* మునుగోడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో 2 ప్రధాన పార్టీలకు షాక్
ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. అటు కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరుమాత్రమే ఉందని తేలుతోంది. కాంగ్రెస్ మూడో స్థానంలోకి పడిపోయిందని సమాచారం. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్కు అనుకూలంగానే ఉండనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
థర్డ్ విజన్ రీసెర్చ్- నాగన్న ఎగ్జిట్‌పోల్స్ సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్- 48-51 శాతం బీజేపీ- 31-35 శాతం కాంగ్రెస్- 13-15 శాతం బీఎస్పీ- 5-7 శాతం ఇతరులు- 2-5 శాతం. ఎస్‌ఏఎస్ గ్రూప్ ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్- 41-42 శాతం బీజేపీ- 35-36 శాతం కాంగ్రెస్- 16.5-17.5 శాతం బీఎస్పీ- 4-5 శాతం ఇతరులు- 1.5-2 శాతం. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్‌పోల్ సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్- 42.11 శాతం బీజేపీ- 35.17 శాతం కాంగ్రెస్- 14.07 శాతం బీఎస్పీ- 2.95 శాతం ఇతరులు- 5.70 శాతం.
తెలంగాణలో రాజకీయ పార్టీలను ఉరుకులు పరుగులు పెట్టించి, రాజకీయాలను వేడెక్కించిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎవరి వైపు ఉండనున్నాయనే ఉత్కంఠ అన్ని రాజకీయ పార్టీల్లోనే కాదు.. ఓటర్లలోనూ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికల సరళిపై విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఒక్క పొలిటికల్ లేబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మినహా మిగతా అన్ని ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. అత్యధిక శాతం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపి రెండో స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వివరాలు..
తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
టీఆర్ఎస్ పార్టీకి – 40.9 శాతం ఓట్లు
బీజేపికి – 31 శాతం ఓట్లు
కాంగ్రెస్ పార్టీ 23 శాతం ఓట్లు కైవసం చేసుకోనున్నట్టు తెలంగాణ జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది.
పొలిటికల్ లేబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
టీఆర్ఎస్ పార్టీకి – 37 శాతం ఓట్లు
బీజేపికి – 42 శాతం ఓట్లు
ఇతరులకు 21 శాతం ఓట్లు లభించనున్నట్టు పొలిటికల్ లేబొరేటరీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి.
త్రిషూల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
టీఆర్ఎస్ పార్టీకి – 47 శాతం ఓట్లు
బీజేపికి – 31 శాతం ఓట్లు
కాంగ్రెస్ పార్టీకి 18 శాతం ఓట్లు రానున్నట్టు త్రిషూల్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
థర్డ్ విజన్ రీసెర్చ్- నాగన్న ఎగ్జిట్‌పోల్స్ సర్వే
టీఆర్‌ఎస్ పార్టీ – 48-51 శాతం ఓట్లు
బీజేపీ – 31-35 శాతం ఓట్లు
కాంగ్రెస్ పార్టీ – 13-15 శాతం ఓట్లు
బీఎస్పీ- 5-7 శాతం ఓట్లు
ఇతరులకు 2-5 శాతం ఓట్లు పోల్ అవుతాయని థర్డ్ విజన్ రీసెర్చ్- నాగన్న ఎగ్జిట్‌పోల్స్ సర్వే అభిప్రాయపడింది.
ఎస్‌ఏఎస్ గ్రూప్ ఎగ్జిట్‌పోల్ సర్వే
టీఆర్‌ఎస్ పార్టీ – 41-42 శాతం ఓట్లు
బీజేపీ- 35-36 శాతం ఓట్లు
కాంగ్రెస్ పార్టీ- 16.5-17.5 శాతం ఓట్లు
బీఎస్పీ- 4-5 శాతం ఓట్లు
ఇతరులు- 1.5-2 శాతం ఓట్లు నమోదు కానున్నట్టు ఎస్‌ఏఎస్ గ్రూప్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది.
నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్
టీఆర్‌ఎస్ పార్టీ- 42.11 శాతం ఓట్లు
బీజేపీ – 35.17 శాతం ఓట్లు
కాంగ్రెస్ పార్టీ- 14.07 శాతం ఓట్లు
బీఎస్పీ- 2.95 శాతం ఓట్లు
ఇతరులు 5.70 శాతం ఓట్లు సొంతం చేసుకోనున్నట్టు నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్ సర్వే పేర్కొంది.