iDreamPost
android-app
ios-app

రూ.2000 నోట్లు ఏమైపోయాయ్..

రూ.2000 నోట్లు ఏమైపోయాయ్..

ఇటీవలి కాలంలో రూ.2000 నోటు చలామణి తగ్గింది. ఏటీఎమ్‌ నుంచి ఎంత పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసినా వాటిల్లో రూ.2000 నోట్లు ఉండడం లేదు. దీంతో ప్రజల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.
016లో నోట్ల రద్దు ప్రకటన వెలువడినప్పటి నుంచి కరెన్సీపై ప్రభుత్వం, లేదా ఆర్‌బీఐ నుంచి ఏ చిన్న వార్త వచ్చినా, మళ్లీ నోట్ల రద్దు అంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. రూ. 2,000 నోటు రద్దుపై గత మూడేళ్లుగా ఇలాంటి ఊహగానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టే రూ.2000 నోటు చలామణి కూడా తగ్గింది. ఏటీఎమ్‌ నుంచి ఎంత పెద్ద మొత్తంలో డబ్బు డ్రా చేసినా వాటిల్లో రూ.2000 నోట్లు ఉండడం లేదు. దీంతో ప్రజల్లో మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఏడాది మార్చి చివరి నాటికి దేశంలో చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2000 నోట్లు 1.6 శాతం మాత్రమే.

There is something foreign about the Rs 2000 & Rs 500 notes - Rediff.com  Business

2016-17 సంవత్సరంలో రూ. 354.29 కోట్లు, 2017-18లో రూ. 11.15 కోట్లు, 2018-19 లో రూ. 4.66 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లను ముద్రించిన ఆర్‌బీఐ.. 2019-20 సంవత్సరంలో మాత్రం ఒక్క కొత్త నోటును కూడా ముద్రించలేదని ఏడాది క్రితమే గణాంకాలు బయటకు వచ్చాయి. దేశంలో రూ. 2 వేల నోట్లు సర్క్యులేషన్‌కు సరిపడా ఉన్నాయని, అందుకే ఆ నోటు ముద్రణను ఆపేశామని అప్పటి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ గతేడాది జనవరి 4న ప్రకటించారు. ఇక, రూ. 2,000 నోటు ఉంచడానికి ఉపయోగించే స్లాట్‌ (క్యాసెట్‌ అంటారు)లు ప్రస్తుతం చాలా ఏటీఎమ్‌లలో లేవని, వాటి స్థానంలో కొత్త రూ. 100 నోటు, రూ. 500 నోట్ల క్యాసెట్‌లు అమర్చారని సమాచారం.

Fake Rs 2,000 notes seized: Here's how similar they are to real currency |  Latest News Delhi - Hindustan Times

రెండు వేల నోట్లను ఇకపై ఏటీఎంలలో లోడ్‌ చేయవద్దని బ్యాంకు అధికారులకు ఆర్బీఐ నుంచి ఆదేశాలు కూడా అందినట్టు వార్తలు వస్తున్నాయి. రూ. 2000 నోట్ల స్థానంలో కొత్తగా రూ.500, రూ. 50, రూ. 200 నోట్ల ముద్రణను క్రమంగా పెంచినట్టు ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. 2016-17తో పోల్చుకుంటే వీటి ముద్రణ 2019-20 నాటికి దాదాపు రెట్టింపు అయింది. బ్లాక్‌మనీని అరికట్టాలనే లక్ష్యంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ రూ.2000 నోట్ల ముద్రణను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి ప్రస్తుతం పూర్తిగా ఆపేసినట్టు తెలుస్తోంది. క్రమంగా మార్కెట్ నుంచి రూ.2000 నోటును వెనక్కి తీసుకోవాలని కూడా ఆర్బీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తగ్గుతున్న రూ.2000 నోట్లు..

★ ఆర్టీఐకి అందిన సమాచారం ప్రకారం.. 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో 2000 రూపాయల కొత్త నోట్లను ముద్రించలేదు.

★ 2016-17 నుంచి 2000 నోట్ల ముద్రణలో భారీ తగ్గిపోయింది.

★ ఆర్టీఐ కింద దాఖలైన అభ్యర్థనకు వచ్చిన సమాధానం ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

★ 2016లో రూ. 500, రూ. 1,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత. ఈ రూ. 2,000 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‍బీఐ) తీసుకొచ్చింది.

★ అసలు, నకిలీ నోట్ల మధ్య తేడాను ప్రజలు సులువుగా గుర్తించేలా సెక్యూరిటీ ఫీచర్లతో రూ. 2,000 నోటును రూపొందించింది.

★ 2019-20 నుండి ఈ సంఖ్య భారీగా తగ్గిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.

★ 2016-17, 2018-19 మధ్య ముద్రించిన అవే నోట్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్నాయి.

Rs 2,000 Currency Notes Continue To Fall In Circulation: RBI

★ ఇందులో ప్రజల చేతిలో 2000 నోట్లు చలామణి కావడం చాలా తక్కువ అయిపోయింది.

★ ఎందుకంటే 2000 నోట్లు చాలా వరకు బ్యాంకుల వద్ద ఉన్నాయి.

★ మే నెలలో రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం సిస్టమ్‌లోని మొత్తం 2000 నోట్ల విలువ మార్చి 2021 నాటికి 22.6 శాతానికి, మార్చి 2022 నాటికి 13.8 శాతానికి తగ్గింది.

★ రిజర్వ్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 2022 నాటికి వ్యవస్థలోని మొత్తం నోట్లలో 2000 నోట్ల వాటా 1.6 శాతం మాత్రమే.

★ నోట్ల ముద్రణ మూసివేయడం వల్ల ఈ షేర్ మరింత తగ్గుతుందని అంచనా.

2000 నోట్ల ముద్రణ ఎందుకు జరగడం లేదు?

★ నిజానికి పెద్ద నోట్ల ముద్రణకు ద్రవ్యోల్బణం అతి ముఖ్యమైన కారణం. అదే సమయంలో డీమోనిటైజేషన్ వంటి ఊహించని సందర్భాల్లో కూడా పెద్ద నోట్లు సహాయపడతాయి.

★ ఎందుకంటే అదే విలువ కలిగిన నగదును వేగంగా విత్‌డ్రా చేయడానికి సిస్టమ్ నుండి ఉపసంహరించబడిన నగదు మొత్తాన్ని ముద్రించవలసి ఉంటుంది.

RBI said to scale down printing of ₹2000 note to minimum | Mint

★ స్మాల్ ప్యాక్ ఎకానమీని పరిశీలిస్తే.. ప్రస్తుతం సామాన్యుల షాపింగ్ లో పది, ఇరవై, యాభై రూపాయల లోపు సరుకుల ప్యాకెట్లే ప్రధానం కాబట్టి సరిపడా 100, 500 నోట్లను చలామణిలో ఉంచడం వల్ల పనులు సాగుతున్నాయి. అదే సమయంలో సిస్టమ్‌లోని నోట్లు సరిపోతాయి.

★ అందుకే నగదు కొరత ప్రశ్న లేదు. దీనికి తోడు డిజిటల్ లావాదేవీల ట్రెండ్ పెరిగిపోవడంతో పెద్ద నోట్ల అవసరం కూడా తీరిపోతోంది.

★ ద్రవ్యోల్బణం, వ్యవస్థలో తగినంత నగదు ఉన్నందున, ప్రభుత్వం ఇప్పుడు కొంత కాలంగా పెద్ద నోట్ల నష్టంపై దృష్టి సారించింది.

★ గతేడాది లోక్‌సభలో నోట్లను ముద్రించకపోవడంపై ప్రభుత్వం సమాచారం ఇస్తూ.. ప్రభుత్వం పెద్ద నోట్ల ముద్రణను నిలిపివేస్తోందని, తద్వారా తమ నిల్వలను, నల్లధనాన్ని అరికట్టవచ్చని బదులిచ్చారు.

★ దీంతో పాటు 2000 నకిలీ నోటుపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

★ పెద్ద నోట్ల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అనే భయంతో ప్రభుత్వం వాటి ముద్రణను నిలిపివేసింది.

Is the RBI going to recall Rs 2,000 notes and roll out Rs 1,000 notes?  Here's the truth!- The New Indian Express

★ ప్రస్తుతానికి, 2000 నోటుకు సంబంధించి తదుపరి వ్యూహాన్ని రిజర్వ్ బ్యాంక్ లేదా ప్రభుత్వం వెల్లడించలేదు.

★ ముందుగా ముద్రించిన 2000 నోట్లు చలామణిలో ఉండొచ్చుగానీ, డేటా ఆధారంగా అయితే రానున్న కాలంలో 2000 నోట్లను జేబులో పెట్టుకునే అవకాశాలు గతంలో కంటే తక్కువగా ఉండటం ఖాయ మని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.