కౌజు పిట్ట మాంసం తింటున్నారా..? మీకు ఆ ప్రమాదం తప్పదు!

Quail Meat: భారత దేశంలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. పక్షి మాంసం అంటే చాలా మంది ఎంతో ఇష్టపడుతుంటారు. కోడి, కౌజు, బాతు ఇలా ఎన్నో రకాల పక్షి మాసం రక రకాలుగా వండి తింటుంటారు.

Quail Meat: భారత దేశంలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. పక్షి మాంసం అంటే చాలా మంది ఎంతో ఇష్టపడుతుంటారు. కోడి, కౌజు, బాతు ఇలా ఎన్నో రకాల పక్షి మాసం రక రకాలుగా వండి తింటుంటారు.

భారత దేశంలో మాంసాహారం తినేవారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. అందుకే మార్కెట్ లో చికెన్, మటన్, చేపలు, రొయ్యల రేట్లు పెరిగిపోతూ వస్తున్నాయి. చాలా మంది పక్షి మాంసం అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా కోడి, బాతు, టర్కీ కోడి ఇలా ఎన్నో రకాల పక్షి మాసం తింటారు. అయితే వీటిలో దేని టేస్ట్ దానికే ఉంటుంది. వీటిని ఎన్నో రకాలుగా వండి తింటారు. అయితే కౌజు పిట్ట మాంసం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. మార్కెట్ లో వీటి ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. హూటల్స్, రెస్టారెంట్స్ పెద్ద పెద్ద ఫంక్షన్లలో కౌజు పిట్ట మాంసం రక రకాలుగా వండుతుంటారు. తాజాగా కౌజు పిట్ట మాంసం తినేవారికి షాకింగ్ న్యూస్ తెలిపారు వైద్యులు. వివరాల్లోకి వెళితే..

దేశంలో కౌజు పిట్టల కూర అంటే లొట్టలేసుకొని మరీ తింటారు. అడవుల్లో వల వేసి పట్టుకొని మార్కెట్ లో అమ్మితే.. కొంతమంది ఫారాల్లో పెంచి అమ్ముతుంటారు. కౌజు పిట్ట మన దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో పలు ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పక్షుల్లో ఒక జాతి చాలా విషపూరితమైనదని.. ఆ జాతిని కామన్ క్వాయిల్ అంటారు. దీని మాంసం తినడం వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అని వైద్యులు అంటున్నారు. కామన్ క్వాయిల్ జాతి కౌజు పిట్ట.. నేలపై నివసించే ఒక రకమైన జాతికి చెందినది. ఇవి ఎక్కువగా ఎగురలేవు.. గూళ్లలో నివసిస్తుంటాయి. వీటి మాంసం చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే వేటగాళ్లు ఈ పక్షిని ఎక్కువగా వేటాడుతుంటారు. ఇవి యూరప్, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇది చాలా డేంజర్ పక్షి అని విషపూరితమైనదని అంటున్నారు వైద్యులు.

కామన్ క్వాయిల్ పక్షి శీతాకాలపు వలస సమయంలో కొన్ని విషపూరితమైన మొక్కలను తింటాయి. ఈ విషం పక్షుల శరీరం, రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలో వాటి మాంసం తింటే మనుషులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కామన్ క్వాయిల్ కౌజు పిట్టల మాంసంలో ఉండే విషం వల్ల రాబ్డోమియోలిసీన్ అనే మజిల్ కి సంబంధించిన ఇబ్బంది కలుగుతుంది. దీని వల్ల కండరాలు క్షీణించడంతో పాటు కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు వైద్యులు. వీటి లక్షణాలు.. వాంతులు, వికారం, విరోచనాలు. రాబ్డోమియోలిసిస్ వచ్చిన వారికి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. అందుకే ఈ సీజన్ లో కౌజు పిట్టలు అస్సలు తినకూడదు అంటున్నారు. ఆ పిట్టల లివర్, ఇతర అవయవాలు వండకూడదు అని సలహా ఇస్తున్నారు. వాటి కాలేయంలో విషం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఒకవేళ తినాలనుకుంటే బాగా ఉడికించి తినాలని సూచిస్తున్నారు. అసలు శీతాకాలం పూర్తిగా కౌజు పిట్టల మాంసం మానేస్తే ఇంకా మంచిదని అంటున్నారు వైద్యులు.

Show comments