iDreamPost
android-app
ios-app

వీరయ్య ఊర మాస్ – అభిమానులకు పటాస్

వీరయ్య ఊర మాస్ – అభిమానులకు పటాస్

ఖైదీ నెంబర్ 150తో పవర్ ఫుల్ కంబ్యాక్ ఇచ్చాక తర్వాత వచ్చిన సినిమాలతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన చిరంజీవి ఫైనల్ గా ఫ్యాన్స్ కోరుకున్న ఊర మాస్ అవతారంలో వచ్చేశారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు అందరూ ఆల్రెడీ లీకైన
వాల్తేరు వీరయ్య టైటిల్ నే అఫీషియల్ చేశారు. ఈ మేరకు ట్రైలర్ లెన్త్ ఉన్న టీజర్ ని దీపావళి కానుకగా విడుదల చేశారు. పోర్టులో రౌడీ గ్యాంగ్ కూర్చుని ఉండటం, ఎవడ్రా అన్నయ్య అంత బిల్డప్ ఇచ్చారని వెటకారంగా మాట్లాడ్డం, పెద్ద బ్లాస్ట్ తో మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వడం అన్నీ పూనకాలు తెప్పించే స్థాయిలోనే సాగాయి. చివరిలో మాస్ రాజా రవితేజ కనిపించలేదు కానీ వాయిస్ తో సరిపెట్టారు.

మొత్తానికి అంచనాలకు తగ్గట్టే టీజర్ సాగడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. సోషల్ మీడియాలో అది స్పష్టంగా కనిపిస్తోంది. ఘరానా మొగుడు, ముఠామేస్త్రి నాటి బాసు మాసుని మరోసారి చూశామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగానే సింక్ అయ్యింది. గళ్ళ లుంగీ, బ్లాక్ గాగుల్స్, నోట్లో బీడీ ముక్క, ఇలాంటి ఎంటర్ టైన్మెంట్ కావాలంటే లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అంటూ మెగా స్టైల్ లో డైలాగ్ చెప్పడం ఓ రేంజ్ లో పేలింది. నిమిషం దాకా కేవలం హడావిడి ఉన్నప్పటికీ వీరయ్యని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో సెట్ చేసిన ఎలివేషన్ కాబట్టి కరెక్ట్ గా కుదిరింది. మొత్తానికి అంచనాలు పెంచేలా బాగా కట్ చేశారు.

సో సంక్రాంతి రేసులో నలుగురు రావడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వారసుడు పొంగలేనని ఇందాకే కొత్త పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. ఆది పురుష్ జనవరి 12ని నిన్నే నొక్కి వక్కాణించారు. బాలకృష్ణ వీరసింహారెడ్డి డేట్ డిసైడ్ చేయలేదు కానీ అదీ పండగ బరిలోనేనని కర్నూలులో జరిగిన ఈవెంట్ లో చెప్పేశారు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య తోడయ్యాడు. ఎవరూ వెనక్కి తగ్గే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. థియేటర్ల సమస్య రావడం ఖాయమే. చిరు బాలయ్యల నిర్మాతలు ఒకరే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో క్లాష్ కు సిద్ధపడుతున్నారు. వాల్తేరు వీరయ్య పోస్టర్ లో చిరు తల మీద పోలీసు టోపీ చూస్తుంటే ఏదో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉన్నట్టుంది

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş