iDreamPost
android-app
ios-app

వయాగ్రా ఎక్కువైంది… సర్జరీ తప్పనిసరైంది

వయాగ్రా ఎక్కువైంది… సర్జరీ తప్పనిసరైంది

చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే, వయాగ్రాను ఎంత ఎక్కువ వాడితే శృంగారంలో అంత తృప్తిని పొందుతారని. కానీ అది తప్పని ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటన మరోసారి ఋజువు చేసింది. ప్రయాగ్ రాజ్ లోని ఓ వ్యక్తి వయాగ్రాను మోతాదుకు మించి తీసుకోవడంతో ఆసుపత్రి పాలైన ఘటన వైరల్ అవుతోంది.

వాస్తవానికి వయాగ్రా వంటి డ్రగ్ ను వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. కానీ, కొన్ని నెలల క్రితమే వివాహం చేసుకున్న ఆ వ్యక్తి  తన స్నేహితుల సలహా ప్రకారం వయాగ్రాను సొంతంగా తీసుకోవడం ప్రారంభించాడు. చెప్పిన మోతాదు కంటే 4 రెట్లు ఎక్కువగా.. అంటే రోజుకు 200 మి.గ్రా వయాగ్రాను తీసుకోవడంతో 20 రోజుల పాటు నిరంతర అంగస్తంభనతో ఇబ్బంది పడ్డాడు. చివరకు అతని చర్యలతో విసుగెత్తిన భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది.

సదరు వ్యక్తి కుటుంబం ఆమెను బుజ్జగించి ఇంటికి తీసుకొచ్చినా, భర్తను ఆసుపత్రిలో చేర్చిన వెంటనే ఆమె మరోసారి పుట్టింటికి వెళ్ళిపోవడం కొసమెరుపు. మొత్తంగా వైద్యులు ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడినప్పటికీ, అతను ఆ నిర్దిష్ట సమస్యతో జీవితాంతం పోరాడాల్సి ఉంటుందని తేల్చారు.

ఇలాంటి వ్యక్తులు మన చుట్టుపక్కల కూడా ఉంటారు. వీలైనంత వరకు మీరు కానీ, మీ సన్నిహితులు కానీ వైద్యుల సలహాలు, నూచనలు లేకుండా వయాగ్రాను వాడకండి. వాటిని వాడి ప్రాణాల మీదకు తెచ్చుకొని జీవితాల్ని నాశనం చేసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.