iDreamPost
android-app
ios-app

ప్లాస్టిక్ సర్జరీ వికటించి స్టార్ నటి కన్నుమూత!

  • Published Sep 02, 2023 | 6:27 PM Updated Updated Sep 02, 2023 | 6:27 PM
  • Published Sep 02, 2023 | 6:27 PMUpdated Sep 02, 2023 | 6:27 PM
ప్లాస్టిక్ సర్జరీ వికటించి స్టార్ నటి కన్నుమూత!

అందం, గ్లామర్ ఉంటేనే రంగుల ప్రపంచంలో రాణించగలమని నటీమణులు భావిస్తుంటారు. అందుకే మరింత అందంగా కనిపించేందుకు కొన్ని శరీర అవయవాలకు సర్జరీలు చేయించుకుంటారు.  ఇవి కొన్ని సార్లు ఫెయిల్ అయిన దాఖలాలు లేకపోలేదు. ప్రముఖ నటి ఆర్తి అగర్వాల్ బేరియాట్రిక్ సర్జరీ చికిత్స చేయించుకున్న సమయంలో అనారోగ్యం బారిన పడి మృతి చెందిన సంగతి విదితమే. అప్పట్లో ఈ వార్త పెను సంచలనమైంది. ఈ సంవత్సరంలోనే కిమ్ కర్దానియాలా కనిపించేందుకు క్రిస్టినా అష్టేన్ గోర్కాని అనే మోడల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోగా.. గుండెపోటుతో మరణించింది. కన్నడ సీరియల్ నటి చేతన రాజ్ కూడా ఇటువంటి బాధితురాలే. ఫ్యాట్ ప్రీ సర్జరీ చేయించుకోగా.. అది కాస్త వికటించి.. 21 ఏళ్లకే కన్నుమూసిన సంగతి విదితమే. ఇప్పుడు మరో నటి కూడా ప్లాస్టిక్ సర్జరీ వికటించి చనిపోయింది.

అర్జెంటీనా ప్రముఖ నటి , మోడల్, టీవీ ప్రజెంటర్ సిల్వినా లూనా తుది శ్వాస విడిచింది. ప్లాస్టిక్ సర్జరీ వికటించడంతో ఆమె చనిపోయింది. 2011 నుండి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈ నటి..తరచూ డయాలసిస్ చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తుంది. అయితే ఇటీవల ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. అది కాస్తా వికటించడంతో కిడ్నీలపై ప్రభావం చూపి 43 ఏ ళ్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. గత నెల 31న సిల్వినా చనిపోయినట్లు ఆమె తరపు న్యాయవాది ధ్రువీకరించారు. కాస్మోటిక్ సర్జరీ సమయంలో ఆమె శరీరానికి విషపూరితమైన పదార్థాలు వినియోగించడం వల్ల అవి కిడ్నీలపై ప్రభావం చూపి మరిన్ని అనారోగ్య సమస్యలు ఉత్పన్నమై చనిపోయినట్లు తెలిపారు.

 

View this post on Instagram

 

A post shared by SILVINA LUNA (@silvinalunaoficial)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio