డిఫెన్స్ సెక్టార్లో పనిచేస్తూ దేశానికి మీ పిల్లలు సర్వీస్ అందిస్తుంటే చూడాలని ఉందా? అయితే ఇది లక్కీ ఛాన్స్. సైనిక్ స్కూల్స్‌లో జాయిన్ అవ్వాలనుకునే వారికిది సువర్ణావకాశం.
డిఫెన్స్ సెక్టార్లో పనిచేస్తూ దేశానికి మీ పిల్లలు సర్వీస్ అందిస్తుంటే చూడాలని ఉందా? అయితే ఇది లక్కీ ఛాన్స్. సైనిక్ స్కూల్స్‌లో జాయిన్ అవ్వాలనుకునే వారికిది సువర్ణావకాశం.
డబ్బులు సంపాదించడానికి, లైఫ్‌ను లీడ్ చేయడానికి ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అయితే చాలా మటుకు జాబ్స్‌లో డబ్బులు మాత్రమే ఇంపార్టెంట్‌గా మారింది. కానీ కొన్ని ఉద్యోగాల్లో మాత్రమే గౌరవం లభిస్తుంది. పోలీస్, డాక్టర్, సోల్జర్.. అలాంటి కోవలోకే వస్తాయి. సమాజం కోసం నిరంతరం పాటుపడే రంగాల్లో ఇవీ ఉన్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుడికి సమాజంలో అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. చాలా మంది గ్రేట్ సోల్జర్స్‌ను చూసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లోకి వెళ్లాలని అనుకుంటారు. చిన్నప్పటి నుంచే దేశ రక్షణ రంగంలో పనిచేయాలని కలలుగనే స్టూడెండ్స్ ఎంతో మంది ఉంటారు. అలాంటి విద్యార్థులకు లక్కీ ఛాన్స్.
త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అవసరమైన అధికారులను స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే రెడీ చేసే టార్గెట్‌తో.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ (2024-25)లో ఆరో క్లాస్, తొమ్మిదో క్లాస్‌లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఎగ్జామ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. దేశంలోని 33 సైనిక స్కూళ్లలో 6, 9 క్లాసులకు.. కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపిన 19 కొత్త సైనిక స్కూళ్లల్లో నెక్స్ట్ ఇయర్ నుంచే ఈ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఉన్న ముఖ్యాంశాలు ఇవే..
– ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ డిసెంబర్ 16వ తేదీన సాయంత్రం 5 గంటల వరకు https://aissee.ntaonline.in/ అప్లయ్ చేసుకోవచ్చు.
– సైనిక్ స్కూల్స్ అన్నీ కూడా సీబీఎస్ఈ అనుబంధ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీతో పాటు ఇతర ట్రైనింగ్ అకాడమీస్‌కు ఇక్కడ క్యాడెట్లను రెడీ చేస్తారు.
– ఎంట్రన్స్ ఎగ్జామ్ జనవరి 21 (ఆదివారం)న నిర్వహిస్తారు. పెన్ను, పేపర్ (ఓఎంఆర్ షీట్) పద్ధతిలోనే పరీక్ష ఉంటుంది. ఇందులో అన్నీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్సే ఉంటాయి.
– ఈ ఎగ్జామ్‌ను దేశవ్యాప్తంగా 186 టౌన్స్/సిటీస్‌లో నిర్వహిస్తారు.
– ఆరో క్లాసుకు అప్లయ్ చేసుకొనే విద్యార్థులు మార్చి 31, 2024 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి.
– తొమ్మిదో క్లాసుకు దరఖాస్తు చేసుకొని అభ్యర్థుల వయసు 13 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండాలి. ఎనిమిదో క్లాసులో పాసై ఉండాలి.
– ఈ పరీక్షకు అప్లయ్ చేసుకొనే వారికి ఫీజ్ ఉంది. జనరల్, రక్షణ రంగంలో పనిచేస్తున్న వాళ్ల పిల్లలు, ఓబీసీలు (నాన్ క్రిమీలేయర్), ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు రూ.650, ఎస్సీ/ఎస్టీలకు రూ.500 చొప్పున ఫీజును నిర్ణయించారు.
ఇదీ చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కేఏ పాల్ బంపర్ ఆఫర్!