iDreamPost
android-app
ios-app

జెర్సీ దర్శకుడికి మెగా ఛాన్స్ మిస్..

జెర్సీ దర్శకుడికి మెగా ఛాన్స్ మిస్..

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఇదయ్యాక జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరికి ఓ కమిట్ మెంట్ ఎన్నో నెలల క్రితమే ఇచ్చాడు. యువి క్రియేషన్స్ నుంచి అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఆ స్క్రిప్ట్ మీద నెలల తరబడి వర్క్ చేసిన గౌతమ్ ఫైనల్ గా చరణ్ ని కన్విన్స్ చేయలేకపోవడంతో ఆ ప్రాజెక్టు నుంచి బయటికి రావడం లేటెస్ట్ అప్ డేట్. ఈ వార్త ఎప్పుడో లీకైనా అధికారిక ముద్ర లేకపోవడంతో ఉండొచ్చేమోననే అంచనా ఇన్ని రోజులు కొనసాగింది. మెగా కాంపౌండ్ నుంచి కన్ఫర్మేషన్ రావడంతో ఇంకెలాంటి డౌట్ లేకపోయింది. అసలు తెరవెనుక ఏం జరిగిందనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది.

గౌతమ్ తిన్ననూరి ఎంత టాలెంటెడ్ డైరెక్టర్ అయినప్పటికీ మాస్ స్టార్ ని హ్యాండిల్ చేసిన అనుభవం లేదు. డెబ్యూ చిత్రం మళ్ళీ రావా సాఫ్ట్ జానర్. జెర్సీలో చాలా హై ఎమోషన్స్ ఉంటాయి. వాటినే యధాతథంగా హిందీలో షాహిద్ కపూర్ లాంటి పెద్ద హీరోతో చేస్తే నార్త్ ఆడియన్స్ తిరస్కరించారు. తెలుగులోనూ కమర్షియల్ గా అదేం అద్భుతాలు చేయలేదు. బ్రేక్ ఈవెన్ అందుకుని బోలెడు అవార్డులు తెచ్చింది. అందుకే ఇంత సెన్సిబుల్ డైరెక్టర్ చేయడమంటే చరణ్ కి ఎంతో కొంత రిస్క్ అవుతుంది. మగధీర తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ఆరంజ్ రూపంలో చరణ్, నిర్మాత నాగబాబు ఎంత చేదు అనుభవాన్ని ఎదురుకున్నారో తెలిసిందే.

ఇవన్నీ విశ్లేషించుకుని గౌతమ్ తో డ్రాప్ అయినట్టు తెలిసింది. అయినా అతను సిద్ధం చేసింది కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సబ్జెక్టే కానీ ఫైనల్ గా ఎక్కడ తేడా కొట్టిందో. ప్రస్తుతం గౌతమ్ విజయ్ దేవరకొండతో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు టాక్ ఉంది. సమంతా అనారోగ్యం వల్ల ఖుషికి బ్రేక్ రావడంతో ఆ గ్యాప్ లో ఏమైనా చేయొచ్చేమో ఆలోచిస్తున్నాడు విజయ్. పూరితో అనుకున్న జనగణమన క్యాన్సిల్ కావడంతో బోలెడంత టైం చేతిలో ఉంది. పైగా సుకుమార్ తో చేయాల్సిన సినిమా అసలెప్పుడు ఉంటుందో అంతు చిక్కడం లేదు. మరి గౌతమ్ విజయ్ దేవరకొండలు చేతులు కలుపుతారా వేచి చూడాలి. ఓకే అయితే దిల్ రాజు నిర్మాణంలో ఉండొచ్చు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet