iDreamPost
android-app
ios-app

Samantha: అతడిని జీవితాంతం ప్రేమిస్తా.. సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Published - 04:12 PM, Sat - 24 June 23
  • Author Soma Sekhar Published - 04:12 PM, Sat - 24 June 23
Samantha: అతడిని జీవితాంతం ప్రేమిస్తా.. సమంత ఎమోషనల్ పోస్ట్ వైరల్..

సమంత.. ప్రస్తుతం వరుస సినిమాలతో, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యింది ఈ బ్యూటీ. దాంతో పలు సినిమా షూటింగ్స్ కు బ్రేక్ కూడా ఇచ్చింది. ఇక సమంత ఇలా బ్రేక్ ఇవ్వడంతో ఆమెపై విమర్శలు సైతం వచ్చాయి. ఇక ఇప్పుడిప్పుడే షూటింగ్స్ లో పాల్గొంటోంది సామ్. అయితే ఖాళీ దొరికినప్పుడల్లా అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తుంటుంది. కాగా తాజాగా సమంత చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

హీరోయిన్ సమంతకు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ ఆమె మనసుకు దగ్గరైన ఫ్రెండ్స్ మాత్రం తక్కువ మందే. అందులో ఒకరు నటుడు రాహుల్ రవీంద్రన్. తాజాగా అతడి ఫొటోను షేర్ చేస్తూ..”మీకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్ ను తీసుకుని వంద సార్లు మల్టిప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ అవుతాడు. రాహుల్ నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంటాను” అంటూ సామ్ రాసుకొచ్చింది. ఇక రాహుల్ గురించి సరదా వ్యాఖ్యలు కూడా చేసింది.

అతడు ఫుడ్ తినే పిక్స్ పోస్ట్ చేసి.. అతడు భోజన ప్రియుడు అయినప్పటికీ మీకు కంపెనీ ఇవ్వడానికి దాన్ని వదులుకుంటాడు. కానీ బాధపడతాడు అంటూ పేర్కొంది. అయితే రాహుల్, అతడి భార్య చిన్మయి ఇద్దరూ సామ్ కు క్లోజ్ ఫ్రెండ్స్ అని ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. సమంత, రాహుల్ తో కలిసి ఓ తమిళ చిత్రంలో నటించింది. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం చిగురించింది. ఇక సమంత సినిమాలకు తెలుగు డబ్బింగ్ చిన్మయి చెప్పడంతో వీళ్లిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. అలా వారి స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం సామ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis