iDreamPost
android-app
ios-app

ఆస్ట్రేలియాలో నెల్లూరు ‘చాయ్‌వాలా’.. ఏడాదికి రూ.5.2కోట్ల ఆదాయం..

ఆస్ట్రేలియాలో నెల్లూరు ‘చాయ్‌వాలా’.. ఏడాదికి రూ.5.2కోట్ల ఆదాయం..

ప్రపంచకప్ ఫైనల్‌కి ఆతిథ్యమిచ్చే మెల్‌బోర్న్ నగరంలో మన తెలుగు కుర్రాడు సత్తా చాటుతున్నాడు. కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో చాయ్ దుకాణాన్ని పెట్టి రాణిస్తున్నాడు. బీబీఏ చేద్దామని నెల్లూరు నుంచి వెళ్లిన సంజిత్ మధ్యలోనే చదువు మానేశాడు.

This 22-year-old dropped out of college to become a million-dollar  'chaiwala' in Australia

చదువుకుంటే జీవితంలో గొప్ప స్థానానికి వెళ్తాం అనేకుంటే తప్పే. చదువు మనకు మంచి చెడు విచక్షణ తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. కానీ కష్టపడే తత్వం, పట్టుదల, కృషి ఉంటే.. జీవితంలో చదువు లేకపోయినా సరే.. ముందుకు వెళ్లవచ్చు. మనసుకు నచ్చిన రంగంలో రాణిస్తే.. అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. తాజాగా ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్‌ చేశాడు ఓ యువకుడు. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు ఓ యువకుడు. కానీ చదువు మీద ఆసక్తి లేకపోవడంతో.. వ్యాపారం చేద్దామనుకున్నాడు. ఈ క్రమంలో అతడికి వచ్చిన ఆలోచన ఆ యువకుడి జీవితాన్ని పూర్తి మార్చేసింది.

ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరుకు చెందిన కొండా సంజిత్‌ అనే యువకుడికి ఆస్ట్రేలియాలోని ఓ ప్రముఖ యూనివర్శిటీలో బ్యాచిలర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదివేందుకు అవకాశం లభించింది. ఎన్నో ఆశలతో విమానం ఎక్కి.. ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అయితే సరిగా చదవకపోవడంతో.. కాలేజీ డ్రాప్‌ అవుట్‌గా మారాడు. ఇంత దూరం వచ్చి.. ఇలా ఓడిపోవడం సంజయ్‌ని కుంగ దీసింది. అయితే ఓడిన చోట తనను తాను నిరూపించుకోవాలని భావించాడు. దానిలో భాగంగా.. తన అపజయాన్ని సూచించేలా డ్రాప్‌అవుట్‌ చాయ్‌వాలా అనే టీ కొట్టు స్టార్ట్‌ చేశాడు. ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పిన వెంటనే.. వారు భయపడ్డారు. ఇంత ఖర్చు చేసి.. ఆస్ట్రేలియా పంపిస్తే.. చదువుకోకుండా.. ఇలా టీ కొట్టు పెట్టుకోవడం ఏంటని బాధపడ్డారు. కానీ సంజిత్‌ వారిని ఒప్పించి.. చాయ్‌ కొట్టు ప్రారంభించాడు.

Dropout Chaiwala: An Indian's start-up tea revolution in Melbourne

సంజిత్‌కు చిన్నతనం నుంచే చాయ్ అంటే చాలా ఇష్టం. టీ మీద మక్కువతోనే.. ఆస్ట్రేలియాలో టీ షాప్‌ స్టార్ట్‌ చేయాలని భావించాడు. ఈ క్రమంలో అస్రార్‌ అనే ఒక ఎన్‌ఆర్‌ఐ సంజిత్‌ ఆలోచనను నమ్మి.. ఇన్వెస్ట్‌ చేయడానికి అంగీకరించాడు. వచ్చే నెలతో ఈ చాయ్‌ దుకాణం ప్రాంరభించి ఏడాది పూర్తి అవుతుంది. ఇక పన్నులు పోగా.. సంజిత్‌కు 5.2 కోట్ల లాభం మిగిలింది. మెల్‌బోర్న్‌ వాసులు ఎక్కువగా కాఫీ అంటే ఇష్టపడతారు. కానీ ప్రస్తుతం డ్రాప్‌అవుట్‌ చాయ్‌వాలా తయారు చేసే టీ అంటే మక్కువ కనబరుస్తున్నారు.

Chai Business : దేశంకాని దేశంలో చదువు పక్కనబెట్టి టీ వ్యాపారంతో రూ.5  కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు - He is earning more than Rs. 5 crores with  \#39;tea\#39; business aside from ...

ఈ సందర్భంగా సంజిత్‌ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడికొచ్చే వారిలో భారతీయులు, ఆస్ట్రేలియా వాసులు కూడా ఉన్నారు. చాయ్‌ విత్‌ సమోసా అంటే తెగ ఇష్టపడుతున్నారు. మన భారతీయులైతే.. బాంబే కటింగ్‌ టీ అంటే చాలా ఇష్టపడుతున్నారు. ఆస్ట్రేలియన్లు అయితే మసాలా చాయ్‌, దాంతో పాటు పకోడాలు తింటూ.. సరదాగా గడుపుతారు. త్వరలోనే మరో ఔట్‌లెట్‌ తెరిచే ఆలోచనలో ఉన్నాను. టీ షాప్‌ తెరుస్తాను అన్నప్పుడు వద్దన్న నా తల్లిదండ్రులు.. ఇప్పుడు నా విజయం చూసి గర్వ పడుతున్నారు. ఇక సోషల్‌ వర్క్‌లో నా డిగ్రీని పూర్తి చేస్తాను’’ అని తెలిపాడు. సంజిత్‌ మాటలు విన్న వారు.. మనసుకు నచ్చిన రంగంలో కృషి చేస్తే.. తప్పకుండా విజయం సాధిస్తారని మరో సారి నిరూపించారు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.