iDreamPost
android-app
ios-app

కూలీ పనులకు వెళ్తూనే.. NIT లో సీటు సాధించిన గిరి పుత్రిక!

  • Published Jul 10, 2024 | 5:00 PM Updated Updated Jul 10, 2024 | 5:00 PM

Tribal Girl: కృషి పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని ఎంతోమంది విద్యార్థులు నిరూపించారు. సరస్వతి కటాక్షం ఉంటే చాలు.. పేదరికాన్ని జయించి గొప్ప చదువులు చదివి సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్న విద్యార్థులు దేశంలో ఎంతోమంది ఉన్నారు.

Tribal Girl: కృషి పట్టుదల ఉంటే పేదరికం అడ్డురాదని ఎంతోమంది విద్యార్థులు నిరూపించారు. సరస్వతి కటాక్షం ఉంటే చాలు.. పేదరికాన్ని జయించి గొప్ప చదువులు చదివి సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్న విద్యార్థులు దేశంలో ఎంతోమంది ఉన్నారు.

కూలీ పనులకు వెళ్తూనే.. NIT లో సీటు సాధించిన గిరి పుత్రిక!

నేటి పోటీ ప్రపంచంలో మంచి పొజీషన్ లో ఉండాలంటే మంచి చదువు చదవాలి. అందుకే తల్లిదండ్రులు తమ తలకు మించిన భారమైనప్పటికీ పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేర్పించి చదివిస్తారు.కొంతమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లలో చదివి మంచి మార్కులు సంపాదించి తల్లిదండ్రుల పేరు నిలబెడుతున్నారు. అలాంటి కోవలోకి వస్తుంది ఓ గిరి పుత్రిక. ఏ రోజుకు ఆరోజు కూలీ పనులు చేస్తే కానీ కడుపు నిండని దీన స్థితి. అయినా.. అందరిలా గొప్ప చదువులు చదవాలనేది ఆ బాలిక కోరిక. ఓ వైపు కూలీ పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు సాయపడుతూ.. మరోవైపు కష్టపడి జేఈఈలో సత్తా చాటింది. ఆ బాలిక విజయగాథ గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళితే..

చదువుకోవాలన్న పట్టుదల, దీక్ష ఉంటే పేదరికం ఏమీ అడ్డు రాదని ఓ గిరిజన పుత్రిక నిరూపించింది. ప్రతిరోజూ కూలీకి వెళ్తే కానీ కడుపు నిండని నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆ బాలిక ఉన్నత చదువులు చదవాలన్న కోరికతో చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివింది.ఫలితంగా దేశంలో కెల్లా అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షలో ఒకటైన జేఈఈ లో సత్తా చాటింది. ఏకంగా 73.8 శాతం స్కోర్ చేసి ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తిరుచ్చిలో సీటు సాధించింది. తమిళనాడు లోని తిరుచిరాపల్లికి చెందిన గిరిజన బాలిక పేరు రోహిణి ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది.

ఎన్ఐటీలో సీటు సంపాదించిన రోహిని మాట్లాడుతూ.. ‘నేను చిన్నప్పటి నుంచి గిరిజన పాఠశాలలో చదువుకున్నాను.. నా తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో ప్రతిరోజూ కూలికి వెళ్లేవారు. నేను కూడా నా తల్లిదండ్రులకు సాయంగా దినసరి కూలీకి వెళ్లేదాన్ని. సమయం ఉన్నపుడు చదువుకునేదాన్ని. ఓవైపు పనులకు వెళ్తూనే మరోవైపు చదువుకున్నా. బాగా చదవడంతో సీటు వచ్చింది. మా స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్ల కృషి వల్లే నేను పరీక్ష బాగా రాశా.. వారి దీవెనల వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. నాకు తిరుచ్చిలో ఎన్ఐటీలో సీటు వచ్చింది.. కాలేజ్ ఫీజు ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చింది. నాకు ఇంత గొప్ప సాయం చేస్తున్న సీఎం స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలియజేసింది.