iDreamPost
android-app
ios-app

అందరి చూపు యశోద వైపు..

అందరి చూపు యశోద వైపు..

రేపు అయిదారు సినిమాలు రిలీజవుతున్నప్పటికీ ఒక్క యశోద మీద మాత్రమే చెప్పుకోదగ్గ బజ్ నెలకొంది. సరోగసి పేరుతో కార్పొరేట్ మెడికల్ మాఫియా చేసే ఆగడాల బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని రూపొందించారు. జబ్బుతో బాధ పడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమంతా ప్రమోషన్ల పాల్గొనలేని కారణంగానే యాంకర్ సుమకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో తన ఆవేదను వెలిబుచ్చిన తీరు అభిమానులను కదిలించింది. బిజినెస్ ఎంతనే విషయంలో ఏవేవో ఫిగర్లు బయటికి వస్తున్నాయి కానీ ప్రీ రిలీజ్ పరంగా హైప్ బాగానే ఉన్న మాట వాస్తవం. ఏ సెంటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా పెరుగుతున్నాయి.

Samantha's Yashoda Movie Is Being Made Basing A True Incident

నెలకు పైగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏమంత జోష్ లేదు. కన్నడ డబ్బింగ్ కాంతారకు మాత్రమే బ్లాక్ బస్టర్ వసూళ్లు దక్కాయి. ఎంత పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో దాన్ని కలెక్షన్లుగా మార్చుకోవడంలో ఫెయిలయ్యింది. మిగిలిన వాటికి అంతంత మాత్రంగానే రెస్పాన్స్ కనిపిస్తోంది. ఏఎన్ఆర్ చివరి చిత్రం 1982 నాటి ప్రతిబింబాలుని ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరికి అక్కినేని ఫ్యామిలీ సైతం దీన్ని లైట్ తీసుకోవడంతో అభిమానులు థియేటర్లకు వెళ్లలేదని క్యాన్సిలైన షోలని చూసి చెప్పొచ్చు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, బొమ్మ బ్లాక్ బస్టర్,  జెట్టి, బనారస్ లాంటి చిన్న సినిమాలన్నీ వారానికే సర్దుకోక తప్పని పరిస్థితి నెలకొంది.
Samantha's Yashoda to release in theatres on November 11 - India Today
ఈ నేపథ్యంలో యశోద మీద ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఇది మినహాయిస్తే ఈ నవంబర్ చాలా డల్ గా సాగనుంది. 25న అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లాంటివి ఉన్నాయి కానీ అవేవో అద్భుతాలు చేసే ఛాన్స్ లేదు ఎక్స్ ట్రాడినరీ టాక్ వస్తే తప్ప. అందుకే సామ్ మూవీ కనక బాగుందనే మాట తెచ్చుకుంటే ఓ పది రోజుల పాటు రన్ స్టడీగా ఉంటుంది. ఓటిటిల ట్రెండ్ లో ఇలాంటి కంటెంట్ తో ఆడియన్స్ ని మెప్పించడం అంత సులభం కాదు. దర్శకుడు హరి హరీష్ లు తమ అవుట్ ఫుట్ మీద చాలా నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం క్లైమాక్స్ అంత థ్రిల్ ఉంటుందని ఊరిస్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో..