిని వెంటాడుతూనే ఉంది. కానీ, కొందరు మాత్రం.. ఏది అందుబాటులో ఉంటే ఆ గుడ్డును తింటూ ఉంటారు. పోషకాహార నిపుణులు మాత్రం.. గుడ్డులో సీ విటమిన్ తప్పా.. అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఏ గుడ్డు తిన్న లాభాలే తప్పా నష్టం ఏం లేదని చెబుతున్నారు. ఇకపోతే, ఫారం కోడి గుడ్డుతో పోలిస్తే నాటు కోడి గుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే దాన్నే తినడం ఉత్తమం అని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.
ఎందుకంటే.. ఫారం కోళ్లకు ఇంజక్షన్లు ఇచ్చి పెంచుతారు. కానీ, నాటు కోళ్లు మాత్రం అలా కాదు. అవి బయట గింజలు తింటుంటాయి. ఇక రోజూ గుడ్డు తినడం వల్ల కణాల వృద్ధి చెందించి మెదడు పని తీరును మెరుగు పరుస్తుంది. దీంతో పాటు కండరాలు బలపడడంతో పాటు రోగనిరోదక శక్తిని పెంచేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతే కాకుండా గుడ్డు చెడు కొలస్ట్రాల్ ను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. ఇక గుడ్డును క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందిడమే కాకుండా ఆరోగ్యంగా బలంగా తయారుఅవుతారని నిపుణులు చెబుతున్నారు.