Venkateswarlu
Venkateswarlu
ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక రంగంటే ఇష్టం ఉండనే ఉంటుంది. వస్తువుల విషయంలో చాలా మంది తమకిష్టమైన రంగు ఉన్న వాటికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తూ ఉంటారు. ఒకరకంగా దాన్ని ఓ సెంటిమెంట్లా భావిస్తూ ఉంటారు. అయితే, ఓ కలర్‌పై మనకు ఇష్టం కలగటం అన్నది అంత ఈజీగా జరగదు. మన మనస్తత్వాన్ని బట్టి.. మనకు తెలియకుండానే కొన్ని రంగులను మనం ఎంచుకుంటూ ఉంటాము.. ఇష్టపడుతూ ఉంటాము.
రంగులకు.. మనుషుల సైకాలజీకి సంబంధం ఉందని చాలా సర్వేల్లో తేలింది. ఒక్కో రంగును బట్టి వారి సైకాలజీ ఉంటుంది. అంతేకాదు! 2020లో జరిగిన ఓ సర్వేలో రంగులు మన మూడ్‌ను ప్రభావితం చేస్తాయని తేలింది. శాస్త్రవేత్తలు 30 దేశాలకు చెందిన దాదాపు 5 వేల మందిపై పరిశోధనలు చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ఇక, మనం ఇష్టపడే రంగులు మన స్వభావాన్ని కూడా తెలియజేస్తాయి.