iDreamPost
android-app
ios-app

ప్రియాంక చోప్రా భర్తకు తీవ్ర అనారోగ్యం! ఆ వ్యాధి అంటూ పోస్ట్‌..

  • Published May 06, 2024 | 9:44 AM Updated Updated May 06, 2024 | 9:44 AM

Nick Jonas Health Issue: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తనకన్న వయసులో చిన్నవాడైన ప్రముఖ సింగర్, నటుడు నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Nick Jonas Health Issue: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తనకన్న వయసులో చిన్నవాడైన ప్రముఖ సింగర్, నటుడు నిక్ జోనాస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

  • Published May 06, 2024 | 9:44 AMUpdated May 06, 2024 | 9:44 AM
ప్రియాంక చోప్రా భర్తకు తీవ్ర అనారోగ్యం! ఆ వ్యాధి అంటూ పోస్ట్‌..

బాలీవుడ్ అందాల తార, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రియాంక చోప్రా 2000లో మిస్ వరల్డ్ పోటీలో విజేతగా నిలిచింది. సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణుల్లో ఒకరు. 2016 లో భారత ప్రభుత్వం ఆమెను పద్మక్షతో సత్కరించారు. 2002 లో తమిళ మూవీ ‘తమిజన్’ తో హరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2003లో బాలీవుడ్ లోకి ఫిచర్ ది హీరో : లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై మూవీతో అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ భాషల్లో నటించింది. పలు చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు, స్పెషల్ సాంగ్స్ తో మెరిసింది. తన కన్నా వయసులో చిన్నవాడైన నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా నిక్ జోనాస్ ఆరోగ్యానికి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు హాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తన కన్నా వయసులో చిన్నవాడు.. అమెరికన్ సింగర్, నటుడు అయిన జోనాస్ ని ప్రేమించి 2018 లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు. పెళ్లైన తర్వాత అడపా దడపా సినిమాల్లో నటిస్తుంది. తాజాగా నిక్ జోనాస్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో షేర్ చేసి అభిమానులను క్షమాపణలు కోరాడు. ప్రస్తుతం నిక్ జోనాస్ ఇన్‌ఫ్లుఎంజా-ఎ (ఎపిడెమిక్ వ్యాధి) తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తాను మ్యూజిక్ షో చేయలేకపోతున్నా అంటూ ఆ వీడియోలో తెలిపాడు.

‘హాయ్ గాయ్స్.. రెండు రోజులుగా నేను ఇన్‌ఫ్లుఎంజా-ఎ తో చాలా ఇబ్బంది పడుతున్నాను. నా ఆరోగ్యం బాగా క్షీణించింది.. గొంతు నొప్పితో బాధపడుతున్నాను. అస్సలు మాట్లాడలేకపోతున్నా..  ఒక రోజు మొత్తం తీవ్ర జ్వరంతో బాధపడుతూ మంచానికే పరిమితం అయ్యాను. బాడీ పెయిన్స్, గొంతు నొప్పి, దగ్గుతో ఇబ్బంది పడుతున్నా. మా ఫ్యామిలీ డాక్టర్ చికిత్స చేస్తున్నారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.. అందుకే నా ప్రోగ్రామ్స్ మొత్తం రీ షెడ్యూల్ చేస్తున్నాను. నా అభిమానులు ఈ విషయంలో క్షమించాలి. నా ప్రోగ్రామ్ మళ్లీ ఆగస్టులో నిర్వహిస్తా. అర్ధం చేసుకుంటారని భావిస్తున్నా ధన్యవాదాలు’ అని కోరాడు.  ప్రియాంక చోప్రా సిటాడెల్ సీక్వెల్ తో పాటు ది బ్లఫ్ హాలీవుడ్ పిరియాడిక్ డ్రామాలో హీరోయిన్ గా నటిసుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిక్ జోనాస్ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Jonas Brothers (@jonasbrothers)

Jojobet Girişjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet