Vinay Kola
Winter: చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మానికి అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
Winter: చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మానికి అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
Vinay Kola
చలి కాలం వచ్చేసింది. ఈ కాలంలో అందరికీ హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వాన లేని కాలం. ఒంటిపై చెమట పట్టని కాలం. పొద్దు పొద్దున్నే చలి మంచులో వేడి వేడి టీ తాగుతుంటే మన మైండ్ కి కలిగే రిలాక్సేషనే వేరు. అయితే చలి కాలం మనకి చక్కని కాలమే కానీ చర్మానికి మాత్రం కలి కాలమే. ఎందుకంటే చలికాలంలో మనకు సహజంగానే ఇమ్యూనిటీ తగ్గుతుంటుంది. దాని ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. చర్మం గ్లో దారుణంగా తగ్గుతుంది. స్కిన్ అంతా కూడా డ్రైగా మారుతుంది. బాడీలో డెడ్ సెల్స్ ఎక్కువ అవుతాయి. అందువల్ల స్కిన్ చాలా నిర్జీవంగా మారుతుంది. అలాగే చర్మం జిడ్డు బారుతూ ఉంటుంది. ఇక యాక్నే ప్రాబ్లెం ఉన్నవారికి అయితే ఈ కాలం నరకమే అని చెప్పవచ్చు. ఎందుకంటే మొటిమలు ఎక్కువ అవుతాయి. అలాగే చలికాలం కావడంతో చాలా మంది కూడా వేడి నీళ్ళతో ఎక్కువగా స్నానం చేస్తారు. అందువల్ల చర్మం చాలా డ్రై గా మారడమే కాకుండా నల్లగా కూడా అవుతుంది. కొంతమందికి అయితే స్నానం చేశాక, చర్మం పై పగుళ్లు వస్తాయి. అక్కడక్కడా తెల్లగా మారుతుంది. పెదాలు పగిపోతూ ఉంటాయి. అందువల్ల చూసే ఎంత శుభ్రంగా స్నానం చేసినా కూడా చూసే వాళ్ళకి చాలా అందవిహీనంగా కనిపిస్తాము. బేసిగ్గా చలికాలం కావడంతో చాలా మంది వాటర్ తక్కువగా తాగుతుంటారు. వేడి వేడి పదార్ధాలు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. అందువల్ల హైడ్రేటెడ్ గా ఉండలేరు. దానివల్ల చర్మంపై దద్దుర్లు కూడా ఏర్పడతాయి. ఎందుకంటే చర్మం చాలా చల్లటి గాలికి గురికావడం వల్ల దద్దుర్లు వస్తాయి. అందువల్ల చర్మం ఎర్రగా మారుతుంది. అందువల్ల మనకు చాలా చికాకు పుడుతుంది. అయితే ఈ సమస్యలన్నీటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి మీ చర్మాన్ని కాపాడి మీ అందాన్ని రెట్టింపు చేసే కొన్ని ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. ఇక ఆ క్రీమ్స్ ఏంటి? వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Dot & Key Ceramides Moisturizer.. ఇది ఒక మాయిశ్చరైజర్ క్రీమ్. ఇది మన చర్మం పొడి బారకుండా కాపాడుతుంది. మన స్కిన్ ని అందంగా మారుస్తుంది. దీన్ని స్కిన్ కి అప్లై చేస్తే చాలా సాఫ్ట్ గా మారుతుంది. రఫ్ స్కిన్ తో బాధ పడుతున్న వారికి ఈ క్రీమ్ చాలా బెస్ట్. దీన్ని మీరు ఆన్లైన్ లో లేదా బయట షాపుల్లో కొనుగోలు చేయవచ్చు. ఆన్లైన్ లో దీని ధర రూ.335/- ఉంటుంది.
Simple Skin Hydrating Light Moisturiser Lotion.. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను చాలా ఈజీగా తగ్గించేస్తుంది. అంతే కాదు.. ఈ క్రీమ్ మిమ్మల్ని రోజంతా కూడా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. అందువల్ల మీకు ఎటువంటి చర్మ సమస్యలు కూడా రావు. దీని ధర రూ.465/- ఉంటుంది.
Parachute Advansed Deep Nourish Body Lotion.. ఇది రకాల చర్మ సమస్యలు ఉన్న వారికి చాల బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇదొక బాడీ లోషన్. దీన్ని ఒక్కసారి మీ బాడీకి అప్లై చేశారంటే .. మూడు రోజుల దాకా మీ బాడీ ఫ్రెష్ గా హైడ్రేటెడ్ గా ఉంటుంది. చర్మం పై ఎలాంటి దద్దుర్లు రావు. దీని ధర కేవలం 127 రూపాయలు మాత్రమే.
NIVEA Soft Light Moisturizer.. దీన్ని కనుక మీ స్కిన్ కి అప్లై చేశారంటే చందమామలా మెరిసిపోవడం ఖాయం. ఎందుకంటే ఇది స్కిన్ ని చాలా త్వరగా ఫ్రెష్ గా మారుస్తుంది. జిడ్డు చర్మంతో బాధపడుతున్న వారికి ఇది నిజంగా ఒక వారం అనే చెప్పాలి. ఈ క్రీమ్ మీకు ఇన్స్టంట్ గా మెరుపుని ఇస్తుంది. దీని ధర 319 రూపాయలు ఉంటుంది.
Lakme Peach Milk Soft Crème Moisturizer.. ఇది మీ చర్మాన్ని 24 గంటల పాటు మిలమిల మెరిసేలా చేస్తుంది. ఇది స్కిన్ లోని ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. చర్మం పొడి బారకుండా చేస్తుంది. దీని ధర కేవలం 174 రూపాయలు మాత్రమే ఉంటుంది.
ఈ క్రీమ్స్ వాడటం వలన చలికాలంలో ఎలాంటి స్కిన్ ప్రాబ్లెమ్స్ మీ దరి చేరవు. ఇదీ సంగతి. మరి వీటి గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.