iDreamPost
android-app
ios-app

కేవలం 80 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లు..

కేవలం 80 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లు..

* టీటీడీ శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల.
* డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు సంబంధించిన‌ రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల.
* కేవలం 60 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లు బుక్ చేసేసుకున్న భక్తులు.
* రూ.300 దర్శన టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి రూ.15.20 కోట్ల ఆదాయం.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలుగు ప్రజలు మాత్రమే కాదు.. దేశ విదేశాల భక్తులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచడంతో స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు హాటు కేకుల్లా అమ్ముడయ్యాయి.

Tirumala Tirupati Temple | శ్రీవారి చెంత సముద్ర హోరు.. ఆ రహస్య గ్రామంలో ఏం జరుగుతోంది

డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు సంబంధించిన‌ రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేసిన వెంటనే బుకింగ్ చేసుకున్నారు భక్తులు. కేవలం 60 నిమిషాల్లోనే 5,06,600 టికెట్లు బుక్ చేసేసుకున్నారు భక్తులు. టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి అంతరాయం ఏర్పడకపోవడంతో కేవలం విడుదల చేసిన గంటలోనే బుక్ చేసుకున్నారు. ముఖ్యంగా బుకింగ్ సమయంలో జియో మార్ట్ క్లౌడ్ టెక్నాలజీ సహకారం అందించడంతో.. భక్తులకు బుకింగ్ అవస్థలు తప్పినట్లు తెలుస్తోంది.

Ancient jewels in Tirupati goes missing, massive corruption, loot, rituals buried, temple head priest makes startling allegations!

డిసెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ రూ.300 దర్శన టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి రూ.15.20 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. డిసెంబర్ కు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఇవాళ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి..ఈ దర్శన టికెట్ల‌ను బుక్ చేసుకోవాలని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. మరోవైపు తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం - Tirumala Tirupati Devasthanam - Hindu Temples

గురువారం శ్రీవారిని 61,304 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు లభించింది. మరోవైపు 31 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం చేసుకునే భక్తులకు శ్రీవారి దర్శనం కోసం సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.