iDreamPost
android-app
ios-app

తిరుమల శ్రీవారి లడ్డూ బరువుపై అపోహలు వద్దు..: టీటీడీ

తిరుమల శ్రీవారి లడ్డూ బరువుపై అపోహలు వద్దు..: టీటీడీ

భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సోషల్‌ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మవద్దని తితిదే ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

Tirumala Laddu: తిరుమల లడ్డూ పుట్టిన రోజు.. సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు.. ఇంతకు ఎన్నేళ్లు..! - Telugu Oneindia

ఆలయ నిబంధనల ప్రకారం శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుంచి 180 గ్రాములు బరువు ఉంటుంది. కానీ, ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలు తూకం వేయగా.. 90 నుంచి 110 గ్రాముల బరువు మాత్రమే ఉన్నాయి. దీంతో భక్తుడు లడ్డూ కౌంటర్‌లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.

తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా.. ఏ ఏ రోజు ఏ ప్రసాదాలను సమర్పిస్తారంటే.. | TV9 Telugu

ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తితిదే అధికారులు దీనిపై స్పందించి వివరణ ఇచ్చారు. వేయింగ్‌ మిషన్‌లో సాంకేతిక సమస్య కారణంగా, కాంట్రాక్టు సిబ్బంది అవగాహన లోపం వల్లే అలా జరిగిందని తెలిపారు. తితిదే లడ్డూ బరువు కచ్చితంగా 160గ్రాములు ఉంటుందని స్పష్టం చేశారు.

Tirumala Laddu: తిరుమల లడ్డూ పుట్టిన రోజు.. సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు.. ఇంతకు ఎన్నేళ్లు..! - Telugu Oneindia

కొన్ని వందల సంవత్సరాల నుంచి రాజీ లేకుండా లడ్డూ ప్రసాదాన్ని పోటు కార్మికులు తయారు చేస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను భక్తులు నమ్మవద్దని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి