iDreamPost
android-app
ios-app

మీకిష్టమైన కలర్‌ మీ సైకాలజీ గురించి ఏం చెబుతుంది?

మీకిష్టమైన కలర్‌ మీ సైకాలజీ గురించి ఏం చెబుతుంది?

ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక రంగంటే ఇష్టం ఉండనే ఉంటుంది. వస్తువుల విషయంలో చాలా మంది తమకిష్టమైన రంగు ఉన్న వాటికే ఎక్కువ ప్రధాన్యత ఇస్తూ ఉంటారు. ఒకరకంగా దాన్ని ఓ సెంటిమెంట్‌లా భావిస్తూ ఉంటారు. అయితే, ఓ కలర్‌పై మనకు ఇష్టం కలగటం అన్నది అంత ఈజీగా జరగదు. మన మనస్తత్వాన్ని బట్టి.. మనకు తెలియకుండానే కొన్ని రంగులను మనం ఎంచుకుంటూ ఉంటాము.. ఇష్టపడుతూ ఉంటాము.

రంగులకు.. మనుషుల సైకాలజీకి సంబంధం ఉందని చాలా సర్వేల్లో తేలింది. ఒక్కో రంగును బట్టి వారి సైకాలజీ ఉంటుంది.  అంతేకాదు! 2020లో జరిగిన ఓ సర్వేలో రంగులు మన మూడ్‌ను ప్రభావితం చేస్తాయని తేలింది. శాస్త్రవేత్తలు 30 దేశాలకు చెందిన దాదాపు 5 వేల మందిపై పరిశోధనలు చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

  • నలుపు : ఈ రంగు బాధకు చిహ్నమని 51 శాతం మంది తెలిపారు.
  • తెలుపు : ఈ రంగు ప్రశాంతతకు చిహ్నంగా 43 శాతం మంది తెలిపారు.
  • ఎరుపు : ఈ రంగు ప్రేమకు చిహ్నంగా 68 శాతం మంది తెలిపారు.
  • నీలం : ఈ రంగు ప్రశాంతతకు చిహ్నంగా 35 శాతం మంది తెలిపారు.
  • ఆకుపచ్చ : ఈ రంగు సంతృప్తికి చిహ్నంగా 39 శాతం మంది తెలిపారు.
  • పసుపు పచ్చ : ఈ రంగు సంతోషానికి చిహ్నంగా 52 శాతం మంది తెలిపారు.
  • పింక్‌ : ఈ రంగు ప్రేమకు చిహ్నంగా 50 శాతం మంది తెలిపారు.
  • బ్రౌన్‌ : ఈ రంగు దరిద్రమైనదని 36 శాతం మంది తెలిపారు.

ఇక, మనం ఇష్టపడే రంగులు మన స్వభావాన్ని కూడా తెలియజేస్తాయి. 

  • నీలం : శాంత స్వభావులు, జీవితంపై నమ్మకం కలవారు, ఎంతో తెలివైన వారు, వీరు చేసే ప్రతీపనికి ఓ కారణం ఉంటుంది.
  • పింక్‌ : శాంత స్వభావులు, చాలా రిజర్వ్‌గా ఉంటారు, మంచివారు.
  • ఎరుపు : ప్రేమ కలిగిన వారు, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు.
  • ఆకుపచ్చ : సహజత్వాన్ని ఇష్టపడతారు, ఎదుగుదలకు ప్రాధాన్యత ఇస్తారు, ఎప్పుడూ హుషారుగా ఉంటారు.
  • పసుపు పచ్చ : నమ్మకంతో ఉంటారు, సంతోషంగా ఉంటారు, చాలా ప్రమాదకరమైన వారు.
  • తెలుపు : నమ్మ దగిన వారు, అందరికంటే భిన్నంగా ఉంటారు.
  • నలుపు : ఉన్నతమైన వారు, చాలా రహస్యజీవితాన్ని గడుపుతూ ఉంటారు, శాంత స్వభావులు.
  • ఆరెంజ్‌ : దయకలవారు, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.