Tirupathi Rao
Sandip University Nashik Providing World Class Education: విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో వరల్డ్ క్లాస్ విద్యను అందిస్తున్నారు. మెరిట్ స్టూడెంట్స్ కి అయితే స్కాలర్ షిప్ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ క్యాంపస్ వందల ఎకరాల్లో ఉంది.
Sandip University Nashik Providing World Class Education: విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో వరల్డ్ క్లాస్ విద్యను అందిస్తున్నారు. మెరిట్ స్టూడెంట్స్ కి అయితే స్కాలర్ షిప్ కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ క్యాంపస్ వందల ఎకరాల్లో ఉంది.
Tirupathi Rao
విద్యార్థుల జీవితంలో ఉన్నత విద్య అనేది ఎంతో ముఖ్యం. ఇంజినీరింగ్, ఎంబీఏ, డిగ్రీ ఇలా ఏది చదవాలన్నా ఒక మంచి విద్యాలయాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే పీజీ, డిగ్రీ అనేది వారి తర్వాతి జీవితానికి సోపానాలు వేస్తాయి. అందుకే తల్లిదండ్రులు, విద్యార్థులు ఒక మంచి క్యాంపస్ లో చదువుకోవాలి అనుకుంటారు. కానీ, చాలామందికి అలాంటి యూనివర్సిటీల గురించి పెద్దగా సమాచారం ఉండదు. కానీ, మీకోసం ఇప్పుడు ఒక స్పెషల్ యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నాం. దీని గురించే ఎందుకు ప్రత్యేకంగా అంటే.. అక్కడ అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కసారి అక్కడ చదువుకుంటే.. కెరీర్ పరుగులు పెట్టడం పక్కా. పైగా వాళ్లు 100 శాతం ప్లేస్మెంట్ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు.
ఈ విశ్వ విద్యాలయం పేరు సందీప్ యూనివర్సిటీ. ఇది నాసిక్ లో ఉన్న ఒక సెల్ఫ్ ఫండింగ్ యూనివర్సిటీ. విద్యార్థులకు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తున్న ఒక విశ్వ విద్యాలయం ఇది. దీనిని సందీప్ ఎన్.ఝా స్థాపించారు. ఒక ఇంజినీరింగ్ కాలేజీగా ప్రారంభమయ్యి.. 2017లో ఒక విశ్వవిద్యాలయంగా వెలిసింది. ఒక్క ఇంజినీరింగ్ మాత్రమే కాకుండా.. ఫార్మసీ, లా, ఎంబీఏ అంటూ అన్ని ఉన్నత విద్యా కోర్సులను అందిస్తోంది. పైగా ఇక్కడ బోధనా సిబ్దంది అంతా మంచి క్వాలిఫైడ్ వాళ్లే ఉన్నారు. అంతేకాకుండా.. బోధనా సిబ్బందిలో 80 శాతం మంది పీహెచ్ డీ చేసినవాళ్లే కావడం విశేషం.
ఈ యూనివర్సిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి చదువుకున్న వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఎందుకంటే ఆ యూనివర్సిటీని ఒక్కసారి విజిట్ చేస్తే విద్యార్థులు అక్కడే చదువుకోవాలి అంటారు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ, ఫెసిలిటీలు, బోధన, భోజన వసతులు, వసతి గృహాలు అన్నీ టాప్ క్లాస్ గా ఉంటాయి. ముఖ్యంగా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్నారు. అది కూడా అన్ని యూనివర్సిటీలతో పోలిస్తే.. చాలా తక్కువ ఖర్చుతోనే విద్యను అందిస్తున్నారు. మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతోనే ఇంత కృషి చేస్తున్నట్లు సందీప్ ఎన్.ఝా చెబుతూ ఉంటారు.
ఈ సందీప్ యూనివర్సిటీకి ప్రధాన బలం వారి ఇన్ ఫ్రాస్ట్రక్చర్. ఈ సందీప్ యూనివర్సిటీ నాసిక్ లో ఏకంగా 250 ఎకరాల్లో ఉంది. ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఇంత స్థలంలో ఉండటం చాలా అరుదుగా ఉంటుంది. 20 లక్షల స్వ్కేర్ ఫీట్ బిల్ట్ అప్ ఏరియాలో భవంతులు ఉన్నాయి. అత్యాధునిక క్లాస్ రూమ్స్, విద్యార్థులకు కావాల్సిన ల్యాబ్స్, వర్క్ షాప్స్, లైబ్రరీలు ఉన్నాయి. మంచి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని ఈ వర్సిటీలో అందిస్తున్నారు. అలాగే విద్యార్థులు ఆడుకునేందుకు మంచి మంచి క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ ఇలా అన్ని అవుట్ డోర్ గేమ్స్ కి క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. ఇన్ డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇలా కేవలం విద్య మాత్రమే కాకుండా పిల్లల వికాసానికి కూడా ఈ యూనివర్సిటీ బాటలు వేస్తోంది. మీరు మీ పిల్లలను ఇక్కడ జాయిన్ చేయడానికంటే ముందు నేరుగా వెళ్లి అక్కడి పరిస్థితులను చూసి.. వారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు.