iDreamPost
android-app
ios-app

భాగస్వామితో గొడవ పడ్డప్పుడు ఇలా అస్సలు చేయకండి!

భాగస్వామితో గొడవ పడ్డప్పుడు ఇలా అస్సలు చేయకండి!

రిలేషన్ అన్న తర్వాత భాగస్వాముల మధ్య గొడవలు జరగటం సర్వ సాధారణం. ఇద్దరి మధ్యా ఏదోక విషయంలో ఆర్గుమెంట్స్‌ అవుతూనే ఉంటాయి. అయితే, ఈ ఆర్గుమెంట్స్‌ ఇద్దరి మధ్యా బంధాన్ని పెంచేవిలా ఉండాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. కొన్ని సార్లు చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద ఆర్గుమెంట్స్‌ జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఏది పడితే అది చేయటం మంచి పద్దతి కాదు. అలా చేస్తే బంధం బీటలు బారే అవకాశం ఉంది. అందుకే పెద్ద పెద్ద ఆర్గుమెం‍ట్స్‌ జరిగినపుడు ఈ విధంగా చేయండి.

కొంత సమయం ఇవ్వండి!

ఆర్గుమెంట్స్‌ తర్వాత ఇద్దరి మధ్యా కొంత గ్యాప్‌ రావటం సహజం. ఒకరిపై ఒకరికి కొంత కోపం కూడా ఉండటం సహజం. అలాంటప్పుడు ఆ కోపం తగ్గటానికి లేదా.. ఎదుటి వ్యక్తి ఆలోచించుకుని.. మనసును కుదుట పర్చుకోవటానికి కొంత సమయం ఇవ్వాలి. వారి మూడ్‌ను బట్టి ఎంత సమయం అవసరమో గుర్తిస్తే సరిపోతుంది.

గొడవకు మీరెంత కారణం?

గొడవలు ఏ విధమైన కారణాలు లేకుండా మొదలవ్వవు.  ఎవరో ఒకరి తప్పు ఉండనే ఉంటుంది. ఒక వేళ మీ వల్లే ఆ తప్పు జరిగింది అనుకోండి. ముందు మీరే వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈగోలకు పని చెప్పొద్దు. మీరు చేసిన దానికి క్షమాపణ అడిగినంత మాత్రాన మీ కిరీటాలు ఏమీ కిందపడిపోవు.

కమ్యూనికేషన్‌ చాలా అవసరం

చాలా గొడవలు జరగటానికి.. బంధాలు విడిపోవటానికి కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఎక్కువగా కారణం అవుతుంది. ఎదుటి వ్యక్తి చెప్పిన దాన్ని సరిగా వినకపోవటమో లేదా తప్పుగా అర్థం చేసుకుంటేనో గొడవలు జరుగుతాయి. గొడవల తర్వాత కూడా సరిగా కమ్యూనికేట్‌ కాకపోతే ఉన్న బంధం కాస్తా దెబ్బతింటుంది.

సహానుభూతితో ఉండండి!

గొడవలు ఎక్కువగా మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోలేకపోయినపుడే వస్తాయి. గొడవ కారణంగా వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో.. వారి స్థానంలో ఉంటే మన పరిస్థితి ఏంటో ఓ సారి ఆలోచించాలి. ఎదుటి వ్యక్తి పరిస్థితిని సహానుభూతి చెందాలి. అప్పుడే అసలు విషయం అర్థం అవుతుంది. తత్వం బోధ పడుతుంది.

క్షమాపణ చెప్పటానికి.. క్షమించటానికి సిద్దంగా ఉండండి!

బంధం నిలబడాలంటే.. తప్పు మనదైనపుడు క్షమాపణ చెప్పటానికి సిద్దంగా ఉండాలి. అలాగే ఎదుటి వ్యక్తి తప్పు చేసి.. క్షమాపణ చెప్పినపుడు క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ కూడా ఈగోలకు పని చెబితే రిలేషన్‌ దెబ్బతింటుంది.